NTV Telugu Site icon

Nuzvid IIIT: విద్యార్థులకు నూజివీడు ట్రిపుల్ ఐటీ అధికారులు షాక్!

Nuzvid

Nuzvid

Nuzvid IIIT: విద్యను ముగించుకొని ఇంటికి వెళ్ళబోతున్న విద్యార్థులకు నూజివీడు ట్రిపుల్‌ ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా నూజివీడు , శ్రీకాకుళం , ఇడుపులపాయ , ఒంగోలు క్యాంపస్‌లలో ఫీజులు చెల్లించని 4వేల మంది ఆఖరి ఏడాది పూర్తి చేసుకున్న విద్యార్థులకు ధ్రువపత్రాలను ఆర్జీయూకేటీ నిలిపివేసింది. విద్యా దీవెన , వసతి దీవెన పథకాల ద్వారా తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ అయినా ఫీజులను తల్లిదండ్రులు చెల్లించలేదు. విద్య పూర్తి చేసుకొని ఇంటికి వెళ్దామనుకున్న విద్యార్థులకు యాజమాన్యం ధ్రువీకరణ పత్రాలు ఇవ్వలేదు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో పడినా చెల్లించలేదని యాజమాన్యం చెబుతోంది. ఈ నెల 5వ తేదీ లోపుగా చెల్లింపులు జరపకపోతే అల్పాహారం, వసతి నిలిపివేసి ధ్రువీకరణ పత్రాల ఇవ్వకూడదని ఆర్జీయూకేటీ ఉత్తర్వులు జారీ

యాజమాన్యం నిర్ణయంతో ప్రాంగణ ఎంపికల్లో ప్లేస్మెంట్ సాధించిన విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం నుంచి అన్ని ఏడాదులకి సంబంధించి ఇంకా డబ్బు పడలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో త్రిపుల్ ఐటీ ప్రాంగణంలో గురువారం విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక్కో విద్యార్థి నుంచి సుమారు లక్ష వరకు ఫీజు బకాయి ఉండగా.. 4 వేల మంది విద్యార్థుల నుంచి రావాల్సిన కోట్ల రూపాయల బకాయి ఉన్నట్టు అంచనా. బీటెక్ నాలుగో ఏడాది విద్యార్థులకు విద్యా సంవత్సరం ముగిసిపోయినా ప్రభుత్వం ఒక్క త్రైమాసికం ఫీజునే చెల్లించిందని.. మూడు విడతల ఫీజులు పెండింగ్‌లో ఉన్నాయని విద్యార్థులు తల్లిదండ్రులు చెబుతున్నారు.ఫీజులు తల్లుల ఖాతాల్లో జమ అవుతున్నందున తమకు సంబంధం లేదని , కట్టాల్సిందేనని విద్యార్థులపై ట్రిపుల్ ఐటీ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు.

Read Also: Online News: ఆన్‌లైన్ వార్తలకే జై కొడుతున్న ఇంటర్నెట్ యూజర్స్.. నివేదికలో వెల్లడి..

ఉన్నత విద్యా మండలి ఇచ్చిన ఉమ్మడి అకాడమీక్ కేలండర్ ప్రకారం ఏప్రిల్ 24తో నాలుగో ఏడాది వారికి విద్యా సంవత్సరం ముగిసింది . ప్రైవేటు కళాశాలల్లో బీటెక్ చివరి ఏడాది విద్యార్థులు కళాశాల విడిచి ఇప్పటికే వెళ్లిపోయారు. ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు వచ్చిన వారికి ధ్రువపత్రాలు అవసరం , ప్రభుత్వం ఫీజులనే చెల్లించకుంటే విద్యార్థులు వాటిని పొందలేక ఉద్యోగ అవకాశాలు కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉన్నత చదువులకు వెళ్ళాలన్నా ధ్రువపత్రాలు తప్పనిసరి కాగా విద్యార్థులు ఆందోళనకు గురవతున్నారు.

Show comments