ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ #NTRNeel గురించి రోజుకో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన ఘట్టం ఈరోజు నుంచి మొదలైంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈరోజు (సోమవారం) నుంచి ఒక భారీ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో ప్రధానంగా హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ మార్క్ మేకింగ్‌కు తగినట్లుగా, ఈ యాక్షన్ ఎపిసోడ్స్ వెండితెరపై ఒక విజువల్ ఫీస్ట్‌లా ఉండబోతున్నాయని టాక్.
Also Read:Nani: నాని డేట్స్ కోసం దర్శకుల పోరాటం.. ఆ లుక్ మారే వరకు ‘రోమియో’ రానట్టే!
ఈ సినిమాలోని విలన్ పాత్ర కోసం చిత్ర యూనిట్ ఒక హాలీవుడ్ నటుడిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ స్థాయిలో విజువల్స్ ఉండాలనే ఉద్దేశంతో ప్రశాంత్ నీల్ ఈ నిర్ణయం తీసుకున్నారట. ఎన్టీఆర్ వర్సెస్ హాలీవుడ్ యాక్టర్ సీన్స్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయి. అలానే మరో పక్క ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మే 20 (తారక్ పుట్టినరోజు) రానే వస్తోంది. ఈ సందర్భంగా సినిమా టీజర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఎడిటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే ఊపందుకున్నాయి. ఈ టీజర్ తోనే సినిమా అసలు టైటిల్ ‘డ్రాగన్’ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ బాగా బక్కపల్చగా తయారయ్యారని, ఆయన ముఖంలో మునుపటి కళ తగ్గిందని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే, వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ ఒక అదిరిపోయే ఫోటోను షేర్ చేసింది. జిమ్‌లో కష్టపడుతున్న ఎన్టీఆర్ బాడీ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇది నీరసం కాదు.. సినిమా కోసం తారక్ మలచుకున్న ‘బీస్ట్ మోడ్’ అని ఆ ఫోటో స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం ఈ కండలు తిరిగిన ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
