Site icon NTV Telugu

Black Magic : కైకలూరులో క్షుద్ర పూజల కలకలం

Black Magic

Black Magic

ఏలూరు జిల్లా కైకలూరులో క్షుద్ర పూజల కలకలం రేపుతుంది. కైకలూరు మండలం వేమవరం పాడు గ్రామంలో రాత్రి క్షుద్ర పూజలు చేస్తున్నారని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో హుటాహుటిన పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. పోలీసులు
గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన చెరువుపై పూజ చేసుకుంటుండగా క్షుద్ర పూజ అనే అనుమానంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. క్షుద్ర పూజ కాదు చెరువుకు చేసే పూజ అని చెరువు యజమాని గ్రామస్తులకు చెప్పడంతో గ్రామస్తులు శాంతించారు. పోలీసలు జోక్యంతో వివాదం కాస్తా పోలీస్ స్టేషన్ కు చేరింది. పూజలు నిర్వహిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.

Also Read : Rajastan : మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 12మంది చిన్నారులను కాపాడిన రెస్క్యూ టీం

వేమంపాడు గ్రామంలో కొత్తగా తవ్వించిన చెరువుకు పూజ చేస్తుండగా గ్రామస్థులు అడ్డుకోవడంతో గొడవ పెద్దది అయింది. దీంతో తాను తన చెరువుకు పూజలు మాత్రమే చేస్తున్నాను.. క్షుద్ర పూజలు చేయడం లేదని చెరువు యాజమాని చెప్పిన కూడా గ్రామస్థులు వినలేదు. దీంతో ఈ విషయం కాస్తా పోలీసుల దగ్గరకు వెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చెరువు యాజమానిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కొత్తగా నిర్మించిన చెరువుకు శాంతిపూజలు చేస్తున్నట్లు సదరు చెరువు యాజమాని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే వేమంపాడు గ్రామంలో ఎటువంటి ఆందోళనలు జరుగకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా అప్రమత్తం అయ్యారు. గ్రామంలో భారీగా భద్రత ఏర్పాటు చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరుగకుండా తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామి ఇచ్చారు.

Also Read : Cameron Green : అప్పుడు విమర్శలు.. ఇప్పుడు ప్రశంసలు

Exit mobile version