Site icon NTV Telugu

Nuvvu Naaku Nachav : ‘నువ్వు నాకు నచ్చావ్’ రీ-రిలీజ్ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్..

Nuvunaku Nachav Trailor Update

Nuvunaku Nachav Trailor Update

ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసగా కొత్త సినిమాలు విడుదలవుతూ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నాయి. భారీ బడ్జెట్ చిత్రాలు, పాన్ ఇండియా మూవీస్ పోటీ పడుతున్న ఈ తరుణంలోనూ, తెలుగు ప్రేక్షకులు తమ మనసుకు నచ్చిన పాత క్లాసిక్ సినిమాలను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకే మేకర్స్ కూడా పాత సూపర్ హిట్ చిత్రాలను రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అందరి ఫేవరెట్ మూవీ ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం మళ్లీ వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. విక్టరీ వెంకటేష్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన ఈ అద్భుతమైన చిత్రాన్ని న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న విడుదల చేయబోతున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన చురుకైన సంభాషణలు, దర్శకుడు కె. విజయభాస్కర్ మేకింగ్ ఈ సినిమాను ఒక ఎవర్‌గ్రీన్ హిట్‌గా నిలబెట్టాయి. అయితే..

Also Read : Allu Arjun-Lokesh : లోకేశ్‌తో బన్నీసీక్రెట్ మీటింగ్.. మూవీ ఫిక్స్ అవుతుందా?

తాజాగా ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ‘4K అల్ట్రా హెచ్‌డి’ వెర్షన్‌లో ముస్తాబు చేశారు. దీనికి సంబంధించిన రీ-రిలీజ్ ట్రైలర్‌ను ఈరోజు సాయంత్రం 5:04 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దశాబ్దాలు గడిచినా ఈ చిత్రంలోని కామెడీ, పాటలు మరియు భావోద్వేగాలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. శ్రీ స్రవంతి మూవీస్ నిర్మించిన ఈ చిత్రం రీ-రిలీజ్ కానుండటంతో వెంకటేష్ అభిమానులు మరియు సినీ ప్రేమికులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. మరోసారి థియేటర్లలో ‘వెంకీ’ మ్యాజిక్‌ను, త్రివిక్రమ్ పంచ్ డైలాగులను ఎంజాయ్ చేసే అవకాశం కలగడంతో సోషల్ మీడియాలో ఈ వార్త ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది.

 

Exit mobile version