ప్రస్తుతం టాలీవుడ్లో వరుసగా కొత్త సినిమాలు విడుదలవుతూ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నాయి. భారీ బడ్జెట్ చిత్రాలు, పాన్ ఇండియా మూవీస్ పోటీ పడుతున్న ఈ తరుణంలోనూ, తెలుగు ప్రేక్షకులు తమ మనసుకు నచ్చిన పాత క్లాసిక్ సినిమాలను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకే మేకర్స్ కూడా పాత సూపర్ హిట్ చిత్రాలను రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అందరి ఫేవరెట్ మూవీ ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం మళ్లీ వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. విక్టరీ వెంకటేష్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన ఈ అద్భుతమైన చిత్రాన్ని న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న విడుదల చేయబోతున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన చురుకైన సంభాషణలు, దర్శకుడు కె. విజయభాస్కర్ మేకింగ్ ఈ సినిమాను ఒక ఎవర్గ్రీన్ హిట్‌గా నిలబెట్టాయి. అయితే..
Also Read : Allu Arjun-Lokesh : లోకేశ్‌తో బన్నీసీక్రెట్ మీటింగ్.. మూవీ ఫిక్స్ అవుతుందా?
తాజాగా ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ‘4K అల్ట్రా హెచ్డి’ వెర్షన్లో ముస్తాబు చేశారు. దీనికి సంబంధించిన రీ-రిలీజ్ ట్రైలర్‌ను ఈరోజు సాయంత్రం 5:04 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దశాబ్దాలు గడిచినా ఈ చిత్రంలోని కామెడీ, పాటలు మరియు భావోద్వేగాలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. శ్రీ స్రవంతి మూవీస్ నిర్మించిన ఈ చిత్రం రీ-రిలీజ్ కానుండటంతో వెంకటేష్ అభిమానులు మరియు సినీ ప్రేమికులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. మరోసారి థియేటర్లలో ‘వెంకీ’ మ్యాజిక్‌ను, త్రివిక్రమ్ పంచ్ డైలాగులను ఎంజాయ్ చేసే అవకాశం కలగడంతో సోషల్ మీడియాలో ఈ వార్త ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది.
A film that redefined love, humour, and emotions across generations is back where it truly belongs ❤️
The Evergreen Classic of Telugu Cinema #NuvvuNaakuNachav Re-release Trailer Drops today at 5:04 PM!
Worldwide Grand Re-Releasing on JAN 1st.
A #Trivikram Writing 🖊️
Overseas… pic.twitter.com/TkgBbilWxX
— Sri Sravanthi Movies (@SravanthiMovies) December 25, 2025