Site icon NTV Telugu

టుడే ఎన్టీవీ టాప్ న్యూస్

1.ప్రస్తుతం దేశంలో కరోనా థర్డ్ వేవ్ నడుస్తోంది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా దాదాపు 3 లక్షల కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. గత రెండేళ్లుగా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కరోనా ఎప్పటికీ నాశనం అవుతుందోనని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా ఎప్పటికి అంతమవుతుందో అన్న అంశంపై ఐసీఎంఆర్ అధికారి స్పందించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మార్చి 11 నాటికి కరోనా కథ ముగిసిపోతుందని ఐసీఎంఆర్ ఎపిడెమాలజిస్ట్ చీఫ్ డా.సమీరన్ పాండా వెల్లడించారు.

https://ntvtelugu.com/corona-virus-will-become-endemic-by-march-11/

2 ఏపీలో మళ్ళీ మొదటికొచ్చింది పీఆర్సీ సమస్య. పీఆర్సీ జీవోపై ప్రభుత్వం అభిప్రాయాన్ని తెలియచేస్తున్నారు సీఎస్ సమీర్ శర్మ. సీఎంను పక్కదారి పట్టించారంటూ సీఎస్ నేతృత్వంలోని అధికారుల కమిటీపై ఆరోపణలు గుప్పించిన ఉద్యోగ సంఘాలు. ఈనేపథ్యంలో సీఎస్‌ ఏం చెబుతారోనని అంతా ఉత్కంఠగా చూస్తున్నారు. కరోనాతో ఏపీ ఆదాయం బాగా తగ్గింది. ప్రస్తుతం రూ. 62 వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తోంది. కరోనా లేకుంటే రూ. 90 వేల కోట్లకు పైగానే ఆదాయం వచ్చేది.

https://ntvtelugu.com/ap-cs-sameersharma-clarity-on-prc-go/

3.ఆరాంఘర్ నుండి నెహ్రూ జూలాజికల్ పార్క్ మార్గంలో 4.5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న, నగరంలో రెండవ అతి పొడవైన ఫ్లైఓవర్ మార్చి 2023 నాటికి ప్రారంభించబడే అవకాశం ఉంది. ప్రస్తుతం పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వే నగరంలో పొడవైన ఫ్లైఓవర్. 636.80 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డీపీ) కింద ఆరు లేన్‌ల ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు.

https://ntvtelugu.com/the-second-longest-flyover-in-hyderabad/

4.ప్ర‌పంచంలోని అంద‌రిదీ ఒక దారైతే, ఉత్త‌ర కొరియాది మ‌రోదారి.  ఆదాయం కోసం ఆ దేశం అనేక మార్గాల‌ను అన్వేషిస్తోంది.  ప్ర‌పంచ‌మంతా క‌రోనా నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలా అని ఆలోచిస్తుంటే నార్త్ కొరియా మాత్రం క్షిప‌ణీ ప్ర‌యోగాల‌తో బిజీగా మారింది.  మ‌రోవైపు ఆ దేశం హ్యాక‌ర్ల‌ను ప్రోత్స‌హిస్తూ ప్ర‌పంచ సంప‌ద‌ను కొల్ల‌గొడుతోంది.  

https://ntvtelugu.com/north-korea-hackers-stolen-digital-currency/

5. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి తాము మద్దతునివ్వడం లేదని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బికేయూ) నేత రాకేష్ తికాయ‌త్‌ స్పష్టం చేశారు. ఫలానా పార్టీకి మద్దతునిస్తుందన్న వార్తలను ఖండించారు. పరేడ్‌ గ్రౌండ్‌లో రైతులు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న చింతన్‌ శివిర్‌లో పాల్గనేందుకు మాగ్‌ మేళాకు వచ్చిన తికాయిత్‌ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతు ఇవ్వడంలేద‌ని తెలిపారు.

https://ntvtelugu.com/tikayat-said-he-would-not-support-any-party-in-the-five-state-elections/

6.ప్రముఖ వ్యాపారవేత్త, వైసీపీ నేత పోట్లూరి వరప్రసాద్‌(పీవీపీ) పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కుమార్తె శృతిరెడ్డి బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో నిన్న ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పీవిపీ అనుచరుడు బాలాజీ మరికొందరితో కలిసి డీకే అరుణ కుమార్తె శృతి రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి, ఆమె స్వంతగా నిర్మించుకున్న ప్రహరి గోడతో పాటు రేకులను సైతం జేసీబితో ధ్వంసం చేయించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా శృతిరెడ్డిని బెదిరింపులకు గురి చేసినట్టు తన ఫిర్యాదులో తెలిపింది. దీంతో పీవిపీతోపాటు సంఘటన స్థలంలో ఉన్న బాలాజీ అతనికి సహకరించిన మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తాజాగా శృతిరెడ్డి దూషించిందంటూ పీవీపీ అనుచరులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

https://ntvtelugu.com/case-against-dk-arunas-daughter-shruti-reddy/

7.భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా మహమ్మారి.. వరుసగా అన్ని రంగాలపై ప్రభావం చూపుస్తోంది.. కోవిడ్‌ ఎఫెక్ట్‌ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును తాకింది.. ఏకంగా కోర్టు కార్యకలాపాలపై కోవిడ్‌ ప్రభావం పడింది.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా మొత్తం 32 మంది న్యాయమూర్తుల్లో ఇప్పటి వరకు 10 మంది న్యాయమూర్తులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.. ఆ 10 మందిలో కోలుకుని జస్టిస్ జేఎం జోసఫ్, జస్టిస్ నరసింహ విధులు హాజరు అయ్యారు.. కానీ, ఇవాళ మూడు కోర్టుల కార్యకలాపాలు నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. మరోవైపు రోజు వారిగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.. ఈ రోజు నిర్వహించిన పరీక్షల్లో 30 శాతం మంది సుప్రీంకోర్టు సిబ్బందికి కరోనా నిర్ధారణ అయ్యింది..

https://ntvtelugu.com/severe-covid-wave-in-supreme-court-10-judges-infected/

8.కేసీఆర్‌ ప్రభుత్వం పై షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. రైతుల మరణాలను ఊటంకిస్తూ ట్విట్టర్‌ వేదికగా ఆమె తీవ్ర స్థాయిలో కేసీఆర్‌ పై ధ్వజమెత్తారు. ఓ వైపు రైతులు మరణిస్తున్నా కేసీఆర్‌కు సోయి లేదంటూ మండిపడ్డారు షర్మిల. దొరా మీరిచ్చే హామీలకే దిక్కులేనప్పుడు, మీరు సాయం చేస్తారనే ఆశ లేక,పత్తికి మిరపకు తెగులు సోకి, పెట్టిన పెట్టుబడి రాక, పంటను కాపాడలేని పురుగుల మందే మమ్మల్ని అప్పుల నుంచి కాపాడుతుందని,రోజుకు ఇద్దరు ముగ్గురు రైతులు చనిపోతున్నాదున్నపోతు మీద వాన పడ్డట్టు KCR గారు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదు.

https://ntvtelugu.com/sharmila-was-highly-critical-of-the-kcr-government-2/

9.మాస్ మహారాజ రవితేజ హీరోగా రమేష్ అవర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఖిలాడీ. పెన్ మూవీస్, ఏ స్టూడియోస్ పతాకంపై ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన హాట్ బ్యూటీస్ మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన మూడు పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 

https://ntvtelugu.com/raviteja-khiladi-movie-fourth-single-releasing-on-january-26th/

10.స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా క్రీడాభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. తాను ఇక టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆడుతున్న సానియా ఈ విషయాన్ని వెల్లడించింది. సానియా మీర్జా మాట్లాడుతూ… ఇదే తన చివరి సీజన్ అని నిర్ణయించుకున్నానని తన నిర్ణయాన్ని ప్రకటించింది. 

https://ntvtelugu.com/sania-mirza-announces-retirement/
Exit mobile version