‘కాంతార: చాప్టర్ 1’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తున్నాడనే విషయం తెలియగానే.. ఇది నందమూరి ఈవెంట్‌గా మారిపోయింది. గతంలో ఎన్టీఆర్ ఏ ఈవెంట్‌కు వెళ్లినా.. అది టైగర్ ఈవెంట్‌లా రచ్చ చేశారు అభిమానులు. ఇప్పుడు కాంతార ఈవెంట్ మాత్రం చాలా స్పెషల్‌గా నిలవబోతోంది. ఇటీవల ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డబుల్ కాలర్ ఎగరేశాడు ఎన్టీఆర్. దీంతో ఇప్పుడు వార్ 2 రిజల్ట్ పై తారక్ స్పందిస్తాడా? అని అంతా వెయిట్ చేస్తున్నారు.
అలాగే కాంతార హీరో రిషబ్ శెట్టితో ఎన్టీఆర్‌కు మంచి స్నేహబంధం ఉంది. గతంలో తన కుటుంబంతో కలిసి కర్ణాటక పర్యటనకు వెళ్లినప్పుడు ఎన్టీఆర్, రిషబ్ శెట్టి కలుసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పుడే కాంతారలో ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడనే టాక్ వచ్చింది. కానీ ఇటీవల ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’లో రిషబ్ శెట్టి నటిస్తున్నట్టుగా ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు కాంతార ఈవెంట్‌లో దీనిపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే డ్రాగన్ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. కాంతారలో కూడా ఆమెనే హీరోయిన్. దీంతో ఫస్ట్ టైం ఒకే వేదికపై డ్రాగన్ జోడీ సందడి చేయనుంది. ఈ పెయిర్‌ను చూడ్డానికి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు.
కాంతార ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డ్రాగన్ గురించి ఎన్టీఆర్ ఏదైనా అప్డేట్ ఇస్తాడా?, దేవర 2 గురించి ఏమైనా మాట్లాడతాడా?, అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా చెబుతాడా? అని ఎన్టీఆర్ స్పీచ్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. కాంతార తెలుగు ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ ఆదివారం సాయంత్రం 5 గంటలకు గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. మరి ఈసారి ఎన్టీఆర్ స్పీచ్ ఎలా ఉంటుందో చూడాలి.
