Site icon NTV Telugu

NVSS Prabhakar : కేసీఆర్‌కు నీతి ఆయోగ్ ప్రాధాన్యత తెలియదు అనుకుంటా..

Nvss Prabhakar

Nvss Prabhakar

BJP Leader NVSS Prabhakar Criticized CM KCR
సీఎం కేసీఆర్‌ శనివారం సాయంత్రం మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ.. నీతి ఆయోగ్‌ పై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నీతి ఆయోగ్ మీటింగ్ లో పాల్గొనను అని అనేక మాటలు మాట్లాడారని, సీఎం కు నీతి ఆయోగ్ ప్రాధాన్యత తెలియదు అనుకుంటా అని వ్యాఖ్యానించారు. మమత బెనర్జీ, అరవింద్ క్రేజీవాల్ రాజకీయంగా వ్యతిరేకిస్తారు కానీ నీతి ఆయోగ్ సమావేశం లో పాల్గొంటున్నారు అని, కల్వకుంట్ల రాజ్యాంగం ప్రకారం ఆయన పాల్గొన వద్దు అనుకుంటున్నారు కావచ్చని విమర్శించారు. తెలంగాణ కేబినెట్ సమావేశంలో మంత్రులు పాలసీ నిర్ణయాలో మాట్లాడినరా..? సీఎం కేసీఆర్ అన్ని మాట్లాడుతారు.. సీఎస్ ఎజెండా చదువుతారు.. మంత్రులు ఎప్పుడైన మాట్లాడినరా..? కలెక్టర్ సమావేశలలో ఎప్పుడైన వారి అభిప్రాయాలు తీసుకున్నారా…? అని ప్రశ్నించారు.

 

ఇచ్చిన నిధులు వాడుకోలేదని నిన్న నీతి ఆయోగ్ విడుదల చేసిన ప్రెస్ నోట్ ద్వారా తెలుస్తోందని, స్టేట్ ప్లానింగ్ కమిషన్.. ఫైనాన్స్ కమిషన్ ఏనాడైన  సమావేశలు నిర్వహించిన సందర్భలు ఉన్నాయా..? రాజకీయాలు, రాజకీయ నియామకాల కొరకు కార్పోరేషన్ ఏర్పాటు చేసింది.. కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుక వచ్చి కమిషన్ లు పంచుకున్నారు.. నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాలను ఒకే దృష్టి తో చూ స్తుంది.. రాష్ట్రలు, కేంద్రము కూర్చొని మాట్లాడుకోవడానికే  నీతి ఆయోగ్ మీటింగ్.. ముఖ్యమంత్రి మాట్లాడనికే  కలెక్టర్స్ మీటింగ్ పెడుతాడు.. వాళ్ళ నుండి ఫీడ్ బ్యాక్ తీసుకునే ఆలోచనే ఉండదు..

Exit mobile version