Site icon NTV Telugu

Odisha: రోగులపై వైద్యుడు లైంగిక వేధింపులు.. చితకబాదిన బంధువులు

Odisha

Odisha

రోగులపై ఓ వైద్యుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన ఒడిశాలోని కటక్‌లోని ఓ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. కాగా.. ఇద్దరు రోగులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వారి బంధువులు ఆ వైద్యుడిని చితకబాదారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.

Read Also: Physical Harassment: ట్యూషన్ కోసం వచ్చిన బాలికపై కన్నేసిన టీచర్.. అత్యాచారం

ఒడిశాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన హెల్త్‌కేర్ సెంటర్లలో ఒకటైన SCB మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఆగస్టు 11న ఈ సంఘటన జరిగింది. నిందితుడు కార్డియాలజీ విభాగంలో పనిచేస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోగులు ఎలక్ట్రో కార్డియోగ్రామ్ పరీక్ష (ఈసీజీ) కోసం ఆస్పత్రికి వచ్చారు. కాగా.. ఆ రోగులపై వైద్యుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ఆ తర్వాత వారి బంధువులు డాక్టర్ ను కొట్టినట్లు పోలీసులు తెలిపారు.

Read Also: Pappachan murder: “నాకంటూ ఎవరూ లేరు” అని చెప్పడమే పాపమైంది.. సంచలనంగా కేరళ మర్డర్ కేసు..

మంగళబాగ్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు రోగులపై లైంగిక దాడికి పాల్పడినందుకు డాక్టర్‌పై కేసు నమోదు చేసినట్లు అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అనిల్ మిశ్రా తెలిపారు. అనంతరం రోగుల స్టేట్‌మెంట్‌లు రికార్డు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం రోగులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందున.. వారు కోలుకోగానే వారి స్టేట్‌మెంట్‌లు రికార్డ్ చేస్తామని డీసీపీ చెప్పారు.

Exit mobile version