Here is All the records broken in Cricket World Cup 2023 so far: భారత గడ్డపై ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ 2023 రసవత్తరంగా సాగుతోంది. టోర్నీ మొదటి మ్యాచ్‌లో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు షాక్ తగలగా.. ఆపై ఐదుసార్లు వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియాకు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. టోర్నీలో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు జరగ్గా.. పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 9వ స్థానంలో ఉండి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మరోవైపు ప్రపంచకప్ 2023లో ఇప్పటివరకు చాలా రికార్డ్స్ బద్దలు అయ్యాయి. ఇప్పటివరకు బద్దలుకొట్టబడిన రికార్డుల జాబితాను ఐసీసీ పంచుకుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Mitchell Starc CWC Fastest to 50 Wickets:
వన్డే ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు (19 ఇన్నింగ్స్‌లు) తీసిన బౌలర్‌గా ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ నిలిచాడు. 2015లో 22 వికెట్లు తీసిన స్టార్క్.. 2019లో 27 వికెట్లు తీశాడు. శ్రీలంక మాజీ ఆటగాడు లసిత్ మలింగ 25 ఇన్నింగ్స్‌లలో 50 వికెట్లు పడగొట్టాడు. మాజీ ఆటగాళ్లు గ్లెన్ మెక్‌గ్రాత్, ముత్తయ్య మురళీధరన్ 30 ఇన్నింగ్స్‌లలో ఈ మార్క్‌ను అందుకున్నారు.
Aiden Markram CWC Fastest Century:
వన్డే ప్రపంచకప్‌లో కెవిన్ ఓబ్రియన్ వేగవంతమైన సెంచరీ (50 బంతుల్లో) రికార్డును బద్దలు కొట్టడానికి 12 సంవత్సరాలు పట్టింది. వన్డే ప్రపంచకప్ 2023లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఐడెన్ మార్క్రమ్ 49 బంతుల్లో శతకం చేశాడు.
South Africa CWC Biggest Team Total:
వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. ప్రపంచకప్ 2023లో భాగంగా ఢిల్లీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ప్రొటీస్ 428/5 స్కోర్ చేసింది. అంతకుముందు ప్రపంచకప్ 2015లో అఫ్గానిస్తాన్ జట్టుపై ఆస్ట్రేలియా 417/6 స్కోర్ చేసింది.
Pakistan CWC Biggest Successful Chase:
పురుషుల వన్డే క్రికెట్ ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక ఛేజింగ్ రికార్డు పాకిస్తాన్ నెలకొల్పింది. హైదరాబాద్‌లో శ్రీలంక నిర్ధేశించిన 345 పరుగుల లక్ష్యాన్ని పాక్ చేధించింది. మహ్మద్ రిజ్వాన్ మరియు అబ్దుల్లా షఫీక్ సెంచరీలు బాదారు. 2011 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టుపై ఐర్లాండ్ 329 రన్స్ చేధించింది.
Also Read: KS Bharat: టీమిండియా క్రికెటర్ కేఎస్ భరత్‌కు ఏపీ ప్రభుత్వం వరాలు!
Rohit Sharma CWC Most Hundreds:
వన్డే ప్రపంచకప్ చరిత్రలో రోహిత్ శర్మ అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ కేవలం 19 ఇన్నింగ్స్‌లలో 7 శతకాలు చేశాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 44 ఇన్నింగ్స్‌లలో 6 సెంచరీలు బాదాడు.
Rohit Sharma Most International Sixes:
అంతర్జాతీయ క్రికెట్‌లో (టెస్ట్, వన్డే, టీ20) అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా టీమిండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ రికార్డుల్లో నిలిచాడు. రోహిత్ ఇప్పటివరకు 453 మ్యాచ్‌లు ఆడి 556 సిక్స్‌లు బాదాడు. గతంలో ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (553) పేరిట ఉండేది.