Nani: నాని డేట్స్ కోసం దర్శకుల పోరాటం.. ఆ లుక్ మారే వరకు ‘రోమియో’ రానట్టే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని ఇప్పుడు కేవలం కథలను మాత్రమే కాదు.. తన లుక్స్‌ను కూడా పూర్తిస్థాయిలో మార్చేస్తూ పాన్ ఇండియా రేంజ్‌లో అదరగొడుతున్నారు. అయితే, ఇదే ఇప్పుడు ఆయన తదుపరి చిత్రాల షూటింగ్ షెడ్యూల్స్‌పై ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ద ప్యారడైజ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీ మార్చి నుంచి ఆగస్ట్‌కు వాయిదా పడటంతో, చెప్పిన సమయానికి సినిమా వస్తుందా? లేదా? అన్న సందేహాలు ఇండస్ట్రీలో ఉన్నాయి.
Also Read : Sreeleela-Krithi Shetty: హిట్టు కోసం పక్క రాష్ట్రానికి వెళ్ళినా.. శ్రీలీల, కృతి శెట్టిలకు తప్పని తిప్పలు..
Also Read
కానీ హీరోయిన్ కయదు లోహర్ బర్త్ డే పోస్టర్‌లో ఆగస్ట్ 21 తేదీని మరోసారి మేకర్స్ నొక్కి చెప్పారు. ఇక ఈ సినిమా కోసం నాని తన జుట్టు, గడ్డాన్ని బాగా పెంచేశారు. ఆ లుక్ పూర్తి కాకుండా ఆయన మరో సినిమా సెట్స్‌లోకి వెళ్లడం అసాధ్యం. మరోవైపు, ‘సాహో’ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో నాని చేయబోయే ‘బ్లడీ రోమియో’ స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధమైంది. క్యాస్టింగ్ కూడా పేపర్ మీద రెడీగా ఉన్నప్పటికీ.. నాని ‘ప్యారడైజ్’ నుంచి ఫ్రీ అయితేనే ఇతర ఆర్టిస్టుల కాల్ షీట్స్ తీసుకోవడానికి వీలవుతుంది. ‘బ్లడీ రోమియో’ ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామా కావడంతో ఇందులో నాని లుక్ పూర్తి డిఫరెంట్‌గా ఉండబోతోంది. అంటే.. శ్రీకాంత్ ఓదెల సినిమాకు ‘గుమ్మడికాయ’ కొట్టే వరకు.. సుజిత్ సినిమా ‘కొబ్బరికాయ’ కొట్టలేదన్నమాట. ఒకప్పుడు నాని ఒకే లుక్‌తో రెండు సినిమాలు చేసేవారు, కానీ ఇప్పుడు సబ్జెక్ట్స్ డిమాండ్ మేరకు ఒక్కో సినిమాకు ఒక్కో మేకోవర్ అవసరమవుతోంది. సో.. ‘ప్యారడైజ్’ షూటింగ్ ఎంత త్వరగా పూర్తయితే, ‘బ్లడీ రోమియో’ అంత త్వరగా పట్టాలెక్కుతుంది.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!