Site icon NTV Telugu

NTRNeel : ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ వేట మొదలు పెట్టారు

Ntrneel

Ntrneel

ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నక్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ‘డ్రాగన్’. ఎన్టీఆర్ కెరీర్ లో 31వ సినిమాగా వస్తున్న ఈ సినిమా షూటింగ్‌కు ఇటీవల తాత్కాలికంగా బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ సరికొత్త మెకోవర్ లోకి మారాడు. బాగా గడ్డం పెంచి లీన్ లుక్ లోకి  చేంజ్ అయ్యాడు తారక్.

Also Read : TheRajaSaab : రాజాసాబ్ సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్.. చెన్నైలో ఈవెంట్

దాదాపు ఆరు నెలల సుదీర్ఘ విరామం తరువాత ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలైంది. ప్రస్తుతం మొదలైన ఈ షెడ్యూల్ సుమారు నెలరోజుల పాటు నిర్విరామంగా కొనసాగే అవకాశం ఉంది.దర్శకుడు ప్రశాంత్ నీల్ షూటింగ్ కు తిరిగి వెళ్తున్న నేపథ్యంలో ఆయన కూతురు ఎమోషన్ అవుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు స్టార్ట్ చేసిన ఈ షెడ్యూల్‌లో ప్రధానంగా ఎన్టీఆర్‌పై కొన్ని కీలకమైన యాక్షన్ ఘట్టాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలోని ముఖ్యమైన ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్‌లను ఈ షెడ్యూల్‌లో పూర్తి చేయాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశాడు. ఈ షెడ్యూల్ ను హైదరాబాద్, రాజస్థాన్ లోని జోధ్‌పూర్ తో పాటు కొన్ని ఫారిన్ లొకేషన్స్ కూడా షూట్ చేయబోతున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై తెరెకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది.న్యూ ఇయర్ లేదా సంక్రాంతి కానుకగా ఈ సినిమా టైటిల్ లేదా ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశం ఉంని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

Exit mobile version