Site icon NTV Telugu

Nora Fatehi : పాత గాసిప్స్ మళ్ళీ తెరపైకి తెచ్చి నోరా..

Nora

Nora

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్లపై డేటింగ్, పెళ్లి వార్తలు రావడం కొత్తేమీ కాదు. కలిసి సినిమాలు చేయకపోయినా, ఒకే వేదికపై కనిపించినా లేదా ఒకే పార్టీలో పాల్గొన్నా వెంటనే రిలేషన్‌షిప్ కథనాలు వినిపిస్తాయి. సరిగ్గా ఇప్పుడు ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది బాలీవుడ్ డ్యాన్సింగ్ సెన్సేషన్ నోరా ఫతేహి. టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నోరా మధ్య ఏదో ఉందంటూ ఐదేళ్ల క్రితం ఒక రెడిట్ (Reddit) యూజర్ చేసిన పోస్ట్ ఇప్పుడు టిక్ టాక్ లో మళ్ళీ ప్రత్యక్షమై హల్చల్ చేస్తోంది.

Also Read : Mrunal-Dhanush : ఫిబ్రవరి 14న ధనుష్‌తో పెళ్లి? రూమర్లకు చెక్ పెట్టి మృణాల్ ఠాకూర్ టీమ్ ..

అప్పట్లో ఆ రెడిట్ పోస్ట్‌లో.. ‘నోరా ఫతేహి వాడుతున్న ఖరీదైన బ్రాండెడ్ బ్యాగులు, లగ్జరీ కార్లు, ఆమె మెయింటైన్ చేస్తున్న హై-క్లాస్ లైఫ్ స్టైల్ వెనుక భూషణ్ కుమార్ హస్తం ఉంది. టీ-సిరీస్ లో ఆమెకు వస్తున్న వరుస ఆఫర్లు కూడా అందుకే..’ అంటూ ఘాటైన ఆరోపణలు చేశారు. అయితే, ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న నోరా, తాజాగా ఒక టిక్ టాక్ వీడియో కింద ప్రత్యక్షమై తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది. కేవలం “వావ్” అంటూ ఒకే ఒక్క పదం, ఒక నవ్వుతున్న ఎమోజీతో ఆ రూమర్లను లైట్ తీసుకుంది.

నోరా ఇచ్చిన ఈ ‘సావేజ్’ రిప్లై ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది. “ఖచ్చితంగా ఆమె తన రేంజ్‌లో కౌంటర్ ఇచ్చింది” అని కొందరు ఫ్యాన్స్ అంటుంటే.. “మళ్ళీ ఆ పాత రూమర్లకు ఆమె కామెంట్ చేయడం వల్ల దానికి అనవసరమైన హైప్ వచ్చింది” అని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద నోరా ఫతేహి ఇప్పుడు సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.

Exit mobile version