Site icon NTV Telugu

Manipur Violence: మణిపూర్‌లో ఆగని హింసాకాండ.. స్కూల్స్ తెరిచిన తెల్లారి మహిళ హత్య

Manipur Violence

Manipur Violence

మణిపూర్‌లో హింసాకాండ ఎంతకి ఆగడం లేదు. స్కూల్స్ తెరచిన మరుసటి రోజునే ఓ పాఠశాల బయట ఒక మహిళను ఇద్దరు గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా కాల్చి చంపేశారు. గత రెండు నెలలుగా రాష్ట్రంలో కొనసాగుతున్న అల్లర్లు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఇప్పటికీ రాష్ట్ర ప్రజానీకం సాయుధ దళాల మధ్యలోనే జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇక పాఠశాలలు ఇంతకు ముందే తెరవాల్సి ఉండగా రాష్ట్రంలో ఉద్రిక్తత తగ్గకపోవడంతో వేసవి సెలవులను పొడిగించారు.

Also Read: CM YS Jagan: గృహనిర్మాణాశాఖపై సీఎం సమీక్ష.. పేదలకు ఇళ్లు రాకూడదని కుట్ర చేస్తున్నారు..!

రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత జులై 5న స్కూల్స్ రీఓపెన్ కాగా తల్లిదండ్రులు తమ పిల్లలను పంపించడానికి భయంతో వెనుకడుగు వేశారు. దీంతో మొదటి రోజున విద్యార్థుల హాజరు కూడా అంతంత మాత్రంగానే ఉంది. కానీ.. రెండో రోజున మణిపూర్‌లోని ఇంఫాల్ వెస్ట్ లో శిశు నిష్ఠ నికేతన్ స్కూల్ ఎదురుగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక మహిళను కాల్చి చంపడంతో స్థానిక ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు మరింత భయాందోళనలకు గురయ్యారు.

Also Read: GHMC : థీమ్‌ పార్క్‌గా రూపాంతరం చెందిన డంప్‌ యార్డ్‌

అయితే.. చనిపోయిన మహిళ వివరాలతో పాటు హంతకులు వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా ఈ రోజు ఉదయం కంగ్పోక్పి జిల్లాలో మాపావో, సవాంగ్ ప్రాంతాలకు చెందిన రెండు సాయుధ వర్గాలు గొడవకు దిగడంతో భద్రతా దళాలు వారిని చెదరగొట్టాయి. అంతకు ముందు థౌబల్ జిల్లాలో పోలీసుల ఆయుధ కర్మాగారం నుంచి ఆయుధాలను ఎత్తుకెళ్లాలని అల్లరిమూకలు చూశాయి. వారి ప్రయత్నాన్ని భగ్నం చేసిన ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ సైనికుడి ఇంటిని తగలబెట్టడంతో ఘర్షణ తలెత్తింది.. దీంతో 27 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. మరో 10 మందికి తీవ్ర గాయాల అయ్యాయి.

Exit mobile version