Kim Jong Un: అమెరికా ‘ఉగ్రవాది దేశం’.. యూఎస్‌కు కిమ్ స్ట్రాంగ్ వార్నింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kim Jong Un: ఉత్తర కొరియా మరోసారి అమెరికాపై కఠిన వైఖరిని తీసుకుంది. సోమవారం ఆ దేశ సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ పార్లమెంట్లో ప్రసంగిస్తూ అమెరికాను ఒక “ఉగ్రవాద” దేశంగా అభివర్ణించారు. ఉత్తర కొరియా తన అణ్వాయుధాలను ఎప్పటికీ వదులుకోదని మరోసారి స్పష్టం చేశారు. ఇరాన్ అణ్వాయుధాలు సంపాదించకుండా నిరోధించే ప్రయత్నాల్లో అమెరికా ఇప్పటికే నిమగ్నమై ఉన్న తరుణంలో కిమ్ జోంగ్ ఉన్ ఈ ప్రకటన చేశారు. కిమ్ జోంగ్ ఉన్ తన ప్రసంగంలో ఇరాన్ పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ.. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులనే ఉద్దేశించారు. దేశ భద్రతకు అణ్వాయుధాలు అవసరమని.. ఈ ఆయుధాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడమన్నారు. అమెరికా సైనిక విధానాలు శాంతికి ముప్పు అని కిమ్ విమర్శించారు. శాంతియుత జీవిస్తూనే, శత్రువుల దాడులపై ప్రతిస్పందించాలని పిలుపునిచ్చారు. తమ శత్రువులను తిప్పికొట్టేందుకు ఉత్తర కొరియా సిద్ధంగా ఉందని కిమ్ అన్నారు.
Also Read
- Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
- DGCA: డీజీసీఏ సంచలన నిర్ణయం.. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు
- BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
- Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
తన ప్రసంగంలో కిమ్ జోంగ్ ఉన్ దక్షిణ కొరియాను తన అతిపెద్ద శత్రువుగా అభివర్ణించారు. ఉత్తర కొరియా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించే ఏ ప్రయత్నం చేసిన తాను నిర్దాక్షిణ్యంగా ప్రతిస్పందిస్తానని సియోల్‌ను హెచ్చరించారు. కొంతకాలం క్రితం, కిమ్ జోంగ్ ఉన్ దక్షిణ కొరియా వైపు పలు క్షిపణులను సైతం ప్రయోగించారు. మరోవైపు.. ఇటీవల డొనాల్డ్ ట్రంప్ కిమ్ జోంగ్ ఉన్ను కలవాలనే తన కోరికను వ్యక్తం చేశారన్నది గమనించదగ్గ విషయం. అయితే, ట్రంప్‌ను కలవడంలో కిమ్ జోంగ్ ఉన్‌కు పెద్దగా ఆసక్తి లేదని ప్రకటన సూచిస్తోంది. అంతేకాకుండా, ఇరాన్‌పై అమెరికా దాడుల నేపథ్యంలో, ఉత్తర కొరియా ఇప్పుడు తన సైనిక శక్తిని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
-
DGCA: డీజీసీఏ సంచలన నిర్ణయం.. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు
-
BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
-
Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?