NTV Telugu Site icon

Ballistic Missiles: మూడు బాలిస్టిక్ మిస్సైళ్లను ప‌రీక్షించిన నార్త్ కొరియా..

Koria

Koria

ఉత్తర కొరియా ఇవాళ ప‌లు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్లను (Ballistic Missiles) పరీక్షించింది. తూర్పు స‌ముద్రంలోకి వాటిని రిలీజ్ చేసింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.. ద‌క్షిణ కొరియాలో పర్యటిస్తున్న టైంలో.. నార్త్ కొరియా ఈ క్షిప‌ణులను ప్రయోగించినట్లు తెలుస్తుంది. రెండు నెల‌ల త‌ర్వాత తొలిసారి ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిప‌ణుల‌ను పరీక్షించినట్లు సమాచారం. నేటి ఉద‌యం 7.44 నిమిషాల నుంచి 8.22 నిమిషాల మ‌ధ్య ఫైరింగ్ జ‌రిగినట్లు సౌత్ కొరియా జాయింట్ చీఫ్ ఆప్ స్టాఫ్ పేర్కొన్నారు. ఆ మిస్సైల్స్ సుమారు 300 కిలో మీట‌ర్ల దూరం ప్రయాణించినట్లు చెప్పారు. ఆ త‌ర్వాత అవి తూర్పు స‌ముద్రం (సీ ఆఫ్ జ‌పాన్‌)లో ల్యాండ్ అచిపట్లు వెల్లడించింది.

Read Also: Pakistan: పాక్ వైమానిక దాడులు.. 8 మంది మృతి

ఇక, ఉత్తర కొరియా క‌నీసం మూడు క్షిప‌ణుల‌ను ప్రయోగించి ఉంటుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ భావించారు. కేఎన్-24 మిస్సైల్స్ త‌ర‌హాలో అవి ప్రయాణించినట్లు అంచ‌నా వేశారు. కేఎన్-24 సాలిడ్ ఫ్యూయ‌ల్ బాలిస్టిక్ మిస్సైల్‌.. అది దాదాపు 410 కిలో మీట‌ర్ల దూరం ప్రయాణించినట్లు తెలుస్తుంది. ఆ మిస్సైల్ దాదాపు 500 కేజీల బ‌రువున్న పేలోడ్‌ను మోసుకెళ్లగలదని పేర్కొన్నారు. నార్త్ కొరియా నిర్వహించిన మిస్సైల్ పరీక్షలను జపాన్ ప్రధాని కిషిద సైతం తీవ్రంగా ఖండించారు.