NTV Telugu Site icon

CM Yogi Adityanath: గర్భిణీ స్త్రీలకు యూపీ సీఎం కానుక.. న్యూట్రిషన్ కిట్ పంపిణీ

Yogi

Yogi

Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గర్భిణీ స్త్రీలకు కానుక అందించారు. వారికి పోషకాహార కిట్ ను పంపిణీ చేశారు. దాంతో పాటు బేబీ షవర్ కిట్ ను ఇచ్చారు. సోమవారం లోక్‌భవన్‌లో ఏర్పాటు చేసిన జాతీయ పౌష్టికాహార మాస కార్యక్రమంలో ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఒకప్పుడు యూపీలో మద్యం మాఫియా పౌష్టికాహారం సరఫరా చేసేదని.. తమ ప్రభుత్వం వచ్చాక కొత్త యంత్రాంగాన్ని రూపొందించిందని తెలిపారు.

Read Also: BJP MP Laxman: మోడీ తెచ్చిన మహిళ బిల్లుకు అన్ని పార్టీలు సపోర్ట్ ఇవ్వాలి..

అంతేకాకుండా.. రాష్ట్రంలో ఎన్సెఫాలిటిస్ తో ప్రతి సంవత్సరం 1200-1500 మరణాలు సంభవించేవని.. తూర్పు ఉత్తరప్రదేశ్ ఈ వ్యాధితో గణనీయంగా ప్రభావితమైందని సీఎం యోగి అన్నారు. గత 30 సంవత్సరాలలో సుమారు 50,000 మంది పిల్లలకు ఈ వ్యాధి సోకిందని తెలిపారు. కానీ నేడు రాష్ట్రం మొత్తం మెదడువాపు వ్యాధిని నిర్మూలించడంలో విజయం సాధించామని చెప్పారు. నేడు ఉత్తరప్రదేశ్‌లో మాతా, శిశు మరణాల రేటు తగ్గిందని.. తల్లులు, శిశువులకు పౌష్టికాహారం లభించడం వల్లే ఇది సాధ్యమైందని సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.

Read Also: Rahul Gandhi: తెలంగాణపై ప్రధాని ప్రసంగం రాష్ట్రానికి అవమానం

ఈ సందర్భంగా.. జాతీయ పోషకాహార మాస కార్యక్రమంలో బేబీ షవర్ వేడుక నిర్వహించారు. ఇందులో భాగంగా.. కొందరు గర్భిణులకు సీఎం యోగి మందులు, పౌష్టికాహారం అందించారు. అంతేకాకుండా.. ఈ కార్యక్రమంలో సీఎం యోగి గుర్తుగా కొందరు చిన్నారులకు ఖీర్ తినిపించి అన్నప్రాశన సంస్కారం కూడా చేశారు. అనంతరం రూ.155 కోట్లతో 1,359 అంగన్‌వాడీ కేంద్రాలకు సీఎం యోగి ప్రారంభోత్సవం చేశారు. రూ.50 కోట్లతో 171 శిశు అభివృద్ధి ప్రాజెక్టు కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు.