NTV Telugu Site icon

AAY : ఎన్టీఆర్ బావమరిది రెండో సినిమా ‘ఆయ్’.. రిలీజ్ డేట్ ఫిక్స్

Aay

Aay

AAY : జూనియర్ ఎన్టీఆర్ బావమరిదిగా ఇండస్ట్రీ కి పరిచయం అయిన నార్నెనితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ యంగ్ హీరో నటించిన మొదటి సినిమా “మ్యాడ్” ఫన్ టాస్టిక్ ఎంటెర్టైనెర్ గా ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమాతో నార్నె నితిన్ మంచి హిట్ అందుకున్నాడు. ఈ యంగ్ హీరో నటిస్తున్నలేటెస్ట్ మూవీ “ఆయ్”. GA2 పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాను అంజి కె.మ‌ణిపుత్ర‌ తెరకెక్కించారు. “ఆయ్” సినిమాను యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నయన్ సారిక హీరోయిన్ గా నటించింది.

Read Also :Bharatheeyudu 2 : ‘భారతీయుడు 2 ‘ ట్రైలర్ రిలీజ్ టైం ఫిక్స్..

ఇప్పటికే ‘ఆయ్’ సినిమా నుంచి విడుద‌లైన పాట‌లకి ప్రేక్షకుల నుంచి సూప‌ర్ రెస్పాన్స్‌ లభించింది.ఈ సినిమాకు రామ్ మిర్యాల మ్యూజిక్ అందిస్తున్నారు. సోష‌ల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి రీల్స్‌, షార్ట్స్ తెగ వైర‌ల్ అయ్యాయి. దీంతో “ఆయ్” సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచ‌నాలు వున్నాయి . ఇదిలా ఉంటే “ఆయ్” సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది . స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా మేకర్స్ ఈ సినిమాను ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ మూవీ ఆగస్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..