Site icon NTV Telugu

November 19: నవంబర్ 19.. భారత క్రికెట్ చరిత్రలో ఓ చేదు జ్ఞాపకం..!

November 19

November 19

November 19: నవంబర్ 19, 2023… భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ చెరగని ఒక చేదు జ్ఞాపకం. ఆ రాత్రి టీమిండియా కేవలం ఒక ఫైనల్ మ్యాచ్‌ను మాత్రమే కోల్పోవడమేకాక.. కోట్లాది భారతీయుల కలలు, ఆశలు, అభిలాషలు ఛిన్నాభిన్నమయ్యాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ప్రేక్షకులతో నిండిపోయి ఉన్న మ్యాచ్ ముగిసే సరికి అక్కడ నెలకొన్న నిశ్శబ్ధం గుండెల్ని పిండివేసింది. దీనికి కారణం ఆ రోజునే భారత్ 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది.

Andhra King Taluka: ఇది నా వ్యక్తిగత చిత్రం – రామ్ ఎమోషనల్ స్పీచ్ వైరల్

ఆ ఓటమి ప్రభావం స్టేడియంలో మాత్రమే కాదు.. ప్రపంచంలో ఉన్న ప్రతి భారతీయుడు అనుభవించాడు. ప్రతి నగరం, ప్రతి పల్లెటూరు, ప్రతి గల్లీ, సోషల్ మీడియా ఎక్కడ చూసినా భారత జట్టు ఓటమి పట్ల నిశ్శబ్ధం, బాధ, కన్నీటి స్పందనలే. లీగ్ దశ నుంచి సెమీ-ఫైనల్ వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓటమి పాలవ్వకుండా అజేయంగా సాగిన భారత్ ఫైనల్‌లో కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందనే నమ్మకం ప్రతి మనసులో బలంగా ఉంది. అయితే ఆ రాత్రి అదృష్టం భారత వైపు లేకపోవడం, ఆస్ట్రేలియా చేసిన అద్భుతమైన ఫీల్డింగ్, ట్రావిస్ హెడ్ సెంచరీ గెలుపును దూరం చేసింది. ఐదుసార్లు ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా, తన అనుభవంతో ఆరో టైటిల్‌ను అందుకుంది.

43 గంటల ప్లేబ్యాక్, 32dB వరకు ANC సపోర్ట్‌ తో Oppo Enco Buds 3 Pro+ లాంచ్.. ధర ఎంతంటే..?

Exit mobile version