NTV Telugu Site icon

BRS : ఎంపీ రంజిత్ రెడ్డి పోటీపై నెలకొన్న అనిచ్చితి

Mp Ranjith Reddy

Mp Ranjith Reddy

వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను ఖరారు చేసే పనిలో పడ్డారు ఆయా పార్టీల అధిష్టానం పెద్దలు. నిన్న బీజేపీ అధిష్టానం 195 స్థానాలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. దీంతో పాటు.. తెలంగాణలోనూ పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఫైనల్‌ చేస్తూ పేర్లను ప్రకటించింది. అయితే.. వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో సీట్లు గెలిచేందుకు బీఆర్‌ఎస్‌ ఫోకస్‌ పెట్టింది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో చేవెళ్ల లోక్ సభ పరిధిలోని నియోజకవర్గ నేతలతో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ సమావేశమయ్యారు. అయితే.. రంజిత్ రెడ్డి పోటీపై అనిచ్చితి నెలకొంది. పోటీ చేస్తారో లేదో అని ఇంతవరకు రంజిత్ రెడ్డి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో.. ప్రత్యామ్నాయ నేతల పేర్లను బీఆర్‌ఎస్‌ అధిష్టానం ఆలోచిస్తోంది.

  Gopichand: నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు.. భీమాతో కేక పెట్టిస్తా

ఈ క్రమంలోనే తెలంగాణ భవన్ లో నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ చర్చలు జరిపారు. ఈ సమావేశంలో కొప్పుల మహేశ్వర్ రెడ్డి, డాక్టర్ మెతుకు ఆనంద్, పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. పోటీ చేయడానికి ఆసక్తి ఉన్నవారిపై కేటీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. అయితే.. పోటీ చేయడానికి తమకు ఆసక్తి లేదని పలువురు మాజీ ఎమ్మెల్యేలు చెప్పినట్లు సమాచారం. దీంతో.. మేము సూచించిన నేతకు మీరు సపోర్ట్ కేటీఆర్ చేయాలని సూచించారు. కాసాని వీరేశం ముదిరాజ్, మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి పేర్లును సీరియస్ గా పరిశీలిస్తోంది పార్టీ అధిస్టానం.