Site icon NTV Telugu

Karnataka: కర్ణాటకలో జూన్ 1 నుంచి 5 రోజుల పాటు మద్యం బంద్..

Karnaaka

Karnaaka

కర్ణాటకలో జూన్ 1 నుంచి 5 రోజుల పాటు మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, రాష్ట్ర శాసన మండలి ఎన్నికల ఫలితాల కారణంగా జూన్ మొదటి వారంలో కనీసం ఐదు రోజుల పాటు కర్ణాటకలో మద్యం అమ్మకాలు నిషేధించారు. కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలకు ఓటింగ్, జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న క్రమంలో.. జూన్ 1 నుంచి 4 వరకు మద్యం అమ్మకాలు బంద్ కానున్నాయి. శాసన మండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగే జూన్‌ 6న కూడా డ్రై డేగా వ్యవహరిస్తారు.

Read Also: Crime News: వైన్‌ షాపు దగ్గర గొడవ.. బీరు సీసాతో పొడిచి హత్య..

ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం.. ఎన్నికలకు కనీసం 48 గంటల ముందు మద్యం అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. రాష్ట్రంలోని ఎక్సైజ్ శాఖ అధికారుల ప్రకారం.. పైన పేర్కొన్న తేదీలలో మద్యం ఉత్పత్తి, అమ్మకం, పంపిణీ, రవాణా, నిల్వ నిషేధించబడుతుందని తెలిపారు. మద్యం దుకాణాలు, వైన్ షాపులు, బార్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, మద్యం అందించే ఏ ఇతర ప్రైవేట్ స్థలాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తుందని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఐదు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ కానున్న నేపథ్యంలో మందుబాబులు వైన్ షాపుల ముందు క్యూ కట్టారు. ముందస్తుగా మద్యం తెచ్చుకునేందుకు వైన్స్ షాపుల ముందు బారులు తీరడంతో.. శుక్రవారం మద్యం దుకాణాల వద్ద భారీ రద్దీ ఏర్పడింది.

Read Also: Mallikarjun kharge: దేవుడిపై నమ్మకం ఉంటే ఇంట్లో చేసుకోంది.. మోడీ ‘‘ధ్యానం’’పై ఖర్గే

Exit mobile version