NTV Telugu Site icon

Kejriwal: సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్యకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Sunitha Kejrival

Sunitha Kejrival

సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్యకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కోర్టు ప్రొసీడింగ్స్ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోర్టు నోటీసుల్లో పేర్కొంది. మార్చి 28వ తేదీన రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో జడ్జి కావేరి భావేజ ముందు జరిగిన లిక్కర్ కేసు విచారణ సందర్భంగా.. సీఎం కేజ్రీవాల్ తన అరెస్ట్ కు సంబంధించిన వాదనలు కోర్టుకు వినిపించారు. ఈ క్రమంలో.. కేజ్రీవాల్ కోర్టు ముందు చెప్పిన వీడియో, ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Gujarat : 500 అడుగుల బోరుబావిలో పడిన చిన్నారి.. 17 గంటల తర్వాత మృతి

కేజ్రీవాల్ కోర్టు వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీల సోషల్ మీడియా టీమ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే.. కేజ్రీవాల్ వీడియో పోస్టుల సునీతా కేజ్రీవాల్ ను ట్విట్టర్ లో రీపోస్ట్ చేశారు. కోర్టు నిబంధనలకు విరుద్ధంగా కోర్టు ప్రొసీడింగ్స్ లోని కేజ్రీవాల్ వీడియోను రికార్డ్ చేయడమే కాకుండా.. సోషల్ మీడియాలో పోస్టు చేశారని అడ్వకేట్ వైభవ్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

Andhra Pradesh: ఏజెన్సీలో తీరని కష్టాలు.. డోలీలో ఆస్పత్రికి గర్భిణీ..

ఈ క్రమంలో.. సోషల్ మీడియాలో ఉన్న వీడియోను ఆయా సంస్థలు తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. న్యాయవాది వైభవ్ సింగ్ వేసిన పిల్ ను ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ, జస్టిస్ అమిత్ శర్మల ధర్మాసనం విచారించింది. “కోర్టుల కోసం, వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం ఢిల్లీ హైకోర్టు రూల్స్ 2021” ప్రకారం కోర్టు విచారణలను రికార్డ్ చేయడం నిషేధించారు. ఇలాంటి వీడియోలను వైరల్ చేయడం వలన న్యాయవ్యవస్థ, న్యాయమూర్తుల ప్రతిష్టను కించపరిచే ప్రయత్నం అని వైభవ్ సింగ్ వాదించారు. ఇలాంటి వీడియోలను పోస్ట్ చేయడం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ కలిసి పన్నిన కుట్రలో భాగమేనని పేర్కొన్నారు.