NTV Telugu Site icon

North Korea: రష్యా పర్యటనలో కిమ్.. క్షిపణుల ప్రయోగంలో నార్త్ కొరియా

North Korea

North Korea

North Korea: అంతర్జాతీయ వేదిక పైన ఒంటరిగా మిగిలిన రష్యా నార్త్ కొరియాతో పొత్తు పెట్టుకోనుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధకాండ ప్రబలుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా వీలైనంత యుద్ధ సామాగ్రిని పోగుచేసుకునే పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో ఆయుధాలపరంగా ముందు వరుసలో ఉన్నాం అంటూ.. ఎప్పుడు మాధ్యమాలలో విన్యాసాలు చేసే నార్త్ కొరియా నుండి కూడా ఆయుధాలను కొనుగోలు చెయ్యాలి అనుకుంటున్నట్లు అంతర్జాతీయ మాధ్యమాల సమాచారం.

ఈ క్రమంలో నార్త్ కొరియా ధ్యక్షుడు రష్యా పర్యటనకు వెళ్లారు. నా పనిలో నేను బిజీగా ఉంటా.. మీరు మీ పనిలో బిజీ గా ఉండమని ఆఙ్ఞాపించారేమోగాని కిమ్ పర్యటనలో ఉన్నప్పుడే నార్త్ కొరియా అధికారులు క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా అధికారులు పేర్కొన్నారు. బుధవారం ఉత్తర కొరియా తన తూర్పు సముద్రాల వైపు ప్యోంగ్యాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న సునాన్‌ సమీపంలో రెండు స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు.

ఉక్రెయిన్‌లో మాస్కో యుద్ధ ప్రయత్నాలకు ఆజ్యం పోసే సంభావ్య ఆయుధ ఒప్పందం గురించి అంతర్జాతీయ ఆందోళనలు ఉండగా, అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తో సమావేశం అయ్యేందుకు రష్యా వెళ్లారు. US అధికారుల సమాచారం ప్రకారం.. పుతిన్ ఉత్తర కొరియాని ఫిరంగి మరియు ఇతర మందుగుండు సామగ్రిని మరింత సరఫరా చేయమని ఈ సమావేశంలో కోరనున్నారు. కాగా దీనికి ప్రతిఫలంగా కిమ్ తన అణ్వాయుధాలు మరియు క్షిపణుల కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన ఆర్థిక సహాయం మరియు అధునాతన ఆయుధ సాంకేతిక పరిజ్ఞానాన్ని కోరుకోవచ్చని నిపుణులు అంటున్నారు.