Site icon NTV Telugu

Top Headlines@5PM: టాప్‌ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

*ఈసారి తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు: ప్రధాని మోడీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ తెలంగాణలో మూడు రోజులు పర్యటించనున్నారు. అందులో భాగంగానే.. కామారెడ్డిలో ప్రచారం నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనపై ప్రజలు విసిగిపోయారని.. ఇక్కడి ప్రజలు బీఆర్ఎస్ నుండి విముక్తి కోరుతున్నారని తెలిపారు. ఈసారి తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని మోదీ చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ విధానాలు ఉన్నాయన్నారు. తాను ఇచ్చే మాటలే గ్యారంటీ అని అన్నారు. దేశానికి బీసీని ప్రధాని చేసింది కూడా బీజేపీనే చెప్పారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరికి ఎప్పుడు డబ్బులు అవసరం అవుతాయో అప్పుడు నీటి పారుదల పథకాలు పెట్టుకున్నారన్నారు. ప్రజాధనం అంతా కేసీఆర్ కుటుంబ సభ్యుల జేబుల్లోకి వెళ్ళిందని ఆరోపించారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. ఖరీఫ్ లో 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా కొంటాం.. ఇది తెలంగాణ రైతులకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఏళ్ల తరబడి వేలాది మంది యువకులు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. వారి అక్రమాల వల్ల నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. బీఆర్ఎస్ సీఎం, కాంగ్రెస్ అధ్యక్షుడు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు… వారి కుటుంబ పాలన, అవినీతి పాలన ఇక సాగదు అనేలా వారికి గుణపాఠం చెప్పాలని ప్రధాని మోదీ అక్కడి ప్రజలకు సూచించారు. వారిద్దరు రెండు చోట్ల పోటీ చేస్తున్నారని.. అక్కడ ఓడిపోతామనే భయంతో కామారెడ్డి వచ్చారని ప్రధాని విమర్శించారు. బీఆరెస్, కాంగ్రెస్ ఒక్కటేనని.. డిసెంబర్ 3న ప్రజలు కేసీఆర్ ను తరిమేసినట్లుగా తీర్పు రానుందని అన్నారు. మీ అందరి ఆశీర్వాదంతో తమకు 300 ఎంపీలు ఉన్నారని.. తాము బలహీనంగా ఉన్నపుడు మీరు అండగా ఉన్నారని ప్రధాని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వారు తమ బిడ్డల భవిష్యత్తు కోసం పని చేస్తే.. మేము మీ బిడ్డల భవిష్యత్తు కోసం పని చేస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

*తెలంగాణలో దొరల పాలన కొనసాగుతోంది
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో జోరు పెంచారు. అందులో భాగంగా.. ఆదిలాబాద్ లోని ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో కాంగ్రెస్ ప్రజా విజయభేరి సభలో అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో దొరల పాలన కొనసాగుతోందని తెలిపారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు విరుధ్ధంగా కేసీఆర్ పాలన ఉందని విమర్శించారు. ప్రజలు కన్న కలలు నెరవేరటంలేదు.. అమరుల ఆశయాలు నెరవేరట్లేదని ఆరోపించారు. వందలాదిమంది ఆత్మ బలిదానాలతో తెలంగాణ ఏర్పడింది.. ప్రజల ఆకాంక్షలమేరకే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్నిచ్చిందని తెలిపారు. ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ 10 ఏళ్ళ కేసీఆర్ పాలనలో అప్పుల కుప్పగా మారిందని అన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు కేవలం హామీలు కావు.. ప్రభత్వమేర్పడ్డాక మొదటి మంత్రిమండలి సమావేశంలోనే వీటిని చట్టాలుగా మారుస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. మహిళలకు, రైతులకు ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. మహిళల్లేకుండా సమాజాన్ని ఊహించలేమన్నారు. నేడు రూ.1200గా ఉన్న గ్యాస్ సిలెండర్.. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడగానే రూ.500కే ఇస్తామని తెలిపారు. అంతేకాకుండా.. మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ. వివాహితలకు రూ.2500, వృధ్ధులకు ప్రతినెల పించను రూ. 4000 ఇస్తామని తెలిపారు. తెలంగాణాలో రైతు ఆత్మహత్యలను చూడటానికి మేము సిద్ధంగా లేమన్నారు రాహుల్ గాంధీ. రైతులు భయంగా జీవించటం తాము ఇష్టపడట్లేదని రాహుల్ గాంధీ అన్నారు. ప్రతి రైతుకు ఎకరాకు రూ.15000, రైతు కూలీలకు సంవత్సరానికి 12 వేలు ఇస్తామని తెలిపారు. ఇది గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలే, కాలానుగుణంగా కొంత మొత్తం పెంచామని చెప్పారు. తెలంగాణ కోసం అమరులైన ప్రతి ఒక్కరి కుటుంబాలకు 250 గజాల ఇంటిస్థలాలు ఇవ్వాలనుకుంటున్నామన్నారు. అంతేకాకుండా.. యువ వికాసం కింద, విద్యా భరోస కింద 5 లక్షల సహాయం.. చేయూత కింద వృద్ధులందరికి, వితంతువు, వికలాంగులకు నెలకు 4వేలు.. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు చికిత్స ఖర్చులు ఇస్తామని పేర్కొన్నారు. ఇవి కేవలం పథకాలు కావు, మొదటి మంత్రిమండలిలోనే చట్టాలుగా మారుస్తామని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డ నాటినుండి దొరల తెలంగాణ పోయి ప్రజల తెలంగాణగా మారనుందని రాహుల్ గాంధీ అన్నారు. మీ దగ్గరనుండి కేసీఆర్ దోచుకున్న ధనాన్ని ప్రజలకు చేరుస్తామని తెలిపారు.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనని ఆరోపించారు. మోదీ మిత్రులు కేసీఆర్, ఓవైసీ అని అన్నారు. మోదీ హయాంలోని ప్రతీ బిల్లుకు కేసీఆర్ మద్దతు ఉందని పేర్కొన్నారు. తాను నరేంద్రమోదీతో పోరాడతానని.. తాను తన పోరాటాన్ని ఆపననని, మోదీ ఆలోచనా విధానం మారనంతవరకు తాను పోరాడుతూనే ఉంటానని రాహుల్ తెలిపారు. నాకు దేశప్రజలందరూ కుటుంబీకులే.. దేశంలోని ప్రతీ ఇల్లూ నాదేనని అన్నారు. కేసీఆర్ కు సీఎం పదవి అవసరం.. కేసీఆర్ కుర్చీ రిమోట్ మోదీ చేతిలో ఉంటుందని చెప్పారు. తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కార్ ఏర్పడనుందని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.

*మీరు వేసే ఓటే.. 5 సంవత్సరాల అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత ప్రయాంక గాంధీ ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కల్లూరు పట్టణంలో నిర్వహించిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్‌లో ఆమె ప్రసంగించారు. ‘ఇందిరగాంధీకి తెలంగాణ అంటే చాలా ఇష్టం. చనిపోయిన ఇన్నేళ్లకు కూడా ఇందీరా గాంధీ మీ అందరికి గుర్తున్నారంటే ఆమె చేసిన పాలనే. భూమి.. నీళూ.. నీధుల కోసం పోరాటం చేసి అభివృద్ధి చేశారు కాబట్టే మిరందరూ ఆమెను గుర్తుపెట్టుకున్నారు. నాయకులు తప్పు చేసినప్పుడు ప్రశ్నించాలి.. ఎదిరించాలి. కేసిఆర్ పది సంవత్సరాల నుండి పాలిస్తూ ఫాంహౌస్ కే పరిమితం అన్నట్టుగా పాలించాడు. అలాంటి నాయకుడిని పదవి నుంచి దింపాలా? వద్దా? ప్రజస్వామ్యంలో ముఖ్యమైన శక్తులు మీరే.. మీ ఓటే మీ శక్తి.. ఎవ్వరికి బడితే వారికి ఓటు వెయ్యకండి. డబ్బులు ఆశ చూపి స్కిం తీసుకొచ్చి ఆశ పెడతారు.. వారితో జాగ్రత్త. తెలంగాణ బిడ్డలు అలాంటి వాటికి దూరంగా ఉండాలి’ అని ఆమె పిలుపు నిచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘కేసిఆర్ పాలనలో ఎలాంటి సమష్యలు పరిష్కారం కాలేదు. రైతు రుణామాఫీ జరిగిందా? సింగరేణి ప్రవేటికరణ చేస్తున్నరన్న విషయం మీకు తెలుసా? సింగరేణి ప్రైవేటీకరణను కాంగ్రెస్ ఎప్పటికి సమర్థించదు.ఈ ఎలక్షన్‌లో సరైనా నిర్ణయం ప్రజలు తీసుకోవాలి. ఓట్ల కోసం చాల మంది నేతలు వస్తారు వారితో జాగ్రత్త. సరైనా ఆలోచన చేసి మంచి నాయకులను ఎన్నుకొండి. ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశారు. విధ్యార్ధులు, నిరుద్యోగుల త్యాగమే తెలంగాణ రాష్ట్ర రాష్ట్రం. ఈ తెలంగాణ భూమి మీ చెమట నెత్తురితో తడిచిన నేల. మీ అందరి ముఖ్యమైన బాధ్యత మీ ఓటు. మీరు వేసే ఓటే ఐదు సంవత్సరాల అభివృద్ధిపై అధారపడి ఉంటుంది. పది సంవత్సరాల కేసిఆర్ కుటుంబ పాలన చూశారు కదా.. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి గ్రామాల వరకు అవినీతి జరిగింది.పేపర్ లీక్ చేసి విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన ఘనత బీఆర్ఎస్‌ది.కేసిఆర్ ప్రభుత్వం నిరోద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం. తెలంగాణలో నిత్యవసర సరుకులు కొనాలంటేనే భయం వేసే పరిస్థితి వచ్చింది. ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ అయ్యాయి. ఈ ప్రభుత్వం నుండి ఎలాంటి మద్దతు ప్రజలకు లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రుణా‌మాఫీ చేశాం. రాజస్థాన్‌లో మహిళల‌ కోసం మంచి పధకాలు తీసుకుచ్చాం. చతీష్‌ఘడ్‌లో మహిళలకు ఉపాది కల్పించాం. దేశంలో రెండు రకాల పార్టీలు మీ సంపద దొచుకొనే పార్టీలు అయితే కాంగ్రెస్ మీ జేబులోకి డబ్బులు వేసే పార్టీ. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటే, మోదీకి కేసీఆర్ తమ్ముడులా ఉంటాడు.. కేంద్రంలో అవసరం అయితే తమ్ముడు ‌కేసిఆర్‌కు మోదీ సపోర్టు ఇస్తారు. ఇలాంటి నాయకుల మనకు కావాలా?’ అని ప్రశ్నించారు.

*పరీక్షలు సరిగ్గా నిర్వహించలేని వాడు.. ప్రభుత్వం ఏం నడుపుతాడు..!
పరీక్షలు సరిగ్గా నిర్వహించలేని వాడు.. ప్రభుత్వం ఏం నడుపుతాడు అంటూ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాధ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమరంభీం జిల్లా కాగజ్‌నగర్‌ లో బీజేపీ రామరాజ్య స్దాపన సంకల్ప సభలో జై శ్రీరాం జై తెలంగాణ నినాదాలతో యోగీ ప్రసంగం ప్రారంభించారు. సోదరి సోదర మనుల్లారా నా నమష్కారం అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. మీతో మాట్లాటం చాలా ఆనందంగా ఉందన్నారు. కేవలం ముస్లింల కోసమే ఈ ప్రభుత్వం పని చేస్తోందని మండిపడ్డారు. నీళ్ళు, నిధులు, నియామకాల కోసం ఎర్పాటు అయిన తెలంగాణ ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. ఉత్తరప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ పని చేస్తోంది.. అక్కడ అధ్బుతంగా ఉందని తెలిపారు. ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు సరిగ్గా నిర్వహించలేని వాడు ప్రభుత్వం ఏం నడుపుతాడు? అంటూ ప్రశ్నించారు. ఎంఐఎం, బీఆర్ఎస్ కు కామన్ ఫ్రెండ్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఉంటే ఫ్రిగా కరోనా వాక్షిన్, ఉచితంగా బియ్యం ఇచ్చే వారు కాదని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే అయోధ్యలో రామమందిర్ కట్టే వారా? అని ప్రశ్నించారు. బీఅర్ఎస్, బీఎస్పీ దోస్తులే.. ఓట్లు చీల్చేందుకు బీఎస్పీ రంగంలోకి దిగిందని మండిపడ్డారు. బీజేపీనీ గెలిపిస్తాం… బంగారు తెలంగాణ సాధిస్తాం అంటూ తెలుగులో యోగీ తెలిపారు.

*రిస్క్ వద్దు.. కారుకు ఓటు గుద్దు..
రిస్క్ వద్దు కారుకు ఓటు గుద్దు అని మంత్రి హరీష్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లు అంటే ఖాళీ కుర్చీలని.. బీఆర్ఎస్ మీటింగ్ అంటే జన నీరాజనాలని అన్నారు. సమైక్య వాదులకు చుక్కలు చూపించిన మానుకోట మట్టికి రాళ్లకు దండం అన్నారు. తెలంగాణ రాకముందు మానుకోట ఎలా వుండే.. నేడు ఎలా వుందో ప్రజలు ఆలోచించాలని మంత్రి అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఏమి చేసిందో చూడాలని తెలిపారు. రేవంత్ రెడ్డి కి బుతులు తప్ప భవిష్యత్ తెలువదని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో కరెంటు కష్టాలు అన్నారు. రిస్క్ వద్దు కారుకు ఓటు గుద్దు అని ప్రజలకు పిలుపునిచ్చారు. రైతుబందు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమీషన్ కు పిర్యాదు చేసారని అన్నారు. కేసీఆర్ అంటే మాట తప్పని వాడు మడమ తిప్పని వాడు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి రైతుకు 15 వేలు అన్నాడు.. అదే కేసీఆర్ ఎకరాకు 15 వేలు అంటున్నారని స్పష్టం చేశారు. శంకర్ నాయక్ మనిషి.. కానీ మాట ఒక్కటే కఠినమని తెలిపారు. గిరిజనులకు అత్యధికంగా సీట్లు ఇచ్చింది కేసీఆర్ అన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే గిరిజన బంధును అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్‌కు వెళ్తున్న మంత్రి హరీశ్‌రావు హెలికాప్టర్‌ సమన్వయ లోపంతో ల్యాండ్‌ అయింది. దీంతో ఓ చోట దిగాల్సిన హెలికాప్టర్ మరోచోట దిగింది. మహబూబాబాద్‌లో దిగాల్సిన హెలికాప్టర్‌ స్వల్ప లోపంతో గూడూరు మండల కేంద్రంలో ల్యాండ్‌ అయింది. దీంతో మంత్రి పీఏపై మండిపడ్డారు. చేసేదేమీలేక హరీశ్ రావు అందుబాటులో ఉన్న కారులో మహబూబాబాద్ రోడ్ షోకు బయలుదేరారు. ఎన్నికల ప్రచార సమయం దగ్గరపడుతుండటంతో హరీశ్ రావు రాష్ట్రంలో వరుస పర్యటనల్లో బిజీబిజీగా గడుపుతున్నారు.

*వంద కేసీఆర్లు వచ్చినా మధిర గేటు తాకలేరు..
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బరిలో నిలిచిన మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్‌ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మధిర కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క ప్రసంగించారు. ప్రియాంక రాకతో మధిర పులకించిందని.. అందరికీ ఇళ్లు.. భూములిచ్చిన కుటుంబం గాంధీ ఫ్యామిలీ అని ఆయన పేర్కొన్నారు. ప్రియాంక సభకు ఊరూ వాడా తరలి వచ్చిందన్నారు. దొరల తెలంగాణకు.. ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతోన్న పోరాటమిది అంటూ ఆయన పేర్కొన్నారు. తెలంగాణ వస్తే సకల బాధలు తీరతాయని అంతా భావించారని.. కానీ కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లుగా ప్రజా సంపదను పందికొక్కుల్లా తింటున్నారని భట్టి విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో ముంచాలన్నారు. ప్రియాంక గాంధీ సభకు వచ్చిన ప్రజల్లో సగం మంది కూడా కేసీఆర్ సభకు రాలేదన్నారు. వంద కేసీఆర్లు వచ్చినా మధిర గేటు తాకలేరన్నారు. 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిచి మధిర సత్తా చాటుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ అఫ్ట్రాల్ అని.. ఇలాంటి వాళ్లు ఊడుత ఊపులు ఊపితే మేం భయపడమన్నారు. ఏఐసీసీ ఆదేశాలతో పాదయాత్ర చేశానన్న ఆయన.. ఆరు గ్యారెంటీలు ప్రకటించామన్నారు. ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకోవాలని.. మధిరకు వరదలా నిధులు తెస్తానని ఆయన హామీ ఇచ్చారు. మధిర పాలించాలి.. లేదా ప్రశ్నించాలని.. ఏం కానీ.. కాలేని నేతలకు ఓటేయొద్దని ప్రజలకు సూచించారు. 78-84 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు.

*ఫిషింగ్ హార్బర్‌లో బోట్ల దగ్ధం కేసు.. అసలు కారణం బయటపెట్టిన సీపీ
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన బోట్ల దగ్ధం కేసును విశాఖ పోలీసులు ఛేదించారు. ఘటన జరిగిన 6 రోజులకు అసలు నిందితులను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించనున్నారు. సుమారు 47 సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన అనంతరం నిందితులను గుర్తించారు. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న సుమారు 30 మందిని విచారణ చేశారు.. నిందితులు వాసుపల్లి నాని, అతని మామ సత్యం ఇద్దరు మద్యం మత్తులో చేసిన తప్పిదమే ఈ భారీ అగ్ని ప్రమాదాలకు కారణమని తేల్చారు.. ఈ కేసు దర్యాప్తుల భాగంగా యూట్యూబర్ నానిని కేవలం అనుమానితుడిగానే పరిగణించామని తెలిపారు. విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నర్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వాసుపల్లి నాని, అతని మామ సత్యం అనే వీరిద్దరే ప్రమాదానికి అసలు కారణమని.. 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు వీరిద్దరూ మద్యం తాగడానికి హార్బర్ కు వచ్చారని చెప్పారు. అల్లిపల్లి వెంకటేశ్‌కు చెందిన 887 నెంబర్ బోటులో మద్యం తాగి ఫిష్ ప్రై చేసుకోని పార్టీ చేసుకున్నారని.. అనంతరం సిగరెట్ తాగి పక్కనా ఉన్న 815 నెంబర్ బోటుపై పడేసారు.. దీంతో మెల్ల మెల్లగా మంటలు చెలరేగి బాగా వ్యాపించాయని సీపీ తెలిపారు. మంటలు వ్యాపించడం గమనించి మెల్లగా అక్కడి నుండి జారుకున్నారన్నారు. వాసుపల్లి నాని అక్కడ బోట్లలో కుక్‌గా, సత్యం వాచ్ మెన్‌గా పనిచేస్తుంటారని, వారి ఇద్దరిపై ఐపీసీ సెక్షన్ 437,438,285, ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసు దర్యాప్తు లో భాగంగా చాలా మంది అనుమానితులను విచారించామన్నారు. విచారించిన అనుమానితుల్లో ముగ్గురు నానిలు ఉన్నారన్నారు. విచారణలో భాగంగా యూట్యాబర్ నానిని తీసుకొచ్చి విచారణ చేశామని.. ప్రాథమిక సమాచారం మేరకు కేవలం విచారణలో భాగంగానే నానిని తీసుకువచ్చామన్నారు. విచారణలో అతని ప్రమేయం లేదంటే మేము ప్రోసిజర్ ప్రకారం విడిచిపెట్టే వాళ్లమని చెప్పారు. కానీ ఈ లోపే హైకోర్టును అశ్రయించారని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సుమారు 50కు పైగా సీసీ కెమెరాలు పరిశీలించామన్నారు. ఇన్ని రోజులు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నామని, నిందితులు సిగరెట్ విసిరివేయడంతో వలలకు నిప్పు అంటుకున్న తరువాత మొదట పొగలు మాత్రమే వచ్చాయన్నారు. ఆ సమయంలో గాలులు కూడా బాగా వీయడంతో మంటలు త్వరగా వ్యాపించాయన్నారు. నిందితులు ఉదయం నుంచి తాగుతూనే ఉన్నారని.. విచారణలో వారు నేరం అంగీగరించారన్నారు. ఈ ప్రమాదంలో 30 బోట్లు పూర్తిగా దగ్ధం అవ్వగా.. 18 బోట్లు పాక్షికంగా డామేజ్ అయ్యాయన్నారు. 8 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని, ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కమాండ్ కంట్రోల్ ద్వారా హార్బర్ మానిటరింగ్ చేస్తామన్నారు.

 

*బర్త్ డే రోజు దుబాయ్‌కి తీసుకెళ్లలేదని.. భర్తను కొట్టి చంపిన భార్య..
భార్య పుట్టిన రోజు వివాదం భర్తకు చావుగా మారింది. తన పుట్టిన రోజు వేడుకల కోసం దుబాయ్‌కి తీసుకెళ్లలేదని భార్య, భర్తను కొట్టి చంపింది. ఈ ఘటన పూణేలో చోటు చేసుకుంది. దుబాయ్ తీసుకెళ్లేందుకు నిరాకరించడంతో భార్య, భర్త ముక్కుపై కొట్టింది. దీంతో 36 ఏళ్ల వ్యక్తి మరణించాడు. పూణేలోని వానావ్డీ ప్రాంతంలోని ఓ రెసిడెన్షియన్ సొసైటీలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. కన్‌స్ట్రక్షన్ రంగంలో వ్యాపారిగా ఉన్న నిఖిల్ ఖన్నా అనే వ్యక్తి తన రేణుక(38) అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. నిఖిల్ రేణుకను ఆమె పుట్టిన రోజు జరుపుకోవడానికి దుబాయ్ తీసుకెళ్లకపోవడంతోనే దంపతుల మధ్య గొడవ జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పుట్టిన రోజు ఆమెకు ఖరీదైన గిఫ్టులు ఇవ్వలేదని, కొంతమంది బంధువుల పుట్టినరోజు జరుపుకునేందుకు ఢిల్లీకి వెళ్లాలని అనుకున్నప్పటికీ సానుకూలంగా స్పందించలేదని భార్య రేణుక మనస్తాపం చెందింది. ఈ గొడవల కారణంగా నిఖిల్ ముఖంపై రేణుక కొట్టిందని, ఆ పంచ్ తాకిడికి నిఖిల్ ముక్కు, కొన్ని పళ్లు విరిగిపోయాయని, తీవ్ర రక్తస్రావం కావడంతో నిఖిల్ స్పృహ కోల్పోయాడని పోలీసులు తెలిపారు. రేణుకపై ఐపీసీ సెక్షన్ 302 కింద పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ నిమిత్తం అరెస్ట్ చేశారు.

Exit mobile version