NTV Telugu Site icon

Top Headlines@1PM: టాప్‌ న్యూస్

Top Headlines @1pm

Top Headlines @1pm

*నల్లేరు మీద నడక కాదు. పల్లేరు కాయలపై పరుగు లాంటింది
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు మార్పు కావాలి-కాంగ్రెస్‌ రావాలి అంటూ హస్తం రావాలి అనే హస్తం పార్టీ నినాదాన్ని నిజం చేశారు. 119 సీట్లలో 64 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి అధికారాన్ని ఖాయం చేసుకుంది. కానీ.. మంత్రివర్గ కూర్పే ఇప్పుడు ఆ పార్టీ ముందు ఉన్న అతిపెద్ద ఛాలెంజ్‌. ప్రభుత్వ అవసరాలకు తగినట్టు… ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసుకుంటుంది. అది పార్టీ అంతర్గత వ్యవహారం. కానీ మంత్రి వర్గ కూర్పు నల్లేరు మీద నడక కాదు. పల్లేరు కాయలపై పరుగు లాంటింది. దీనికి కారణం ఏంటంటే చాలా మంది పార్టీలో సీనియర్‌ నేతలు ఉన్నారు. భట్టి, ఉత్తంకుమార్‌రెడ్డి, ఆయన భార్య పద్మావతి, కోమటిరెడ్డి బ్రదర్స్, వివేక్ బ్రదర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్‌ ఉంది. రకరకాల సమీకరణాల్ని బ్యాలెన్స్‌ చేయాల్సి ఉంటుంది. జిల్లాలవారీగా చూడాలి. సీనియారిటీ చూడాలి. కుల సమీకరణాలు చూసుకోవాలి.. పార్టీకి వాళ్లు చేసిన సేవ… లాయల్టీ కూడా చూడాలి. ఖమ్మం జిల్లాకు వస్తే.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన తుమ్మలకు సముచిత స్థానం ఇవ్వాలి. 40 రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు తుమ్మల. తర్వాత పొంగులేటి..! ఆయనకు కూడా హై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయి. ఇక భట్టి… ఆయన సీఎల్పీ నేత. ఆయనకు కూడా ఏదో ఒక టాప్‌ సీట్‌ కేటాయించాల్సిందే..! ఉత్తమ్‌, పద్మావతి… ఇద్దరు సీనియర్లు, అనుభవజ్ఞులు. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్‌ కూడా సీనియర్‌ నేతలు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గతంలో మంత్రిగా పనిచేశారు. వీళ్లకు కూడా ఏదో ఒక సముచిత శాఖలు ఇవ్వాల్సిందే..! ఉత్తం, తుమ్మలకు మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. వాళ్లందరికీ చోటు కల్పించాలి. వరంగల్‌లో సీతక్క, కొండా సురేఖ లాంటి సీనియర్లు ఉన్నారు. వాళ్లకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలి. ఆదిలాబాద్‌లో ప్రేమ్‌ సాగర్‌ రావు ఉన్నారు. ఆయన పార్టీకి స్టార్‌ క్యాంపెయినర్‌లలో ఒకరు. లాయల్‌గా పార్టీని నమ్ముకుని ఉన్నారు. మంథని నుంచి గెలిచిన శ్రీధర్‌ బాబు కూడా సినీయరే..! మెదక్ జిల్లాలో దామోదర రాజనర్సింహ గతంలో డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు. నిజామాబాద్‌ జిల్లాలో సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ ఉన్నారు. మహబూబ్‌నగర్‌లో గతంలో మంత్రిగా పనిచేసిన జూపల్లి కాంగ్రెస్‌లో చేరి గెలిచారు. వీళ్లందరికీ తగిన శాఖలు కేటాయించడం కత్తి మీద సామే..! వీళ్లందరికీ అధిష్టానం ఎలా చోటు కల్పిస్తుందన్నది.

 

*అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టింది వీరే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 65 సీట్లు, బీఆర్ఎస్ పార్టీ 39 సీట్లు గెలుచుకున్నాయి. మరికొందరు స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే అత్యధిక, అత్యల్ప మెజారిటీలతో గెలిచిన ఘనత బీఆర్ఎస్ అభ్యర్థులకే దక్కడం గమనార్హం. రాష్ట్రంలోని 119 స్థానాల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. బీజేపీ నుంచి పోటీ చేసిన కూన శ్రీశైలం గౌడ్‌పై వివేకానంద 85,576 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వివేకానంద్‌కు మొత్తం 1,87,999 ఓట్లు రాగా, కూన శ్రీశైలం గౌడ్‌కు 1,02,423 ఓట్లు వచ్చాయి. ఇదే స్థానం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డికి కూడా 1,01,554 ఓట్లు తగ్గాయి. ఆ తర్వాత.. ఈసారి సిద్దిపేటలో హరీశ్ రావు 82 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. హరీష్ రావుకు 1,05,514 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి పూజల హరికృష్ణకు 23,206 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి దూది శ్రీకాంత్ రెడ్డికి 23,201 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బీఎస్పీ అభ్యర్థి చక్రధర్ గౌడ్‌కు 16,610 ఓట్లు వచ్చాయి. గతంలో హరీశ్ రావు 18 వేల మెజారిటీతో గెలుపొందడం గమనార్హం. ఇక రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 12 మంది అభ్యర్థులు హ్యాట్రిక్ కొట్టారు. వీరిలో తొమ్మిది మంది హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి గెలుపొందారు. హైదరాబాద్ జిల్లాకు చెందిన రాజాసింగ్ (గోషామహల్), తలసాని శ్రీనివాసయాదవ్ (సనత్‌నగర్), పద్మారావు (సికింద్రాబాద్), కౌసర్ మొహియుద్దీన్ (కార్వాన్), జాఫర్ హుస్సేన్ మెరాజ్ (రెండుసార్లు నాంపల్లి, ఇటీవల యాకుత్‌పురా), మాధవరం కృష్ణారావు (కూకట్‌పల్లి), ఉమ్మడి రంగారెడ్డి నుంచి అరికెపూడి గాంధీ. జిల్లా. ఉమ్మడి మెదక్ నుంచి (సెరిలింగంపల్లి), వివేకానంద (కుత్బుల్లాపూర్), కాలె యాదయ్య (చేవెళ్ల), గూడెం మహిపాల్ రెడ్డి (పటానుచెరు). ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన జగదీశ్ రెడ్డి (సూర్యాపేట), ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి (బాల్కొండ) హ్యాట్రిక్ సాధించారు.

 

*నియోజకవర్గాల్లో గెలిచిన ఎంఐఎం.. అభ్యర్థులు వీరే..
చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గం హైదరాబాద్ జిల్లాలోని 15 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చార్మినార్ నియోజకవర్గం నుంచి ఎంఐఎం నేత ముంతాజ్ అహ్మద్ ఖాన్ విజయం సాధించారు. గతంలో యాకుత్‌పురా నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చార్మినార్‌లో మూడుసార్లు గెలిచిన ఖాద్రీ పాషాను మజ్లిస్ పార్టీ యాకుత్ పురాకు మార్చింది. అక్కడ నాలుగోసారి గెలిచారు. అహ్మద్ ఖాన్ 1994లో ఎంబీటీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత మజ్లిస్‌లో చేరి వరుస ఎన్నికల్లో విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో మజ్లిస్ నేత అహ్మద్ ఖాన్ 32,886 ఓట్ల తేడాతో బీజేపీ నేత ఉమా మహేంద్రపై గెలుపొందారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన మహ్మద్ గౌస్ కు 15,700 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో ముంతాజ్ అహ్మద్ ఖాన్‌కు 53,808 ఓట్లు రాగా, ఉమా మహేంద్రకు 21,222 ఓట్లు వచ్చాయి. హైదరాబాద్‌లోని చారిత్రక చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గంలో 1967 నుంచి మజ్లిస్ అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు.సలావుద్దీన్ ఒవైసీ పెద్ద కుమారుడు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చార్మినార్ వద్ద రెండుసార్లు విజయ ఢంకా మోగించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి సయ్యద్‌ అహ్మద్‌ పాషా ఖాద్రీ టీడీపీ నేత ఎంఏ బాషిత్‌పై విజయం సాధించారు. సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీకి 62,941 ఓట్లు రాగా, టీడీపీ నేత ఎంఏ బాషిత్‌కు 26,326 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఏడు నియోజకవర్గాల్లో గెలిచిన ఎంఐఎం అభ్యర్థులు:
* నాంపల్లి – మాజిద్ హుస్సేన్
* మలక్‌పేట – బలాల
* కార్వాన్ – మొహిద్దీన్
* చాంద్రాయణగుట్ట – అక్బరుద్దీన్
* బహదూర్‌పురా – మహమ్మద్ ముబీన్
* చార్మినార్ – మీర్ జుల్ఫికర్ అలీ
* యాకుత్ పురా – జాఫర్ హుస్సేన్

 

 

*తుఫాను పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష
తుఫాను పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సమీక్ష ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం జరుగుతోంది. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వర్చువల్‌గా పరిస్థితిని సీఎం జగన్ సమీక్షిస్తున్నారు. తీసుకోవాల్సిన సహాయ, పునరావాస చర్యలు, ముందు జాగ్రత్తలపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశానికి హోంమంత్రి తానేటి వనిత, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా  మిచౌంగ్ తుఫాను కదులుతోంది. గంటకు 14 కి.మీ వేగంతో  తుఫాన్ కదులుతోందని  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.  ప్రస్తుతానికి తుఫాను చెన్నైకి 130 కి.మీ, నెల్లూరుకు 220 కి.మీ, బాపట్లకు 330 కి.మీ, మచిలీపట్నానికి 350కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయిందని ఆ సంస్థ డైరెక్టర్‌ చెప్పారు. నేడు కోస్తా తీరానికి సమాంతరంగా తుఫాన్ పయనించనుంది.  రేపు మధ్యాహ్నం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీవ్రతుఫానుగా మిచౌంగ్ తీరం దాటనుంది. దీని ప్రభావంతో నేడు,రేపు కూడ కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతితీవ్రభారీ వర్షాలు కురవనున్నట్లు ఆయన తెలిపారు. రాయలసీమలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.  ఎల్లుండి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు. తీరం వెంబడి గంటకు 55 -75 కీమీ వేగంతో గాలులు వీస్తున్నాయి.  మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని ఆయన సూచించారు.

 

*పార్లమెంట్‌లో ఓటమి కోపాన్ని వెళ్లగక్కకండి… విపక్షాలపై ప్రధాని మోడీ నిప్పులు
నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడారు. చలి నెమ్మదిగా వస్తుందని, అయితే రాజకీయ వేడి వేగంగా పెరుగుతోందని ప్రధాని అన్నారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని ప్రధాని అభివర్ణించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. దేశం మొత్తం ప్రతికూలతను పూర్తిగా తిరస్కరించిందన్నారు. కావున ప్రతిపక్షాలు నెగిటివిటీని వదిలి సానుకూలతతో సభకు రావాలని, సభా కార్యక్రమాలు సజావుగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించడంతో ఉత్సాహంగా ఉన్న ప్రధాని, తాను పార్లమెంటుకు ముందు ప్రతిపక్ష నేతలతో మాట్లాడతానన్నారు. ఈ ప్రజాస్వామ్య దేవాలయం ప్రజల ఆకాంక్షలకు వేదికగా నిలుస్తుందన్నారు. అభివృద్ధి చెందిన భారత్‌గా మారుతుందని ప్రధాని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇక్కడకు సిద్ధమయ్యారు. మంచి సలహాలు ఇచ్చారు. ప్రతిపక్షంలో కూర్చున్న సహచరులకు ఇదొక సువర్ణావకాశమని, ఇలాంటి పరిస్థితుల్లో ఓటమిపై ఉన్న కోపాన్ని బయటపెట్టుకునే బదులు, దాని నుంచి కొంత నేర్చుకోవాలని, బయటి కోపాన్ని లోపల బయట పెట్టుకోకూడదని పీఎన్ అన్నారు. 17వ లోక్‌సభ చివరి శీతాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభమవుతాయని, ఇది డిసెంబర్ 22 వరకు కొనసాగుతుంది. ఈ సెషన్‌లో ప్రభుత్వం 21 ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టనుంది. అయితే ఈ సమయంలో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయి. ఎందుకంటే టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణకు సిఫార్సు చేస్తూ ఎథిక్స్ కమిటీ నివేదిక దిగువ సభలో సమర్పించబడుతుంది. దీని కారణంగా టీఎంసీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు, BJP మధ్య గందరగోళం ఉండవచ్చు.

 

*ఐదేళ్ల పార్టీ 68 ఏళ్ల ఎమ్‌ఎన్‌ఎఫ్‌ను తొక్కేస్తోంది
నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అందరి దృష్టి ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంపై పడింది. సోమవారం (డిసెంబర్ 4) ఇక్కడ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. స్టార్టింగ్ ట్రెండ్స్ లో ప్రతిపక్ష జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM) రాష్ట్రంలోని అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) కంటే ముందంజలో ఉంది. ట్రెండ్స్ ప్రకారం.. ZPM 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాగా, MNF 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రాష్ట్రంలో జెడ్‌పిఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని, ఎంఎన్‌ఎఫ్ అధికారంలోకి రాబోతోందని పోకడలను బట్టి స్పష్టమవుతోంది. ZPM అనేది మాజీ ఎంపీ లాల్దుహోమా నేతృత్వంలో ఏర్పడిన ఆరు ప్రాంతీయ పార్టీల కూటమి. ఇది 2017లో ఏర్పడింది. ఇది సెక్యులరిజం, మతపరమైన మైనారిటీల రక్షణను విశ్వసిస్తుంది. 2018 ఎన్నికల్లో జెడ్‌పిఎం తన పనితీరు ద్వారా ఎంఎన్‌ఎఫ్ కష్టాలను పెంచబోతోందని తేలింది. ఆ ఎన్నికల్లో జెడ్పీఎం 8 స్థానాల్లో విజయం సాధించింది. అయితే 2023 వరకు ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. 2019లో మిజోరాం పీపుల్స్ కాన్ఫరెన్స్ దాని నుండి విడిపోవాలని నిర్ణయించింది. ZPM రాజకీయ పార్టీగా మారినందున అతను దీనిని తీసుకున్నాడు. ఒక సంవత్సరం తర్వాత, 2020లో ZPMలోని కొంతమంది సభ్యులు కూటమి నుండి విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇన్ని షాక్‌ల తర్వాత కూడా ZPM పనితీరులో ఎలాంటి తగ్గుదల కనిపించలేదు. దాని గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. 2023 ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ZPM ద్వారా క్లీన్ స్వీప్ అవుతుందని అంచనా వేసింది.

ZPM ప్రెసిడెంట్ లాల్దుహోమా మిజోరాం మాజీ ఐపీఎస్ అధికారి. అతను 1972 నుండి 1977 వరకు మిజోరాం ముఖ్యమంత్రికి ప్రిన్సిపల్ అసిస్టెంట్‌గా పనిచేశాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి. గ్రాడ్యుయేషన్ తర్వాత అతను ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాశాడు. 1977లో ఐపీఎస్ అయిన తర్వాత గోవాలో స్క్వాడ్ లీడర్‌గా పనిచేశాడు. తన పోస్టింగ్ టైంలో అతను స్మగ్లర్లపై పెద్ద చర్యలు తీసుకున్నాడు. 1982లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆయన్ను తన సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా ప్రత్యేక పదోన్నతి కల్పించారు. రాజీవ్ గాంధీ అధ్యక్షతన 1982 ఆసియా క్రీడల నిర్వాహక కమిటీ కార్యదర్శిగా కూడా పనిచేశారు. మిజోరం అసెంబ్లీకి నవంబర్ 7న ఓటింగ్ జరిగిందని, రాష్ట్రంలోని 8.57 లక్షల మంది ఓటర్లలో 80 శాతానికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో 18 మంది మహిళలు సహా మొత్తం 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మిజో నేషనల్ ఫ్రంట్ (MNF), జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM), కాంగ్రెస్ 40 స్థానాల్లో పోటీ చేయగా, BJP 23 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. మిజోరంలో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాలుగు స్థానాల్లో పోటీ చేసింది. 2018 ఎన్నికల్లో ఎంఎన్‌ఎఫ్‌ 26, జెడ్‌పీఎం 8, కాంగ్రెస్‌ 5, బీజేపీ 1 సీట్లు గెలుచుకున్నాయి.

 

*మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. విమాన రాకపోకలకు అంతరాయం
దక్షిణ కోస్తాపై మిచౌంగ్ తీవ్ర తుఫాన్ దూసుకు వస్తోంది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పయనిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించింది. రేపు మధ్యాహ్నం కంటే ముందు తీవ్ర తుఫానుగానే తీరం దాటుతుందని ఐఎండీ ప్రకటించింది. ప్రస్తుతం నెల్లూరుకు 220కిలోమీటర్ల దూరంలో కొనసాగు తున్న మిచౌంగ్ ఎఫెక్ట్ తో గంటకు 90నుంచి 110కి.మీ గరిష్ట వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. మిచౌంగ్ తీవ్ర తుఫానుతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. విమానాల రాకపోకలపై మిచౌంగ్ తుఫాన్ ప్రభావం పడింది. విజయవాడ-విశాఖ ఇండిగో విమానాన్ని అధికారులు రద్దు చేశారు. గాలుల తీవ్రత అధికంగా ఉండటంతో అధికారులు రద్దు చేశారు. తుఫాన్ ప్రభావం ఆధారంగా మరికొన్ని సర్వీస్‌లు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. నేడు జరగాల్సిన సమ్మెటివ్‌ అసెస్మెంట్‌-1 పరీక్షను అధికారులు వాయిదా వేశారు. నేడు, రేపు ఎన్టీఆర్‌ జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తుపాను ఎఫెక్ట్‌ వల్ల నేడు పలు రైళ్లు రద్దయ్యాయి. తిరుపతి-చెన్నై, చెన్నై-తిరుపతి మధ్య రైలు సర్వీసులు రద్దు అయినట్లు అధికారులు తెలిపారు.

మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో కాకినాడ జిల్లాలో వాతావరణ పరిస్ధితులు మారాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్‌ కారణంగా ఏడు తీర ప్రాంత మండలాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వేటను మత్స్యకారులు నిలిపివేశారు. భారీ వర్షాలతో రైతాంగం ఆందోళనలో ఉంది. వరికోతలు వాయిదా వేసుకోవాలని రైతులకు అధికారుల సూచించారు. ఉప్పాడ జడ్పీ హై స్కూల్‌లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. హోప్ ఐలాండ్ మత్స్యకారులను పునరావాస కేంద్రాలకు తరలించారు. తుఫాన్ పరిస్థితులను ఎప్పటికప్పుడు కలెక్టర్ కృతికా శుక్లా సమీక్షిస్తున్నారు. తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టరేట్‌తో పాటుగా కాకినాడ,పెద్దాపురం ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. మిచౌంగ్‌ తుఫాన్ ఎఫెక్ట్‌తో కృష్ణా జిల్లా వ్యాప్తంగా వర్షం మొదలైంది. బందరు, అవనిగడ్డ, పామర్రు, బెజవాడలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు పాఠశాలలకు అధికారులు సెలవు ఇచ్చారు. కలెక్టరేట్లలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. కార్తీక సోమవారం కావటంతో మంగినపూడి, హంసల దీవి బీచ్‌లను మూసివేశారు. తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. కొత్తపట్నం, పాకల సముద్ర తీరంలో అలలు ఎగసి పడుతున్నాయి. కొత్తపట్నం సముద్ర తీరంలో దాదాపు 50 అడుగుల మేర సముద్రం ముందుకు వచ్చింది. తీరం వెంబడి పడవలు కొట్టుకుపోకుండా రోడ్డుపైకి తీసుకువచ్చి సురక్షితంగా మత్స్యకారులు తాళ్ళతో కట్టారు. గంట గంటకు అలల ఉదృతి పెరుగుతోంది.

 

*జనంతో నిండిన బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు.. 10 మంది మృతి, 25 మందికి గాయాలు
పాకిస్థాన్‌లోని గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలోని కారకోరం హైవేపై ప్రయాణికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కనీసం 10 మంది మరణించారు. 25 మంది గాయపడ్డారు. విలేకరుల సమావేశంలో డయామర్ డిప్యూటీ కమిషనర్ ఆరిఫ్ అహ్మద్ మాట్లాడుతూ.. చిలాస్‌లోని హుదూర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం 6:30 గంటలకు బస్సుపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని తెలిపారు. ముందు నుంచి వచ్చిన బస్సు.. ట్రక్కును ఢీకొట్టింది. ఈ దాడిలో మరణించిన వారిలో ఎక్కువ మంది కోహిస్తాన్, పెషావర్, ఘిజర్, చిలాస్, రౌండు, స్కర్డు, మన్సేహ్రా, స్వాబి, సింధ్‌లకు చెందిన ఒకరు లేదా ఇద్దరు సహా దేశవ్యాప్తంగా ఉన్నారని పాక్ అధికారి తెలిపారు. ఈ దాడిలో మరణించిన వారిలో ఇద్దరు సైనికులు కూడా ఉన్నారని డైమర్స్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. స్పెషల్ ప్రొటెక్షన్ యూనిట్ సభ్యుడు కూడా గాయపడ్డారని తెలిపారు. కారకోరం హైవే (కెకెహెచ్) పోలీసులు మొదట సంఘటనా స్థలానికి చేరుకున్నారని డైమర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సర్దార్ షహ్ర్యార్ తెలిపారు. మృతదేహాలను, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. సంఘటనా స్థలంలో ఉన్న ఇతర వాహనాలను కాన్వాయ్ రూపంలో అక్కడి నుంచి తీసుకెళ్లినట్లు ఎస్పీ తెలిపారు. దాడి జరిగిన ప్రదేశాన్ని చుట్టుముట్టి ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. మహిళలు, పిల్లలతో సహా గాయపడిన వ్యక్తులను చిలాస్‌లోని ప్రాంతీయ ప్రధాన ఆసుపత్రిలో చేర్చారు. దాడికి బాధ్యులమని ఏ గ్రూపు వెంటనే ప్రకటించలేదు. కాల్పులకు గల కారణాలు తెలియరాలేదని ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదించింది. ముఖ్యమంత్రి హాజీ గుల్బర్ ఖాన్ ఘటనను ఖండించారు. ప్రయాణీకుల బస్సుపై దాడిని ఉగ్రవాద పిరికి చర్యగా అభివర్ణించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 2013లో గిల్గిత్ బాల్టిస్థాన్‌లోని పర్వతారోహకుల శిబిరంపై కొందరు ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 9 మంది విదేశీయులు చనిపోయారు. గిల్గిత్ బాల్టిస్తాన్ శాంతికి భంగం కలిగించడానికి రాజ్య వ్యతిరేక శక్తులను అనుమతించబోమని పాక్ తాత్కాలిక ప్రధాని అన్వర్-ఉల్-హక్ కక్కర్ ఉగ్రవాద దాడిని ఖండించారు. ఉగ్రవాదులపై పోరాటాన్ని కొనసాగిస్తాం.