ఒకవైపు అధికార బీఆర్ఎస్ లోకి వలసలు వస్తుంటే.. ఇటు బీజేపీలోకి కూడా వలసలు కొనసాగుతున్నాయి. బీజేపీలో చేరారు ఎన్ఆర్ఐ స్మితారెడ్డి. కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. ప్రవాస భారతీయురాలు, అరోహ్ లిమిటెడ్ ఐటీ, సూపర్ మార్కెట్ వ్యాపార నిర్వాహకురాలు బోదనపల్లి స్మితారెడ్డి బీజేపీలో చేరారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడకు చెందిన స్మితారెడ్డి ఈరోజు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, అధికార ప్రతినిధి టి.వీరేందర్ గౌడ్ లతో కలిసి కోరుట్ల నియోజకవర్గంలోని మెట్ పల్లి ప్రజాసంగ్రామ యాత్ర లంచ్ శిబిరం వద్దకు వచ్చారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్మితారెడ్డికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్మితారెడ్డి మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతాలు విధానాలకు ఆకర్షితురాలినై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపే ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలో క్రియాశీలక పాత్ర పోషిస్తానని తెలిపారు.
Read Also:Pawan Kalyan: ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్న పవన్.. 20 ఏళ్ల తర్వాత ఇలా
మరోవైపు జగిత్యాలలో బండి సంజయ్ మాట్లాడారు. బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. బిఆర్ యస్ పార్టీని చూసి జనం నవ్వుతున్నారు. గుజరాత్ గెలుపు దృష్టి మరల్చడానికి ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు. గుజరాత్ పోయి డబ్బులు ఇచ్చివచ్చిండు. బీఆర్ఎస్ బందిపోట్ల రాష్ట్ర సమితి గా మారింది. కృష్టా జలాల విషయంలో తెలంగాణకి ద్రోహం చేసింది కేసీఆర్ అన్నారు. 299 టి ఎంసిలు కు సంతకం చేసి కమిషన్లు తీసుకున్నావ్. రెండు రాష్ట్ర నాయకులతో కలిసి కుట్రలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సెంటి మెంట్ రగిల్చి పబ్బం గడుపుతున్నారని కేసీఆర్ పై మండిపడ్డారు బండి సంజయ్.