Site icon NTV Telugu

ICC ODI World Cup 2023: గుడ్ న్యూస్.. వన్డే వరల్డ్ కప్ టికెట్స్ విడుదలకు డేట్ ఫిక్స్

Jayshah

Jayshah

అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 19 వరకు భారత గడ్డపై జరుగనున్న వన్డే ప్రపంచకప్ ను ఐసీసీ నిర్వహిస్తుంది. ఇప్పటికే మ్యాచ్‌లు జరిగే వేదికలు, మ్యాచ్‌ షెడ్యూల్‌ వివరాలను బీసీసీఐ వెల్లడించింది. తాజాగా వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన మ్యాచ్‌ల టికెట్లను ఆగస్టు 10 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. అయితే, బీసీసీఐ కార్యదర్శి జైషా ఢిల్లీలో.. మ్యాచ్‌లు జరుగనున్న అన్ని రాష్ట్రాల క్రికెట్‌ అసోసియేషన్లతో గురువారం మీటింగ్‌ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో పలు అంశాలపై చర్చించిన అనంతరం టికెట్ల జారీ విషయంపై కీలక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. వన్డే వరల్డ్‌కప్‌లో జరిగే మ్యాచ్‌లకు హాజరయ్యే అభిమానులు తప్పనిసరిగా ఫిజికల్‌ టికెట్లు తీసుకెళ్లాలని.. ఆన్‌లైన్‌ టికెట్లకు పర్మిషన్ లేదని పేర్కొన్నారు.

Read Also: Yamudu: భూమిపైకి ‘యముడు’.. నరకంలో శిక్షలు ఇక్కడే అమలు పరిస్తే?

కాగా అభిమానులు ఫిజికల్‌ టికెట్లను పొందడానికి 7-8 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈసారి ఈ-టికెట్‌ని ఉపయోగించలేమని బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపారు. ఫిజికల్ టిక్కెట్లు పొందడానికి కేంద్రాలను ముందుగానే ప్లాన్ చేశామన్నారు. అహ్మదాబాద్, లక్నో వంటి పెద్ద కెపాసిటీ స్టేడియంలలో ఈ-టికెట్ల నిర్వహణ చాలా కష్టం.. మేం ముందుగా ద్వైపాక్షిక సిరీస్‌లలో ఈ-టికెటింగ్‌ని అమలు చేసి ఆపై ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నమెంట్‌లకు తీసుకెళ్లాలని మా ప్రణాళిక.. ప్రపంచకప్ టిక్కెట్ల ధరతో సహా అన్నీ త్వరలో ప్రకటిస్తామంటూ చెప్పుకొచ్చాడు.

Read Also: Belly Fat:ఈ డ్రింక్ ను తాగితే 7 రోజుల్లోనే కొవ్వు మైనంలా కరిగిపోతుంది..

ఇక ప్రోటోకాల్‌ ప్రకారం.. ఐసీసీ, బీసీసీఐలు ఒక్కో మ్యాచ్ కు 300 హాస్పిటాలిటీ టిక్కెట్‌లను తీసుకోనున్నాయి. ఇక రాష్ట్రాల క్రికెట్‌ అసోసియేషన్‌లు ఐసీసీకి 1295 లీగ్ గేమ్ టిక్కెట్లతో పాటు.. బీసీసీఐకి సంబంధించిన 1355 టికెట్లను.. వీటితో పాటు సెమీ-ఫైనల్ మ్యాచ్‌ల టిక్కెట్లను కూడా అందించనున్నాయి. మరో 500 జనరల్ టిక్కెట్లను మాత్రం సదరు క్రికెట్‌ అసోసియేషన్స్‌ బీసీసీఐకి ఫ్రీగా అందించనున్నాయి.

Exit mobile version