Site icon NTV Telugu

Top Headlines@9AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

*తెలంగాణలో రెండు రోజుల పాటు వైన్ షాప్స్ బంద్..
తెలంగాణ ప్రజలు ఆషాడమాసంలో సంప్రదాయంలో భాగంగా బోనాల ఉత్సవాల పండగ జరుపుకుంటున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండగ ఉండటంతో ఇవాళ్టి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు మద్యం షాపులు క్లోజో చేయాలని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మందుబాబులు అర్థరాత్రి వరకు వైన్ షాప్స్ ముందు మందు కొనుగోలు చేశారు. తెలంగాణలో మందుబాబులకు సీఎం కేసీఆర్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇవాళ, రేపు మద్యం దుకాణాలను క్లోజ్ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వైన్ షాప్స్ బంద్ చేస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండగా ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం మేరకు, హైదరాబాద్ మహానగరంలోని కమిషనరేట్ పరిధిలో ఉన్నట్టు వంటి సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, మల్కాజ్ గిరి, మహేశ్వరం జోన్లలో ఒక రోజు పాటు మద్యం దుకాణాలు క్లోజ్ చేయనున్నారు. సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సౌత్ జోన్, ఎల్బీనగర్ డివిజన లలో.. ఇవాళ్టి నుంచి ఈ నెల 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్ షాప్స్ ను మూసివేస్తారని తెలిపారు. దీంతో ఇవాళ్టి నుంచి మద్యం దుకాణాలు బందు చేస్తున్నారనే విషయం తెలియడంతో మందుబాటులు ముందస్తుగా నిన్న అర్ధరాత్రి వరకు మద్యం కొనుగోలు చేశారు.

 

*హైదరాబాద్‌లో నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్న బోనాల పండగా ఇవాళ హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. నేడు, రేపు పాతబస్తీలోని ప్రధాన ఆలయాల్లో బోనాలు పెద్ద ఎత్తున జరుగనున్నాయి. అంబర్ పేట్ లోని మహంకాళి ఆలయంలో ఇవాళ( ఆదివారం) ఉదయం 6 గంటల నుంచి 18( మంగళవారం) తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. దీంతో హైదరబాద్ లో నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఈ రూట్​లో వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి జులై 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు పలు రూట్లలో దారి మళ్లింపు చర్యలు అమలులోకి ఉంటాయని సిటీ పోలీసులు తెలిపారు. ఉప్పల్ నుంచి అంబర్‌పేట్ వైపు వచ్చే అన్ని జిల్లాల బస్సులు, సిటీ బస్సులు, భారీ వెహికిల్స్ ఉప్పల్ x రోడ్డులో హబ్సిగూడ-తార్నాక-అడిక్‌మెట్-విద్యా నగర్-ఫీవర్ హాస్పిటల్- టీవై మీదుగా మళ్లీస్తున్నారు. మండలి-టూరిస్ట్ హోటల్ జంక్షన్-నింబోలిఅడ్డ-చాదర్‌ఘాట్, సీబీఎస్ రిటర్న్ వచ్చే రూట్లలో వైస్ వెర్సాగా ఉంటుంది. కోఠి నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వెహికిల్స్, సిటీ బస్సులు నింబోలిఅడ్డ-టూరిస్ట్ హోటల్-టీవై మండలి-ఫీవర్ హాస్పిటల్ అడిక్‌మెట్-తార్నాక-హబ్సిగూడ-ఉప్పల్ X రోడ్ల మీదుగా తిరుగు మార్గంలో దారి మళ్లీస్తున్నారు. ఉప్పల్ నుంచి అంబర్‌పేట్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను రాయల్ జ్యూస్ కార్నర్ – మల్లికార్జున నగర్ – డిడి కాలనీ – సిండికేట్ బ్యాంక్ శివం రోడ్ వైపుకు దారి మళ్లీంచారు. గోల్నాక, మూసారాంబాగ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను సీపీఎల్‌ వైపు మళ్లిస్తున్నట్లు పోలీసుల పేర్కొన్నారు. అంబర్‌పేట్ – సల్దానా గేట్ – అలీ కేఫ్ X రోడ్లు, తిరుగు మార్గంలో వైస్ వెర్సా వైపుకు పంపిస్తున్నారు. అయితే, ఈ రూట్లలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలుంటాయని, ఎటువంటి అడ్డంకులు లేకుండా తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సిటీ పోలీసులు ప్రజలకు తెలియజేశారు. కాగా, ఈ రెండు రోజులు కూడా హైదరబాద్ నగరంలో మద్యం షాపులు బంద్ అయ్యాయి. ఈ నేపథ్యంలో శనివారం రోజునే మద్యం షాపుల ముందు భారీగా మందుబాబులు మద్యం కొనుగోలు చేశారు.

 

*5,950 మంది వీఆర్ఏలు నీటిపారుదల శాఖలోకి..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలోని 24 వేల మంది వీఆర్ఏల్లో 5,950 మందిని నీటి పారుదల శాఖలో లష్కర్లుగా నియమించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరందరు రెవెన్యూ శాఖలో రూ.10.500 గౌరవ వేతనంపై తాత్కాలిక ఉద్యోగులుగా పని చేస్తున్నారు. వారి సేవలను అదేశాఖలో క్రమబద్దీకరించడంతో పాటు కొత్త పేస్కేల్ ను వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. వీఆర్ఏల అవసరాన్ని బట్టి వేర్వేరు శాఖల్లో వారిని విలీనం చేయాలని భావిస్తోంది. రూ. 19వేల మూల వేతనంతో పాటు మొత్తం రూ. 23 వేల స్థూల వేతనం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 5,950 మంది వీఆర్ఏలతో పాటు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద నిర్వాసితులైన కుటుంబాల నుంచి దాదాపు 200 మందిని లష్కర్లుగా నియమించుకోవడానికి నీటిపారుదల శాఖ ప్రతిపాదనలు రెడీ చేసింది. అయితే, ప్రాజెక్టుల కింద నిర్వాసితులుగా మారిన కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జారీ చేసి జీవో 98 కింద 200 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు కసరత్తు పూర్తైంది. త్వరలో సీఎం కేసీఆర్ సమీక్ష జరిపి లష్కర్ల నియామకంపై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. వీఆర్ఏలను లష్కర్లుగా నియమిస్తామని కేసీఆర్ చాలా ఏళ్ల క్రిందనే ప్రకటించారు. సాగునీటి ప్రాజెక్టులు, కాల్వలు, తూములకు కాపలా కాస్తూ పంట పొలాలకు నీళ్లు అందేలా లష్కర్లు వర్క్ చేయాల్సి ఉంటుంది. కాల్వల్లో పిచ్చి మొక్కలు తొలగించడం, గండ్లు పడితే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం వంటి విధులు నిర్వహించనున్నారు. తెలంగాణ వచ్చాక కొత్త ప్రాజెక్టులను పెద్ద ఎత్తున నిర్మించినా, నిర్వహణకు అవసరమైన క్షేత్రస్థాయి సిబ్బందిని కేసీఆర్ ప్రభుత్వం నియమించలేదు. లష్కర్ల నియామకంతో కొత్త ప్రాజెక్టుల నిర్వహణ మెరుగుపడే ఛాన్స్ ఉంది.

 

*ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశానికి జనసేనకు ఆహ్వానం
బీజేపీ సారథ్యంలో ఎన్డీయే సమావేశంలో పాల్గొనాలని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌కు ఆహ్వనం అందింది. ఇప్పటికే భాగస్వామ్య పక్షాల అగ్రనాయకులకు ఆహ్వానం పంపిన బీజేపీ అధిష్ఠానం, తాజాగా పవన్‌ను ఆహ్వానించింది. ఈ నెల 18వ తేదీన ఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి హాజరవుతామని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీని పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. 2014 ఎన్నికల తర్వాత జరిగిన ఎన్డీఏ మిత్ర పక్షాల సమావేశానికి తొలిసారిగా వెళ్లిన పవన్.. మళ్లీ ఇప్పుడు వెళ్లేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు మందు ఈ సమావేశం ఢిల్లీలో జరగనుంది. పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న వివిధ బిల్లులకు మద్దతు కోరడం, రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల బల ప్రదర్శన లక్ష్యంగా ఈ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. జూలై 18వ తేదీన ఢిల్లీలో ఎన్డీయే భాగస్యామ్య పార్టీల సమావేశం జరగనుంది. ఢిల్లీ అశోక హోటల్‌లో జరగనున్న ఈ భేటీకి పాత, కొత్త మిత్రుల్ని బీజేపీ పిలుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం నేపథ్యంలో పంజాబ్‌లోని శిరోమణి అకాలీదళ్‌ పార్టీకి కూడా ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబును కూడా ఆహ్వానించినట్లు వార్తలు వస్తుండగా.. ఆహ్వానం అందితే మాత్రం చంద్రబాబు కచ్చితంగా హాజరయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇదే సమయంలో జనసేనకు ఆహ్వానం అందగా.. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

 

*దేశంలో 44 శాతం ఎమ్మెల్యేలు నేరచరితులే..
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేల్లో దాదాపు 44 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్(ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. రాష్ట్ర అసెంబ్లీలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వారు పోటీ చేసే సమయంలో సమర్పించిన అఫిడవిట్లను పరిశీలించి ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్‌లు ఈ వివరాలను వెల్లడించాయి. 22 రాష్ట్ర అసెంబ్లీలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 4,033 మంది ఎంఎల్‌ఎలకు గాను 4001 మంది ఎమ్మెల్యేలు సమర్పించిన అఫిడవిట్లను పరిశీలించిన అనంతరం ఈ నివేదికను రూపొందించారు. వీరిలో 1,136 మంది అంటే 28 శాతం మంది తమపై హత్య, హత్యాయత్నం, కిడ్నాపింగ్, మహిళలపై నేరాలు లాంటి తీవ్రమైన క్రిమినల్ కేసులున్నట్లు ప్రకటించింది. కేరళలో మొత్తం 135 మంది ఎమ్మెల్యేలకు గాను.. 95 మందికి నేర చరిత్ర ఉందని, 70 శాతం నేరచరిత ఎమ్మెల్యేలతో ఆ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని నివేదికలు పేర్కొన్నాయి. అలాగే బీహార్‌లోని 242 మంది ఎమ్మెల్యేలలో 161 మంది (67 శాతం), ఢిల్లీలోని 70 మందిలో 44 మంది(63శాతం), మహారాష్ట్రలోని 284 మంది ఎమ్మెల్యేలలో 175 మంది(62 శాతం) తెలంగాణలోని 118 మంది శాసన సభ్యుల్లో 72 మంది(61శాతం), తమిళనాడులో224 మంది ఎమ్మెల్యేలలో 134 మంది(60 శాతం)తమపై క్రిమినల్ కేసులున్నట్లు అఫిడవిట్‌లలో పేర్కొన్నారు. అంతే కాకుండా ఢిల్లీలో 37 మంది (53 శాతం), బీహార్‌లో 122 మంది (50 శాతం) మహారాష్ట్రలో 114 మంది(40 శాతం), జార్ఖండ్‌లో 31మంది(39 శాతం), తెలంగాణలో46 మంది(39శాతం), ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం403 మంది ఎమ్మెల్యేలలో 155 మంది (38శాతం)తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నట్లు వెల్లడించడం గమనార్హం. ఇందులో కూడా 114 మంది ఎంఎల్‌ఎలపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు కూడాఆ వివరాలు వెల్లడించడం గమనార్హం. 1 14 మందిపై అత్యాచారానికి సంబంధించిన కేసులు కూడా ఉన్నట్లు ఈ నివేదికలో తెలిసింది. పార్టీలవారీగా చూస్తే నేరచరిత ఉన్న ఎమ్మెల్యేల్లో ఎక్కు వ మంది బీజేపీకి చెందినవారని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఈ పార్టీకి చెందిన 1,356 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను పరిశీలించగా 473 మంది(35శాతం)కి నేరచరిత్ర ఉన్న ట్లు తేలిందని, వారిలో 337(25శాతం) మంది సీరియస్‌ నేరాల్లో నిందితులుగా ఉన్నట్లు పేర్కొంది. 2, 3 స్థానాల్లో కాంగ్రెస్‌, డీఎంకే పార్టీలుండగా.. వైఎస్సార్‌సీపీ 6, బీఆర్‌ఎస్‌ 8 స్థానాల్లో ఉన్నట్లు వివరించింది. 22వ స్థానంలో మజ్లిస్‌, 26వ స్థానంలో తెలుగుదేశం పార్టీలున్నాయి.

 

*మోడీ కోసం యూఏఈ ప్రత్యేకంగా రూపొందించిన శాఖాహారం మెనూ..
శనివారం అబుదాబిలో యుఎఇ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఏర్పాటు చేసిన విందు భోజనంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పూర్తి శాఖాహార భోజనం అందించారు. ఒకరోజు పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ ఈరోజు యూఏఈ చేరుకున్నారు. మెనూలోని చిత్రం ప్రకారం, ప్రధాని మోదీకి మొదట స్థానిక సేంద్రీయ కూరగాయలతో పాటు హరీస్ (గోధుమలు) మరియు ఖర్జూరం సలాడ్ అందించారు. దీని తర్వాత మసాలా సాస్‌తో కాల్చిన కూరగాయలతో కూడిన స్టార్టర్ వచ్చింది. మెనూలోని చిత్రం ప్రకారం, ప్రధాని మోదీకి మొదట స్థానిక సేంద్రీయ కూరగాయలతో పాటు హరీస్ (గోధుమలు) మరియు ఖర్జూరం సలాడ్ అందించారు. దీని తర్వాత మసాలా సాస్‌తో కాల్చిన కూరగాయలతో కూడిన స్టార్టర్ వచ్చింది. ప్రధాన కోర్సులో, ప్రధాని మోదీకి కాలీఫ్లవర్ మరియు క్యారెట్ తందూరితో నల్ల పప్పు మరియు స్థానిక హరీస్ వడ్డించారు. డెజర్ట్‌లో “కాలానుగుణ స్థానిక పండ్ల ఎంపిక” ఉంది..మెనులో “అన్ని భోజనాలు శాఖాహారం మరియు కూరగాయల నూనెలతో తయారు చేయబడతాయి.. పాల లేదా గుడ్డు ఉత్పత్తులను కలిగి ఉండవు అని పేర్కొంది. ప్రధాని మోదీ తన రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని జూలై 15న యూఏఈ చేరుకున్నారు. పారిస్‌లోని లౌవ్రే మ్యూజియంలో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఏర్పాటు చేసిన విందు విందుకు అతను హాజరయ్యాడు, అక్కడ అతనికి ప్రత్యేకంగా రూపొందించిన శాఖాహారం మెనూ అందించబడింది..శనివారం అబుదాబిలోని విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వాగతం పలికారు.ప్రధాని మోదీ కూడా అధ్యక్షుడితో చర్చలు జరిపి భారత్-యూఏఈ సంబంధాలపై చర్చించారు..హెచ్‌హెచ్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. ఆయన శక్తి, అభివృద్ధి దార్శనికత ప్రశంసనీయం. సాంస్కృతిక మరియు ఆర్థిక సంబంధాలను పెంపొందించే మార్గాలతో సహా పూర్తి స్థాయి భారతదేశం-యుఎఇ సంబంధాల గురించి మేము చర్చించాము అని ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, రాష్ట్రపతితో తన కొన్ని చిత్రాలను పంచుకున్నారు.. అనంతరం కాసేపు ముచ్చటించారు.

 

*రెండు వారాల్లో కిలో టమాట రూ.300?
ప్రస్తుతం భారత దేశంలో టమోటా సంక్షోభం ను ఎదుర్కొంటుంది.. గతంలో రెండు, మూడు రూపాయలు ఉన్న టమోటా ధర ఇప్పుడు కిలో రూ.200 లాస్కు పైగా పరుగులు పెడుతుంది.. ఇప్పటికి టమోటా రేటు అలానే మార్కెట్ లో కొనసాగుతున్న నేపథ్యంలో త్వరలోనే ఈ టమోటా రూ.300 లకు చేరుకున్న ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని మార్కెట్ నిపుణులు అంటున్నారు.. అందుకు కారణం భారీ వర్షాలే అని చెబుతున్నారు..ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వరదల కారణంగా కూరగాయలు, పండ్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో రానున్న రోజుల్లో వీటి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా టమాటా ధర రూ. 300 పైకి చేరే సూచనలు ఉన్నాయి. భారీ వర్షాలు, వరదలు కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో పంటల దిగుబడి భారీగా పడిపోతోంది. దాంతో టమాటాతో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా రానున్న రోజుల్లో భారీగా పెరుగుతాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.. టమోటా విత్తనాలు నాటినా వర్షాల కారణంగా అవి పాడై పోతాయని, అందుకే రైతులు ఇప్పట్లి కొత్త పంటలు వేసే సూచనలు కన్పించడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా పండ్లు, కూరగాయల ధరలు రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతూనే ఉంటాయన్నారు. ధరలు తిరిగి సాధరణ స్థితికి రావడానికి కనీసం రెండు నెలలు పట్టవచ్చని చెబుతున్నారు. నేషనల్ కమోడిటీస్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫిసర్ సంజయ్ గుప్త ఈమేరకు వివరించారు. అదే విధంగా టమోటా ప్యూరి కూడా రేటు భారీగా పెరిగిందని తెలుస్తుంది.. మరో విషయం ఏంటంటే ప్రస్తుతం టమోటా పేస్ట్ కు స్టాక్ లేదని, విదేశాల నుంచి వచ్చినవి కూడా క్షణాల్లో సేల్ అయ్యాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.. ప్రస్తుతం ఢిల్లీ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కేజీ టమాటా ధర రూ. 200 గా ఉంది. కాలిఫ్లవర్ రూ. 110, కేజీ అల్లం రూ. 370, పచ్చి మిర్చి కేజీ రూ. 230 గా ఉంది. భారీ వర్షాల కారణంగా దేశంలోని ఆయా ప్రాంతాల్లో వీటి సరఫరాకు కొరత ఏర్పడి రేట్లు పెరిగాయి..దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాలో కొన్ని రాష్ట్రాలు మినహా మిగతా ఏ రాష్ట్రాలు సామర్థ్యానికి తగినట్లుగా టమాటాను ఉత్పత్తి చేయడం లేదు. వర్షాలు, వరదలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఉత్పత్తి తగ్గి సరఫరాకు కొరత ఏర్పుడుతోంది. దీంతో కేజీ టమాటా ధర ఆకాశాన్ని తాకుతోంది. టామాటా తక్కువ సమయంలోనే పండే పంట కావడం, ఎక్కువ రోజులు నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడం, అలాగే తెగుళ్ల బారినపడటం, కఠిన వాతావరణ పరిస్థితులు వంటి కారణాలు ఈ పంట దిగుబడిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. దీంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలో టమాటా పంటను కొత్త వైరస్ దెబ్బతీసింది.. దాంతో దిగుబడి పూర్తిగా తగ్గిందని నిపుణులు చెబుతున్నారు.. ఇక టమోటా దారిలోనే ఉల్లిపాయలు కూడా సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయని తెలుస్తుంది.. మరో కొద్ది వారాల్లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

Exit mobile version