Site icon NTV Telugu

TSPSC: టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ రిలీజ్

Tspsc

Tspsc

తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ లో ఖాళీగా ఉన్న చైర్మన్, సభ్యుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన వారి నుండి దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఇందుకు గాను దరఖాస్తుల నమూనా పత్రాలను www.telangana.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. అందులో.. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల పదవులకు కావాల్సిన అర్హతలు, ఇతర వివరాలు ప్రభుత్వ వెబ్-సైట్ లో ఉంచింది. అర్హులైన వారు ఈనెల 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నిర్ణీత దరఖాస్తులను ఆన్-లైన్, ఈ-మెయిల్ secy-ser-gad@telangana.gov.in ద్వారా అప్లై చేసుకోవాలని తెలిపారు.

Read Also: Andhrapradesh: అంగన్వాడీ సంఘాలతో కొలిక్కిరాని ప్రభుత్వ చర్చలు

ఇదిలాఉంటే.. ఇటీవలి వరకు టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా ఉన్న జనార్దన్ రెడ్డి, సభ్యులు ఆర్.సత్యనారాయణ, కారం రవీందర్ రెడ్డి, బండి లింగారెడ్డి రాజీనామా చేశారు. ఈ రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రెండు రోజుల క్రితం ఆమోదించారు. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త కమిటీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. టీఎస్పీఎస్సీలో చైర్మన్ తో పాటు 10 మంది సభ్యులుంటారు. కానీ గత ప్రభుత్వం చైర్మను, ఆరుగురు సభ్యులను మాత్రమే నియమించింది.

Read Also: Ram Temple consecration: అంబేద్కర్, జగ్జీవన్ రామ్, కాన్షీరామ్ కుటుంబ సభ్యులకు ఆహ్వానం..

Exit mobile version