ప్రతిపక్ష పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ప్రధాని మోడీ అన్నారు. ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా బీహార్‌లోని పూర్ణయాలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోడీ మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాల కోసం పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారు ఒక విషయం తెలుసుకోవాలని, సీఏఏ అమలు విషయంలో తాను ఎంతమాత్రం భయపడేది లేదని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మోడీ తేల్చిచెప్పారు. తమ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎన్నో చర్యలు చేపట్టిందని, ఆర్జేడీ అధికారంలో ఉన్నప్పుడు అవకతవకల పాలన సాగించిందని ధ్వజమెత్తారు. విపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాట్లను అనుమతిస్తున్నాయని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Ram Charan: రామ్ చరణ్ ధరించిన షర్ట్ రేటు అన్ని వేలా? వామ్మో!
సీమాంచల్ చాలా సున్నితమైన ప్రాంతమని… ఓట్ బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న వారు సీమాంజల్ పూర్ణియా ప్రాంతంలో అక్రమ చొరబాట్లకు అనుమతిస్తూ భద్రతతో రాజీపడుతున్నారని ఆరోపించారు. దేశ భద్రతను గందరగోళంలో పడేసే శక్తుల పట్ల తమ ప్రభుత్వం ఒక కన్నేసి ఉంచుతుందని మీకు భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. సీమాంచల్, పూర్ణియా అబివృద్ధికి కట్టుబడి తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. దేశంలోని 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేశామని, వారికోసం తమ ప్రభుత్వం రేయింబవళ్లు పనిచేస్తోందని తెలిపారు. సీమాంచల్ ఏరియాలో వందే భారత్, నమో భారత్ రైళ్ల ద్వారా డపలప్‌మెంటీ కనెక్టివిటీ కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఒక ట్రయిలర్ మాత్రమేనని, ఇప్పుడు సీమాచంల్, బీహార్, యావద్దేశాన్ని మరింత అభివృద్ధి దిశగా పరుగులు తీయిస్తామని మోడీ భరోసా ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Dharmapuri Arvind: దేశానికి మోడీ తప్ప ఏ గ్యారంటీ లేదు
కాగా పూర్ణియాలో లోక్‌సభ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ఇంతకుముందు ఈ సీటులో గెలిచిన పప్పూ యాదవ్ ఇక్కడ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్‌లో చేరారు. ఇక్కడ తమ అభ్యర్థిగా సంతోష్ కుమార్‌ను బీజేపీ నిలబెట్టగా, బీమా భారతిని ఆర్జేడీ నిలబెట్టింది. 40 లోక్‌సభ స్థానాలున్న బీహార్‌లో మొత్తం 7 దశల్లోనూ పోలింగ్ జరుగనుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 40 సీట్లలో ఎన్డీయే 39 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 17 స్థానాల్లో, జేడీయూ 16 స్థానాల్లో గెలువగా, ఎల్‌జేపీ 6 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్‌కు ఒక సీటు దక్కింది.
ఇది కూడా చదవండి: KKR vs RR: రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.. సెంచరీతో చెలరేగిన నరైన్
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కాగా.. ఏప్రిల్ 26న సెకండ్ విడత, మే 7, 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
