October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
October 2026 Rule Changes: అక్టోబర్ వచ్చేస్తోంది.. పండగల సందడితో పాటు మన జేబులపై ప్రభావం చూపే కొన్ని ముఖ్యమైన మార్పులు కూడా ఈ నెల నుంచే అమల్లోకి రాబోతున్నాయి. బ్యాంకింగ్, స్మాల్ సేవింగ్స్, గ్యాస్ సిలిండర్, ఐటీఆర్ మాత్రమే కాదు.. పండగకి కొత్త కార్లు లేదా టీవీ, ఏసీలు కొందామనుకునే వారికి కూడా ఈ అప్డేట్స్ తెలుసుకోవడం చాలా అవసరం. ముందుగా చిన్న మొత్తాల పొదుపు పథకాల విషయానికి వస్తే.. పీపీఎఫ్, ఎన్ఎస్సీ, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పోస్టాఫీస్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుందనే సంగతి తెలిసిందే. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో వీటిలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇప్పుడు అక్టోబర్-డిసెంబర్ కాలానికి గాను కొత్త వడ్డీ రేట్లను ప్రకటించనున్నారు. ఇవి మారితే.. మనం పొదుపు చేసుకునే డబ్బుపై ఎంత రాబడి వస్తుందో ఒక స్పష్టత వస్తుంది.
ఇక ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం అక్టోబర్ 5 నుంచి 7 వరకు జరగనుంది. చివరి రోజైన అక్టోబర్ 7న రెపో రేటుపై ప్రకటన వెలువడుతుంది. ప్రస్తుతం రెపో రేటు 5.25 శాతంగా ఉంది. ఎస్బీఐ రీసెర్చ్ అంచనా ప్రకారం ఈసారి రెపో రేటును 0.25 శాతం పెంచే అవకాశం ఉంది. ఒకవేళ ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంటే.. రాబోయే రోజుల్లో బ్యాంక్ లోన్లు, ఎఫ్డీలపై వడ్డీ రేట్లలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎస్బీఐ శాలరీ ప్యాకేజ్ అకౌంట్ వాడుతున్న వారికి అక్టోబర్ 1 నుంచి ఒక కీలక మార్పు రాబోతోంది. ఇప్పటివరకు వేరే బ్యాంక్ ఏటీఎంలు లేదా ఏడీడబ్ల్యూఎంల నుంచి నెలకు 10 సార్లు ఉచితంగా క్యాష్ తీసుకునే వెసులుబాటు ఉండగా, దాన్ని ఇప్పుడు 5 సార్లకు తగ్గించారు. ఉచిత పరిమితి దాటితే.. డబ్బులు తీసే ప్రతి విత్‌డ్రాయల్‌పై రూ. 23 ప్లస్ జీఎస్టీ, బ్యాలెన్స్ చెకింగ్ వంటి నాన్-ఫైనాన్షియల్ లావాదేవీలపై రూ. 11 ప్లస్ జీఎస్టీ ఛార్జీగా పడుతుంది.
Also Read
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
- Truecaller Scam Checker: ఆన్లైన్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు Truecaller కొత్త ఫీచర్.. నంబర్, లింక్, మెసేజ్ అన్నీ ఒకేచోట చెక్..
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) విషయానికి వస్తే.. ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తున్నాయి. రూ. 3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో చేసే బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను నిర్ణయించేందుకు బ్యాంకులకు మరింత స్వేచ్ఛనిచ్చారు. దాంతో పాటు బ్యాంకులు ఈ రేట్లను స్పష్టంగా వెల్లడించాల్సి ఉంటుంది. అయితే, సాధారణ రిటైల్ ఎఫ్‌డీల వడ్డీ రేట్లు మాత్రం బ్యాంకులు తమ అవసరాలకు తగినట్లుగానే నిర్ణయిస్తాయి కాబట్టి, సగటు కస్టమర్ల ఎఫ్డీలపై ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. మరోవైపు ఎస్బీఐ బీఎస్‌బీడీ (బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్) ఖాతాదారులకు నెలకు మొదటి 4 క్యాష్ విత్‌డ్రాయల్స్ మాత్రమే ఉచితంగా లభిస్తాయి. ఆ తర్వాత చేసే ప్రతి విత్‌డ్రాయల్‌పై రూ. 15 ప్లస్ జీఎస్టీ ఛార్జ్ చేస్తారు. మనం ఆధార్ ద్వారా డబ్బులు తీసే ‘ఏఈపీఎస్’ (AePS) లావాదేవీలు కూడా ఈ ఉచిత పరిమితి కిందకే వస్తాయి. అయితే డిజిటల్ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు ఉండవు కాబట్టి క్యాష్ ఎక్కువగా వాడేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి.
ఇక ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు వాడుతున్న వారు అక్టోబర్ 1 నుంచి సబ్సిడీ పొందాలంటే ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి. దీన్ని గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో గానీ, గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి గానీ, లేదా సంబంధిత గ్యాస్ కంపెనీ మొబైల్ యాప్ ద్వారా అయినా పూర్తి చేసుకోవచ్చు. అలాగే యూపీఐ ద్వారా వ్యాపారులకు చేసే లావాదేవీల్లో (Merchant Payments) రూ. 2,000 కంటే ఎక్కువ మొత్తాలపై కొత్త ఎమ్ డీ ఆర్ (MDR) నిబంధనలు అమల్లోకి వస్తాయి. అయితే ఈ భారం కస్టమర్లపై పడదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎన్ఆర్ఐల నుంచి ఆస్తి లేదా ప్రాపర్టీ కొనుగోలు చేసేవారికి ఇకపై ప్రత్యేకంగా ‘టాన్’ (TAN) అవసరం లేదు, నేరుగా పాన్ (PAN) కార్డ్‌తోనే ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ఇన్కమ్ టాక్స్ విషయానికొస్తే.. టాక్స్ ఆడిట్ పరిధిలోకి వచ్చే పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్ (ITR) సమర్పించడానికి అక్టోబర్ 31 ఆఖరి తేదీ. కాబట్టి మీ పన్ను పరిస్థితిని బట్టి ఈ డెడ్‌లైన్ గుర్తుంచుకోవడం మంచిది. మరోవైపు ఆన్లైన్ షాపింగ్ చేసే వినియోగదారుల రక్షణ కోసం ప్రభుత్వం కొన్ని నిబంధనలు తెచ్చింది. ఇ కామర్స్ సైట్లలో ప్రొడక్ట్ రిటర్న్-రీఫండ్ పాలసీలు, వారంటీ, డెలివరీ తేదీల వివరాలు స్పష్టంగా ఉంచాలి. ఒకవేళ అది విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వస్తువు అయితే, దానిని దిగుమతి చేసుకున్న సంస్థ వివరాలు, ఆ దేశం పేరు స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఇక పండగల సీజన్లో కొత్త కార్లు లేదా హోమ్ అప్లయెన్సెస్ కొందామనుకునే వారికి కాస్త చేదు వార్త అనే చెప్పాలి. మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి దిగ్గజ కంపెనీలు తమ కొన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచేశాయి. కాపర్, అల్యూమినియం, స్టీల్, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, రవాణా ఖర్చులు ఎక్కువవ్వడం వల్ల ఏసీల ధరలు 5 నుండి 8 శాతం వరకు, ఎల్ఈడీ టీవీలు, ఫ్రిజ్ లు, వాషింగ్ మెషీన్ల ధరలు 3 నుండి 4 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. చూశారుగా.. బ్యాంకింగ్ లావాదేవీల నుంచి ఇంటి బడ్జెట్ వరకు అక్టోబర్‌లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాబట్టి ప్లాన్ చేసుకుని అడుగులు వేస్తే అనవసరమైన ఛార్జీలు తగ్గించుకుని ఖర్చులను అదుపులో ఉంచుకోవచ్చు!
తాజావార్తలు
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Bloody Romeo : నాని సరసన నాజూకు బ్యూటీ..
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
-
Truecaller Scam Checker: ఆన్లైన్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు Truecaller కొత్త ఫీచర్.. నంబర్, లింక్, మెసేజ్ అన్నీ ఒకేచోట చెక్..
-
Fauji vs Spirit: రిలీజ్ ప్లాన్‌లో మార్పులు.. ‘ఫౌజీ’ కంటే ముందే ‘స్పిరిట్’?
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!