NTV Telugu Site icon

North Korea: ఐదోసారి క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిన నార్త్ కొరియా..

North Korea

North Korea

ఉత్తర కొరియా తన ఈశాన్య తీరప్రాంత జలాల్లో అనేక బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. కొరియా ద్వీపకల్పంలో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతల మధ్య జనవరి నుంచి ఉత్తర కొరియాకు ఇది ఐదవ పరీక్ష జరిపినట్లు పేర్కొనింది. అయితే, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన ఆయుధ పరీక్షలను ముమ్మరం చేశారు అని దక్షిణ కొరియా, అమెరికాతో అణు వివాదానికి సంబంధించి రెచ్చగొట్టే ప్రకటనలు చేసిందని చెప్పుకొచ్చారు.

Read Also: Auto Strike: రేపు ఆటో బంద్‌.. సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి ర్యాలీ

అయితే, దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ మాట్లాడుతూ.. దక్షిణ కొరియా, యూఎస్ మిలిటరీలు ఈ పరీక్షలను విశ్లేషిస్తున్నాయన్నారు. వీటిని తూర్పు తీర నగరమైన వోన్సాన్‌కు ఈశాన్యంగా నీటిలో ఈ ప్రయోగం చేశారు. ఉత్తర కొరియా ఎన్ని క్షిపణులను ప్రయోగించిందో.. ఎంత దూరంలో పడిపోయిందో దక్షిణ కొరియా సైన్యం ఇంకా వెల్లడించలేదు. ఈ క్షిపణులను భూమి నుంచి ప్రయోగించారా లేక సముద్రంలో ఉన్న ఏదైనా వనరుల నుంచి ప్రయోగించారా అనేది ఇంకా స్పష్టంగా చెప్పలేదు.

Read Also: Manchu Lakshmi : బాబోయ్.. ఏంటి లక్ష్మీ అరాచకం.. బికినీ లో ఫోటోషూట్..

ఇక, ఈ ఏడాది ఉత్తర కొరియా క్రూయిజ్ క్షిపణి పరీక్ష నిర్వహించడం ఇది ఐదోసారి.. ఇది, జనవరి 16న, ఈ ప్రాంతంలోని రిమోట్ యూఎస్ లక్ష్యాలపై దాడి చేయగల కొత్త ఘన ఇంధన మధ్యస్థ-శ్రేణి హైపర్‌సోనిక్ క్షిపణిని ఉత్తర కొరియా పరీక్షించింది. అయితే, అంతకుముందు ఫిబ్రవరి 9న, ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్, దక్షిణ కొరియాతో దౌత్య సంబంధాలపై తనకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదన్నారు. మమ్మల్ని రెచ్చగొట్టినట్లయితే దత్తర కొరియాను నాశనం చేస్తానని పునరుద్ఘాటించారు. అయితే, అమెరికాలో ఎన్నికల సంవత్సరంలో ఉక్షిణ కొరియా తన ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచే పనిలో నిమగ్నమైందని నిపుణులు అంటున్నారు.