జనవరి 22న అయోధ్యలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి పలువురు ప్రముఖులకు ఆహ్వానం పంపించింది ఆలయ కమిటి. అయితే ఈ కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదని తెలిపారు శివసేన (యుబిటి) అధినేత ఉద్ధవ్ ఠాక్రే. అయితే ఆరోజుకు సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే ఏమి చేయబోతున్నారో తన ప్రణాళికను చెప్పారు. ఆ రోజు నాసిక్‌లోని కాలారం ఆలయాన్ని తాను, తన పార్టీ నేతలు సందర్శించి గోదావరి నది ఒడ్డున మహా హారతి చేస్తారని ఉద్ధవ్ చెప్పారు.
తన తల్లి దివంగత మీనా ఠాక్రే జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ.. తనకు ఇష్టం వచ్చినప్పుడు అయోధ్యకు వస్తానని చెప్పారు. అయోధ్య రామ మందిరాన్ని ప్రతిష్టించడం గర్వకారణం, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని తెలిపారు. ఆ రోజు (జనవరి 22) సాయంత్రం 6.30 గంటలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, (సంఘ సంస్కర్త) సానే గురూజీ కలరామ్ ఆలయానికి వెళ్తామని ఠాక్రే అన్నారు. రాత్రి 7.30 గంటలకు గోదావరి నది ఒడ్డున మహా హారతి నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Read Also: Animal Actor: ‘సూసైడ్’కి యత్నించిన యువతిని హీరోలా కాపాడిన ‘యానిమల్’ నటుడు
తన తండ్రి, శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ ఠాక్రే జయంతి రోజైన జనవరి 23న నాసిక్‌లో పార్టీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. గత శనివారం.. ఉద్ధవ్ ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ, “నాకు ఇంకా ఎటువంటి ఆహ్వానం అందలేదు. అయోధ్యకు రావాలని నాకు ఎటువంటి ఆహ్వానం అవసరం లేదు, ఎందుకంటే రామ్ లల్లా అందరికీ చెందినవాడు, నాకు ఎప్పుడు వెళ్లాలనిపిస్తే, అప్పుడు వెళ్తాను”. అని అన్నారు.
నాసిక్‌లోని పంచవటి ప్రాంతంలో ఉన్న కలరామ్ ఆలయం రాముడికి అంకితం చేశారు. నల్లరాతితో చేసిన రాముడి విగ్రహం నుండి ఈ ఆలయానికి పేరు వచ్చింది. వనవాస సమయంలో శ్రీరాముడు తన భార్య సీత, సోదరుడు లక్ష్మణుడితో పంచవటిలో ఉండేవాడని నమ్ముతారు. కాగా.. 1930లో డాక్టర్ అంబేద్కర్ దళితులను కాలారామ్ ఆలయంలోకి ప్రవేశించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు నాయకత్వం వహించారు.
Read Also: Software Engineer Safe: హైదరాబాద్ లో కిడ్నాపైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సేఫ్..