NTV Telugu Site icon

BJP: ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన వారికి ప్రతి నెలా రూ. 20 వేల పింఛను?

Odisha

Odisha

ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన వారికి ప్రతినెలా రూ.20వేలు, వైద్య సదుపాయాలు కల్పిస్తామని ఒడిశా బీజేపీ ప్రభుత్వం పెద్ద ప్రకటన చేసింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ చేతిలో చిత్రహింసలకు గురైన ఒడిశా ప్రజలకు ప్రభుత్వం వైద్య ఖర్చులతో పాటు పింఛను అందజేస్తుందని ప్రభుత్వం తెలిపింది.

READ MORE: Flipkart Monumental Sale 2025: ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్‌ సేల్.. భారీ డిస్కౌంట్‌లు.. ఇప్పుడు కొనకపోతే నష్టపోతారు!

అంతకుముందు జనవరి 2న ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ అంతర్గత భద్రతా చట్టం, డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ లేదా డిఫెన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా రూల్స్ కింద ఎమర్జెన్సీ సమయంలో అరెస్టయి జైలుకెళ్లిన వారికి నెలవారీ పెన్షన్‌ను అందజేస్తామని ప్రకటించారు. ఎమర్జెన్సీ సమయంలో జైలుకెళ్లిన వారందరికీ పెన్షన్‌తోపాటు వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని పేర్కొన్నారు. 2025 జనవరి 1 వరకు జీవించి ఉన్న వారందరికీ పింఛను, వైద్య సదుపాయాలు అందజేస్తామని చెప్పారు.

READ MORE: India-Bangladesh: బంగ్లాదేశ్‌ డిప్యూటీ హైకమిషనర్‌కు భారత్ సమన్లు..

25 జూన్ 1975 – 21 మార్చి 1977 మధ్య ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు వందలాది మంది ప్రజలు దేశవ్యాప్తంగా వివిధ జైళ్లలో బంధించిన విషయం తెలిసిందే. ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం గడిపి.. ప్రాణాలతో బయటపడిన వారికి (జనవరి 1, 2025 వరకు) పెన్షన్ మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇటీవల ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో రాష్ట్ర ప్రభుత్వం 18వ ఇండియన్ ఓవర్సీస్ సదస్సును నిర్వహించింది. మూడు రోజుల పాటు జరిగిన సదస్సులో ప్రపంచం నలుమూలల నుంచి ఎన్నారైలు పాల్గొన్నారు.

Show comments