Hyderabad: గతంలో ఎన్నడూ లేని విధంగా వాతావరణం.. ఈసారి ఎండకు మండాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: సంక్రాంతి అంటే పండువస్తుందనే ఆనందం అందరికి ఉంటుంది. అయితే దాంతో పాటే చలికూడా ఉంటుంది. మనసు ఆ చలికి గజ గజ వనకాల్సిందే. సంక్రాంతి పండుగ పూట తెల్లవారుజామున చల్ల నీటితో స్నానం ఏమోగానీ.. వేడినీటితోనే స్నానం చేయాలంటే పిల్లలు, వృద్ధులు వణికిపోతున్నారు. స్నానం చేసిన తరువాత భోగి మంటలు వేసి చలి నుంచి ఉపశమనం పొందుతారు. అయితే ఈ చలికి జ్వరాలు, జలుబులు సర్వసాధారణం. రాత్రిపూట స్వెటర్లు వేసుకున్నా, రగ్గులు కప్పుకున్నా జలుబు తగ్గే ప్రశక్తే ఉండదు. ఈసారి సంక్రాంతికి అలాంటి వాతావరణం నెలకొంది. రాత్రులు చల్లగా.. తేలికగా ఉన్నప్పటికీ, పగటిపూట వాతావరణం వేడిగా ఉంటుంది. మునుపెన్నడూ లేని విధంగా వాతావరణం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రతలు 33-34 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవడం గమనార్హం. సాధారణంగా తెలంగాణలో ఫిబ్రవరి మధ్యలో ఇలాంటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. చల్లని వాతావరణం రాత్రిల్లు ఫిబ్రవరిలో గుర్తుకు తెస్తాయి.
Also Read
- Bethupalli Lake Accident: మత్స్యకారులను కాపాడబోయి చెరువులో SDRF సిబ్బంది గల్లంతు
- Fake Call Centre Scam: అమెరికా పౌరులను మోసం చేస్తున్న భారీ ఫేక్ కాల్ సెంటర్ రాకెట్ గుట్టురట్టు..
- Jagtial Adoption Case : జగిత్యాల బాలుడి దత్తత కేసులో కొత్త ట్విస్ట్.. హైకోర్టుకు కలెక్టర్
- Care Health Insurance పాలసీదారులకు షాక్.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ చికిత్స నిలిపివేత.!
కానీ ఈసారి నెల రోజుల ముందు కూడా ఇదే వాతావరణం నెలకొనడం గమనార్హం. ఏపీలో కూడా దాదాపు ఇదే వాతావరణం ఉంది. విశాఖపట్నం మినహా మిగిలిన ప్రాంతాల్లో 30 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల తీరు చూస్తుంటే ఈ వేసవిలో ఎండలు మండిపోతాయనిపిస్తోంది. వర్షాకాలంలో భారీ వర్షాలు కురవకపోవడం, వాతావరణ మార్పులు, తూర్పువైపు నుంచి గాలులు వీస్తుండటంతో ఈసారి చలి తక్కువగా ఉంది. డిసెంబర్ మధ్యలో కొన్ని రోజులు విపరీతమైన చలి తప్ప, ఈ చలికాలం అంతా చలి తక్కువగానే ఉంటుంది. కానీ గతంతో పోలిస్తే హైదరాబాద్ లో పొగమంచు ఎక్కువగా ఉండడం గమనార్హం. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాదిలో చలి గాలులు వీస్తున్నాయి. ఢిల్లీలో ఆదివారం కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీలుగా నమోదైంది. పొగమంచు కారణంగా విమానాలు, రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
HanuMan : హనుమాన్ మూవీ టీం ను ప్రశంసించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు..
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ప్రారంభమైన పోలింగ్!
-
Thursday Horoscope: గురువారం రాశి ఫలాలు.. ఈ 5 రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు.. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు!
-
WPL 2027 Schedule: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. WPL 2027 షెడ్యూల్ విడుదల.. మ్యాచ్‌ల తేదీలు, వేదికల వివరాలివే..!
-
Mitchell Santner: మా ఓటమికి కారణం ఇదే.. న్యూజిలాండ్ కెప్టెన్ ఓపెన్ కామెంట్స్..
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..