NTR-Neel : ఎన్టీఆర్-నీల్ మూవీ టీజర్‌తో టైటిల్.. టీజర్ డేట్ ఫిక్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న #NTRNeel (ప్రచారంలో ఉన్న టైటిల్ డ్రాగన్) చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జోర్డాన్ ఎడారిలో అత్యంత భారీ స్థాయిలో జరుగుతోంది. అక్కడ ఎన్టీఆర్‌పై హాలీవుడ్ యాక్షన్ సినిమాల రేంజ్‌లో కొన్ని కీలకమైన ఫైట్ సీక్వెన్స్‌లను నీల్ చిత్రీకరిస్తున్నారు. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారు. కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాలతో మాస్ ఆడియన్స్ పల్స్ పట్టుకున్న ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ లాంటి పవర్‌ఫుల్ పర్ఫార్మర్‌ను ఎలా చూపిస్తారో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే, మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు ఉండటంతో, ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా ఇచ్చేందుకు మేకర్స్ ఒక క్రేజీ ప్లాన్ వేశారు.
Also Read : Lavanya Tripathi : మా ఫ్యామిలీ జోలికి వస్తే ఊరుకోను.. ట్రోలర్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన లావణ్య
Also Read
- IND Vs SL: శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన పడిక్కల్.. సెంచరీ పూర్తి..
- US-Iran: ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తామన్న ట్రంప్.. హార్ముజ్‌లో దాడులు తీవ్రం చేసిన టెహ్రాన్
- Mahatma Gandhi: గాంధీ చివరి నిరాహార దీక్ష.. పాకిస్తాన్‌కు రూ.55 కోట్లు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది?
- Venky Atluri: వెంకీ అట్లూరి నక్క తోకేదో తొక్కినట్టే ఉన్నాడుగా!
ఎన్టీఆర్ బర్త్ డే కంటే ఒక రోజు ముందుగానే, అంటే మే 19న ఈ సినిమా పవర్‌ఫుల్ టీజర్ లేదా గ్లింప్స్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారట. సోషల్ మీడియాను షేక్ చేసేలా ఈ టీజర్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేస్తున్నారని, ఇందులో ఎన్టీఆర్ లుక్ మునుపెన్నడూ చూడని విధంగా చాలా ఊరమాస్‌గా ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను జూన్ 25, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించగా. ఈ టీజర్ ద్వారా సినిమా అసలు కథ ఏంటనేది ఒక చిన్న హింట్ ఇవ్వడంతో పాటు, టైటిల్‌పై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందట. ఒకవేళ మే 19న టీజర్ రావడం నిజమైతే, ఆ రోజు ఇంటర్నెట్‌లో రికార్డుల సునామీ ఖాయమని చెప్పొచ్చు.
తాజావార్తలు
-
IND Vs SL: శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన పడిక్కల్.. సెంచరీ పూర్తి..
-
Bhagyashri Borse: స్టార్స్టేటస్కి ఒక్క అడుగు దూరంలో భాగ్యశ్రీ?
-
Irumudi: ‘ఇరుముడి’ టైటిల్ ఎందుకు పెట్టారో చెప్పిన డైరెక్టర్ శివ నిర్వాణ.. అసలు కారణం ఇదేనంట!
-
US-Iran: ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తామన్న ట్రంప్.. హార్ముజ్‌లో దాడులు తీవ్రం చేసిన టెహ్రాన్
-
Mahatma Gandhi: గాంధీ చివరి నిరాహార దీక్ష.. పాకిస్తాన్‌కు రూ.55 కోట్లు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది?
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!