Site icon NTV Telugu

Naveen Patnaik: ఈదురుగాలుల్లో చిక్కుకున్న హెలికాఫ్టర్.. సీఎంకు తప్పిన ప్రమాదం

Ekekd

Ekekd

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ గాలివానలో చిక్కుకుంది. భారీ ఈదురుగాలులు వీయడంతో హెలికాఫ్టర్ కుదుపులకు గురైంది. దీంతో పైలట్ అప్రమత్తమై ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ల్యాండింగ్‌కు అనుమతించలేదు. దీంతో చక్కర్లు కొట్టి మరో ప్రాంతంలో ల్యాండింగ్ చేశాడు.

ఇది కూడా చదవండి: Sachin Tendulkar: రాత్రిళ్లు పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి.. సచిన్ పొరుగింటి వ్యక్తి ఫిర్యాదు!

గత కొద్ది రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. అయితే సోమవారం సాయంత్రం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారింది. దీంతో అక్కడక్కడా వర్షం కురుస్తూ గాలి బీభత్సం సృష్టించింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో గాలివాన తీవ్రతరమైంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హెలికాప్టర్ భువనేశ్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ కాలేదు.

ఇది కూడా చదవండి: Child Marriage: 13 ఏళ్ల బాలికకు 70 ఏళ్ల వృద్ధుడితో పెళ్లి.. ఎక్కడంటే..?

ఎన్నికల ప్రచారం ముగించుకుని ఖరియార్ నుంచి తిరిగి వస్తుండగా.. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, సీనియర్ బీజేడీ నాయకుడు కార్తిక్ పాండియన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ చేయడానికి సాధ్యపడలేదు. దీంతో హెలికాప్టర్‌ 30 నిమిషాల పాటు భువనేశ్వర్ విమానాశ్రయంపై తిరుగుతూ ఝర్సుగూడకు బయలుదేరింది. జరిగిన సంఘటన పార్టీ నేతలను ఒక్కసారిగా భయానికి గురిచేసింది. ఝర్సుగూడలో ముఖ్యమంత్రి హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. నవీన్ పట్నాయక్, బీజేడీ సీనియర్ నేత కార్తిక్ పాండియన్ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇటీవల మహారాష్ట్రలో కూడా ఒక హెలికాఫ్టర్ కూలిపోయింది. శివసేన నేతను తీసుకెళ్లేందుకు వస్తుండగా ల్యాండింగ్ అవుతుండగానే కుప్పకూలిపోయింది. పైలట్ చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఇక హెలికాఫ్టర్ ధ్వంసమైంది. ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీల నేతలు ప్రైవేటు హెలికాఫ్టర్లను ఉపయోగిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Vande Bharat: అతిత్వరలో వందే భారత్ స్లీపర్ ట్రెయిన్స్.. ఫీచర్స్ ఇలా..

Exit mobile version