Nominations: మోగనున్న ఎన్నికల సైరన్.. తెలంగాణ, ఏపీల్లో రేపట్నుంచే నామినేషన్ల పర్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nominations: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రేపట్నుంచి ఎన్నికల నామినేషన్లు మొదలు కానున్నాయి. గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాగానే… ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలు, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు, ఒక అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 25 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈనెల 26న నామినేషన్లను పరిశీలన, 29న నామినేషన్ల విత్‌డ్రాకు అవకాశం ఇచ్చింది ఈసీ. పోలింగ్ మే 13న జరుగుతుంది. జూన్ నాలుగున కౌంటింగ్ ఉంటుంది. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్ ఆఫీస్ గేటు నుంచి 100 మీటర్ల వరకే వాహనాలకు అనుమతి ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని తెలిపింది.
Read Also: Vallabhaneni Balashowry: నా వల్ల కాదు అనే వైసీపీకి రాజీనామా చేశా..
Also Read
- AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
- Donald Trump: ఫ్రాన్స్‌లో అల్లర్లు.. వలసదారులే కారణమన్న ట్రంప్, ‘సరిహద్దులు మూసేయండి’ అంటూ పిలుపు!
- Kiren Rijiju: ‘‘బంగ్లాదేశ్-ఫ్రాన్స్ తరహాలో భారత్‌లో కుట్ర’’.. సోరోస్ ప్లాన్ పనిచేయదన్న కిరెన్ రిజిజు..
- Kilauea volcano: 55వ సారి కిలావుయా అగ్ని పర్వత విస్పోటనం..
ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు ముహుర్తాలు చూసుకున్నారు. పేరు బలం, గ్రహబలం చెక్ చేసుకుని నామినేషన్ వేసేందుకు టైం కూడా ఫిక్స్ చేసుకున్నారు. అఫిడవిట్లు, పేపర్ వర్కంతా రెడీ చేసుకుని పెట్టుకున్నారు. అవసరాన్ని బట్టి రెండు మూడు సెట్ల నామినేషన్లు వేయడానికి రెడీ అయ్యారు. సీఎం జగన్ ఈనెల 25న పులివెందుల అసెంబ్లీకి నామినేషన్ వేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతకు ముందే 22న జగన్ తరఫున ఒక సెట్ నామినేషన్ అవినాష్ రెడ్డి వేస్తారని చెబుతున్నారు.
Read Also: Kejriwal: కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీకి మరో షాక్.. తాజా ఆదేశాలు ఇవే
తెలంగాణలో రేపటి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. రేపు మెదక్, మల్కాజ్గిరి, మహబూబ్‌నగర్ బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మెదక్ నుంచి రఘునందన్‌రావు… మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్, మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ నామినేషన్ వేస్తారు. ఇక… ఎల్లుండి… సికింద్రాబాద్ నుంచి కిషన్‌రెడ్డి, ఖమ్మం నుంచి వినోద్‌రావు నామినేషన్లు దాఖలు చేశారు. వీరి నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరవుతారు. ఈ నెల 22న జహీరాబాద్, చేవెళ్ల, నల్గొండ, మహబూబాబాద్ అభ్యర్థులు నామినేషన్ వేస్తారు. జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, నల్లగొండ నుంచి సైదిరెడ్డి, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ నామినేషన్ వేయనున్నారు. 23న భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి, 24న పెద్దపల్లి, ఆదిలాబాద్, హైదరాబాద్, వరంగల్ అభ్యర్థులు నామినేషన్లు వేస్తారు. హైదారాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కార్యక్రమానికి కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, వరంగల్ అభ్యర్థి అరూర్ రమేష్ నామినేషన్‌కు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ హాజరవుతారు. ఇక… 25న కరీంనగర్, నిజామాబాద్, నాగర్‌కర్నూల్ బీజేపీ ఎంపీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తారు. కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్, నాగర్‌కర్నూల్ అభ్యర్థి భరత్ నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ హాజరుకానుండగా… నిజమాబాద్ అభ్యర్థి అరవింద్ నామినేషన్‌కు అశ్విని వైష్ణవ్ హాజరవుతారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ విషయానికొస్తే ఇంకా కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ప్రకటించిన నియోజకవర్గాల్లో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు రెడీ అవుతున్నారు.
తాజావార్తలు
-
AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
-
TDP : గుంటూరు మేయర్ పీఠంపై టీడీపీ ఫోకస్.. బరిలోకి లక్ష్మీ అపర్ణ..
-
Dharman: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సూపర్ స్టార్.. ‘ధర్మన్’ రిలీజ్ ఎప్పుడంటే?
-
Donald Trump: ఫ్రాన్స్‌లో అల్లర్లు.. వలసదారులే కారణమన్న ట్రంప్, ‘సరిహద్దులు మూసేయండి’ అంటూ పిలుపు!
-
Poco X8s: 12GB RAM, Snapdragon 7 Gen 4 ప్రాసెసర్‌తో Poco X8s? లీకైన వివరాలు ఇవే!
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!