Medicines Prices: కేంద్ర ప్రభుత్వం మరోసారి సామాన్య ప్రజలకు భారీ షాక్ ఇచ్చింది. ట్యాబ్లెట్స్ ధరలను పెంచుతున్నట్లు కేంద్రం పేర్కొనింది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) డయాబెటిస్, బీపీ సహా 54 రకాల ఔషధాల ధరలను పెంచుతున్నట్లు వెల్లడించింది. ఎక్కువ మంది బీపీకి వినియోగించే టెల్మిసార్టన్, క్లోర్తాలిడోన్, సిల్నిడిపైన్ కలిపిన మాత్రలు రిటైల్ ధర ఒక్కో టాబ్లెట్‌కు రూ.7.14గా నిర్ణయించారు.. సిప్రోఫ్లోక్సాసిన్ యాంటీ బాక్టీరియల్ ఇంజక్షన్ ధర మిల్లీలీటర్ (మి.లీ)కు రూ.0.23గా మోడీ సర్కార్ సవరించింది. అధికంగా వినియోగించే మెటా ఫార్మిన్, లినాగ్లిస్టిన్, సిటాగ్లిస్టిన్ రేట్లను ట్యాబ్లెట్ కు రూ.15 నుంచి రూ.20కు పెంచుతున్నట్లు సెంట్రల్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. యాంటీ బ్యాక్టీరియల్ ఇంజెక్షన్ సిప్రోఫ్లోక్సాసిన్, కాల్షియం, విటమిన్ డీ3 పిల్స్ ధరలు సైతం భారీగా పెరిగాయి.
Read Also: Pawan Kalyan: వరుసగా రెండో రోజు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్షలు..
ఇక, కొలెస్ట్రాల్‌కు చికిత్స కోసం వినియోగించే అటోర్వాస్టాటిన్, ఆస్పిరిన్ కలయిక క్యాప్సూల్స్ రిటైల్ రేట్లను కూడా ఎన్‌పీపీఏ పెంచుతున్నట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సామాన్యులకు భారంగా మారనుంది. క్యాల్షియం, విటమిన్ డి3 ట్యాబ్లెట్ల ధరను ఒక్కో టాబ్లెట్‌కు రూ.7.82గా నిర్ణయించడంతో పాటు యూరో హెడ్ ప్లాస్టిక్ బాటిళ్లతో కూడిన 500 ఎంఎల్ గ్లూకోజ్ ప్యాక్ ధర రూ.0.24గా ఫిక్స్ చేశారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, NPPA నిర్ణయం మేరకు.. మధుమేహం, రక్తపోటు, గుండె సమస్యలు, మల్టీవిటమిన్‌లు, బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు, అలర్జీలకు సంబంధించిన ట్యాబ్లెట్స్, ఫార్ములేషన్‌లకు రేట్లను నరేంద్ర మోడీ ప్రభుత్వం సవరించింది.