NTV Telugu Site icon

World Cup 2023: నన్ను కొట్టనందుకు చాలా థాంక్స్.. బ్యాటర్‌కు చేతులు జోడించి నమస్కరించిన బౌలర్! వీడియో వైరల్

Paul Van Meekeren, Daryl Mitchell

Paul Van Meekeren, Daryl Mitchell

Paul Van Meekeren Namaste’ gesture to Daryl Mitchell during NZ vs NED Match: క్రికెట్ ఆటలో బ్యాటర్‌, బౌలర్ మధ్య వాగ్వాదాలు జరగడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. బ్యాటర్‌ బౌండరీల వర్షం కురిపించినప్పుడు.. బౌలర్ అసహనంలో ఏదో అనడం, బ్యాట్స్‌మెన్ రియాక్ట్ అవ్వడం చకచకా జరిగిపోతుంటుంది. అలానే బౌలర్ బాగా బౌలింగ్ చేసినపుడు కూడా బ్యాటర్‌ స్పందిస్తుంటాడు. అయితే తాజాగా ఇందుకు బిన్నంగా ఓ ఘటన చోటుచేసుకుంది. బ్యాటర్‌కు బౌలర్ చేతులు జోడించి నమస్కరించాడు. ఈ ఘటన ప్రపంచకప్ 2023లో చోటుచేసుకుంది.

సోమవారం హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌, నెదర్లాండ్స్‌ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్ డారెల్ మిచెల్ మెరుపు షాట్ ఆడాడు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్ 39వ ఓవర్లో డచ్ పేసర్ వాన్ మీకెరెన్ వేసిన బంతిని మిచెల్ బలంగా కొట్టాడు. బంతి నేరుగా నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లోని స్టంప్‌లను గిరాటేసింది. బంతి కళ్లు మూసి తెరిచే లోపు స్టంప్‌లను తాకింది. ఇది చూసిన మీకెరెన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

Also Read: World Cup 2023: కెమెరాకు అడ్డంగా దొరికిపోయిన సూర్యకుమార్ యాదవ్‌.. ఆడేసుకుంటున్న నెటిజన్స్!

బంతి తనకు తాకనందుకు పేసర్ వాన్ మీకెరెన్ సంతోషించాడు. అందుకే బ్యాటర్‌ డారెల్ మిచెల్‌కు చేతులు జోడించి నమస్కరించాడు. ఇది చూసిన మిచెల్ పేర్లదు అన్నారు ఓ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్స్.. మీకెరెన్ చేసిన పని అద్భుతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను ఐసీసీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘నన్ను కొట్టనందుకు ధన్యవాదాలు’ అని క్యాప్షన్ ఇచ్చింది. వీడియో చూసిన ఫాన్స్ తృటిలో పెను ప్రమాదం తప్పింది అని కామెంట్స్ చేస్తున్నారు.