NTV Telugu Site icon

Muddaraboina Venkateswararao: వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!

Muddaraboina

Muddaraboina

Muddaraboina Venkateswararao: ఎన్నికల సమయంలో ఏపీ పాలిటిక్స్‌ కాకరేపుతున్నాయి.. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు.. సీట్లు దక్కకపోవడంతో విపక్షాల వైపు చూస్తుంటే.. ఇక, సుదీర్ఘంగా విపక్షంలో పనిచేసే.. ఈసారి టికెట్‌ వచ్చే అవకాశం లేదని తేలడంతో.. మరికొందరు నేతలు అధికార పార్టీకి దగ్గరవుతున్నారు. ఇప్పుడు నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు.. వైసీపీకి గూటికి చేరేందుకు సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది.. ఈ రోజు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలోకి వచ్చారు ముద్రోయిన.. దీంతో.. ఆయన టీడీపీకి గుడ్‌బై చెప్పేసి.. వైసీపీలో చేరుతారని.. ఫ్యాన్‌ పార్టీ కండువా కప్పుకోవడానికి ఆయన క్యాంప్‌ ఆఫీస్‌కు వచ్చారనే చర్చ నడుస్తోంది. అయితే, తనకు టీడీపీ అధినేత చంద్రబాబు అన్యాయం చేశాడని నిన్న కార్యకర్తల సమావేశంలో ముద్రబోయిన వెంకటేశ్వరరావు కన్నీళ్లు పెట్టుకున్న విషయం విదితమే.

Read Also: Pakistan: పెళ్లి వేడుకలో గ్యాంగ్‌స్టర్ హత్య

కాగా, నూజివీడు టీడీపీలో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి.. ఇక్కడ ఇంఛార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, అనధికారిక ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్న వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే పార్థసారధి మధ్య కోల్డ్ వార్ ముదిరిపోయింది.. పెనమలూరు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్ధసారథి.. వచ్చే ఎన్నికల్లో నూజివీడు నుంచి టీడీపీ తరపున బరిలోకి దిగటానికి అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారట. దీంతో, నూజివీడులో తన వర్గాన్ని పూర్తిస్థాయిలో మోహరించిన సారథి.. పార్టీలోకి అధికారికంగా చేరకపోయినా ఇంఛార్జ్‌గా తాను చేయాల్సిన పనులను పెనమలూరు నుంచే చక్కబెట్టేస్తున్నారట. అయితే, ఈ పరిణామాలన్నీ కూడా నూజివీడు టికెట్ ఆశిస్తున్న ప్రస్తుత ఇంఛార్జ్‌ ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు నచ్చడం లేదు.. ఇక, తాజాగా నిర్వహించిన సమావేశంలో.. కార్యకర్తల నిర్ణయమే నా నిర్ణయం అంటూ తేల్చి చెప్పారుముద్దరబోయిన.. ఈ సందర్భంగా ముద్దరబోయిన మాట్లాడుతూ… గత రెండు సందర్భాలలో ఓడిపోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు తెలుగుదేశం కుటుంబంలోనే కలిసి ఉన్నాం ఫలితం పొందే సమయానికి అభ్యర్థి మార్పు అంటూ ప్రచారం సాగుతుంది. 10 సంవత్సరాలలో ఇంటింటికి వెళ్లా, ప్రతి వ్యక్తిని కలిసా ప్రజా సమస్యలు తెలుసుకున్నా.. గెలుపు టీడీపీ దేనని ప్రజల మాట, అధిష్టానం నిర్ణయంపై కార్యకర్తలు మీరు చెప్పే మాట నేను ఆచరిస్తాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ముద్దరబోయిన.. దీంతో.. ఆయన సైకిల్‌ దిగి.. ఫ్యాన్‌ కిందకు చేరతారని తెలుస్తోంది.