NTV Telugu Site icon

Palakurthy Tikkareddy: ఈ సారి మంత్రాలయం టికెట్‌ నాదే.. గెలుపు నాదే..

Palakurthy Tikkareddy

Palakurthy Tikkareddy

Palakurthy Tikkareddy: ఈ సారి మంత్రాలయం టికెట్‌ నాదే.. గెలుపు నాదే అంటున్నారు మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌ పాలకుర్తి తిక్కారెడ్డి.. ఈ ప్రభుత్వ హయాంలో మంత్రాలయంలో అభివృద్ధికి నోచుకోలేదు.. తాను విజయం సాధించి అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తాఅంటున్నారు.. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన పాలకుర్తి తిక్కారెడ్డి.. గత 20 ఏళ్లుగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఈ నియోజకవర్గానికి చేసింది ఏమీలేదన్నారు.. రోడ్లు నాశనం అయ్యాయి.. రైతులకు, పంటలకు సాగు, తాగు నీరు లేకుండా చేశారని విమర్శించారు. ఇక, గత మూడు సార్లు ఎన్నికల్లో బాలనాగిరెడ్డి దౌర్జన్యంతో గెలిచాడు.. ఈ సారి టికెట్‌ నాదే.. గెలుపు నాదే.. ఇక బాలనాగిరెడ్డి దౌర్జన్యాలు సాగవు అని హెచ్చరించారు.

Read Also: Houthi Rebels: అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చేసిన హౌతీ రెబల్స్ ..

మా పార్టీ (టీడీపీ)లో కోవర్డులను పెట్టడం బాలనాగిరెడ్డికి ఎప్పుడూ అలవాటే అని ఫైర్‌ అయ్యారు తిక్కారెడ్డి.. కానీ, ఈ సారి కోవర్ట్ రాజకీయాలు పనిచేయవు అని స్పష్టం చేశారు.. మా పార్టీ అధినేత చంద్రబాబు నాకు సీటు కన్‌ఫామ్‌ చేశారు.. టీడీపీ మా జెండా.. మంత్రాలయం అభివృద్ధే నా అజెండా అని పేర్కొన్నారు. ఆస్పత్రి, రైల్వేగేట్, తాగునీరు, ఉల్లి రైతుల సమస్యలను తీరుస్తాం అని హామీ ఇస్తున్నారు. ఇసుక, మద్యం దందాలను అడ్డుకోవాలంటే బాలనాగిరెడ్డిని ఓడించాల్సిందేనని పిలుపునిచ్చారు. మంత్రాలయం ఓటర్లు ఈ సారి నాకే అవకాశం ఇస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు టీడీపీ ఇంఛార్జ్‌ పాలకుర్తి తిక్కారెడ్డి.

Read Also: Hyderabad: గతంలో ఎన్నడూ లేని విధంగా వాతావరణం.. ఈసారి ఎండకు మండాల్సిందే..

కాగా, 2009లో మంత్రాయం నియోజకవర్గం ఏర్పాటు అయ్యింది.. నాలుగు మండలాలు పెదకడుబూరు, మంత్రాలయం, కోసిగీ, కౌతాలంతో ఈ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు.. ప్రస్తుతం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన బాలనాగిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు.. 2009లో టీడీపీ తరుపున గెలిచి.. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన బాల నాగిరెడ్డి.. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇకచ 2019 ఎన్నికల్లో మాధవరం పరిధిలోని ఓ గ్రామంలో తుపాకీ పేలిన ఘటనలో.. టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి గాయపడిన విషయం విదితమే.. 2024 ఎన్నికల్లో హోరా హోరి ఫైట్‌ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. బోయ, వాల్మీకి, మాదిగ, బ్రాహ్మణ, లింగాయత సామాజిక వర్గాల నుంచి ఎక్కువ ఓట్లు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి.. ఈ ఎన్నికల్లో మంత్రాలయం ప్రజలు నన్ను గెలిపిస్తారన్న నమ్మకంతో ఉన్నారు టీడీపీ ఇంఛార్జ్‌ పాలకుర్తి తిక్కారెడ్డి.. ఇక, ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్కూలో తిక్కారెడ్డి ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..