Site icon NTV Telugu

Obulapuram Mining Case : ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు.. కోర్టుకు చేరుకున్న గాలి జనార్దన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి

Obulapuram Minning Case

Obulapuram Minning Case

Obulapuram Mining Case : అనంతపురం జిల్లా ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ (ఓఎంసీ) కేసులో కీలక మలుపు వచ్చింది. హైదరాబాద్‌ సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం ఈ కేసులో తుది తీర్పు వెలువరించనుంది. ఈ కేసు దాదాపు 15 ఏళ్లుగా నడుస్తూ వస్తోంది. 2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం సీబీఐకి దర్యాప్తు బాధ్యతలను అప్పగించింది. 2011లో మొదటి ఛార్జిషీట్‌ దాఖలైంది. అనంతరం మిగతా నిందితులపై అనుబంధ అభియోగ పత్రాలు దాఖలయ్యాయి. మొత్తం కేసులో తొమ్మిది మందిని నిందితులుగా చేర్చారు.

No Phones : ఉపాధ్యాయులపై విద్యాశాఖ కఠిన నిర్ణయం

ఈ నేపథ్యంలోని నాంపల్లి సీబీఐ కోర్టుకు గాలి జనార్దన్ రెడ్డి, ఆయన వ్యక్తిగత సహాయకుడు మెఫజ్ అలీఖాన్‌, బీవీ శ్రీనివాసరెడ్డి, ఓఎంసీ కంపెనీ, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వి.డి. రాజగోపాల్, మాజీ ఐఏఎస్‌ అధికారి కృపానందం, అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు చేరుకున్నారు. వీరిదేవరా భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్లు, అలాగే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ ల కింద అభియోగాలు నమోదయ్యాయి. విచారణ దశలో నిందితుల్లో ఒకరైన లింగారెడ్డి మృతి చెందగా, 2022లో హైకోర్టు శ్రీలక్ష్మిని కేసు నుంచి విముక్తి కలిగించింది. ఇక సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మే లోపల విచారణ పూర్తిచేయాల్సి ఉండటంతో గత నెల వాదనలు ముగిశాయి. ఈ నేపథ్యంలో మిగిలిన నిందితులపై సీబీఐ కోర్టు తీర్పు ఇవాళ వెలువరించనుంది.

Hyderabad Metro : మెట్రో ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్‌.. ఛార్జీలు పెంపు..

Exit mobile version