Nokia 3210: భారత మార్కెట్‌లోకి ‘నోకియా 3210’ ఫోన్.. యూపీఐ, యూట్యూబ్ ఫీచర్స్ కూడా!
- భారత మార్కెట్‌లోకి నోకియా 3210
- యూట్యూబ్ ఫీచర్
- 9:30 గంటల పాటు టాక్ టైం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nokia 3210 Price in India: హెఎండీ గ్లోబల్ సంస్థ ‘నోకియా’ బ్రాండ్‌పై స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమధ్య వెనకపడిపోయిన నోకియా.. మళ్లీ పుంజుకునేందుకు చూస్తోంది. ఈ క్రమంలో మూడు కొత్త ఫీచర్ ఫోన్‌లను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. 25 ఏళ్ల తర్వాత నోకియా 3210 మోడల్‌ను మళ్లీ తీసుకొచ్చింది. నోకియా 235 4జీ, నోకియా 220 4జీ పేరిట మరో రెండు ఫోన్లనూ రిలీజ్ చేసింది. యూట్యూబ్, యూపీఐ ఫీచర్లతో ఈ మూడు ఫోన్లు వస్తుండడం విశేషం.
నోకియా 3210 ఫోన్‌లో 1450 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 9:30 గంటల పాటు టాక్ టైం వస్తుందని కంపెనీ పేర్కొంది. అప్పట్లో అందరికీ నచ్చిన స్నేక్ గేమ్ ఇందులో ఉంటుంది. 2ఎంపీ కెమెరా, ఫ్లాష్ టార్చ్ సదుపాయం కూడా ఉంది. అంతేకాదు స్మార్ట్‌ఫోన్ తరహాలో యూపీఐ పేమెంట్లు చేయొచ్చు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పే చేసేయొచ్చు. యూట్యూబ్, యూట్యూబ్ మ్యూజిక్‌తో పాటు వెధర్, న్యూస్, క్రికెట్ స్కోర్, 2048 గేమ్‌తో సహా 8 యాప్స్ ఇందులో ఉంటాయి. దీని ధర రూ.3,999గా ఉంది. స్కూబా బ్లూ, బ్లాక్, వై2కే గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంది.
Also Read
Also Read: OnePlus Nord CE4 Lite 5G Price: ‘వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్’ టాప్-10 ఫీచర్స్ ఇవే!
నోకియా 235 4జీలో 2.8 ఇంచెస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2 ఎంపీ కెమెరా ఉంటుంది. దీని ధర రూ.3,749గా కంపెనీ పేర్కొంది. బ్లూ, బ్లాక్, పర్పల్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. నోకియా 220 4జీ ధర రూ.3,249గా ఉంది. ఈ ఫోన్ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌తో వస్తోంది. పీచ్, బ్లాక్ రంగుల్లో ఇది లభిస్తుంది. ఈ ఫోన్లూ యూట్యూబ్, యూట్యూబ్ మ్యూజిక్, యూపీఐ ఫీచర్లతో వస్తున్నాయి. హెచ్‌ఎండీ సైట్, అమెజాన్‌తో పాటు ఇతర రిటైల్ షాపుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.
తాజావార్తలు
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
-
OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్
-
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!