RBI Monetary Policy: రెపో రేటులో ఎలాంటి మార్పు లేదు : ఆర్బీఐ గవర్నర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI Monetary Policy: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ద్రవ్య పరపతి విధానాన్ని నేడు ప్రకటించింది. రెపో రేటు & రివర్స్ రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. రెపో రేటును 6.50 శాతం వద్దే ఉంచింది. ఇది కూడా రుణ గ్రహీతలకు ఊరటనిచ్చే వార్తే అయితే దీని తర్వాత బ్యాంకుల నుంచి చౌకగా రుణాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఇప్పుడు నిరాశే ఎదురైంది. మానిటరీ పాలసీ కమిటీ మూడు రోజుల సమావేశంలో పాలసీ రేటును 6.5 శాతంగా మార్చకుండా ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నారు.
ద్రవ్యోల్బణం తగ్గింపుపై ఆర్‌బీఐ దృష్టి సారించిందన్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థలో వృద్ధి యథాతథంగా ఉందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్యం కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ ఆర్బీఐ 4 శాతం ద్రవ్యోల్బణ రేటును సాధించడానికి కట్టుబడి ఉంది. ప్రధాన ద్రవ్యోల్బణం రేటు తగ్గుతోంది. దీని ప్రభావం పాలసీ రేట్లపై కూడా కనిపిస్తుంది. జూలై-ఆగస్టులో ద్రవ్యోల్బణం రేటు ఎక్కువగా ఉంటుంది. కూరగాయల ధరలు పెరగడం వల్ల ఇది ప్రధానంగా కనిపిస్తోందని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.
Also Read
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
- Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
Read Also:Jailer Movie Twitter Review : తలైవా కమ్ బ్యాక్ …. రూ.1000కోట్లు పక్కా మావ
ద్రవ్యోల్బణం అంచనాను పెంచిన ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ 2024 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ రేటు అంచనాను పెంచింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం రేటు 5.4 శాతంగా అంచనా వేయబడింది. ఇది క్రితం 5.1 శాతం వద్ద ఉంది. ద్రవ్యోల్బణం రేటుపై ద్రవ్య విధాన కమిటీ ఓ కన్నేసి ఉంచుతుందని ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు. ఆహార ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో భారత ఆర్థిక వ్యవస్థ గణనీయమైన పురోగతిని సాధించిందని ఆయన అన్నారు.
జీడీపీ వృద్ధి అంచనా
2024ఆర్థిక సంవత్సారానికి ఆర్బీఐ జీడీపీ వృద్ధి అంచనాను 6.50 శాతం వద్ద నిర్వహించింది. ఇది చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రపంచ స్థాయిలో ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ.. ప్రస్తుత కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు బలంగానే ఉంది. దేశ స్థూల ఆర్థిక పరిస్థితి బలంగా ఉంది. ఇది ప్రపంచ ఆర్థిక వృద్ధికి ఇంజిన్‌గా మారింది. ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో భారతదేశం ఇతర దేశాల కంటే మెరుగైన స్థానంలో ఉంది. ప్రస్తుతం ఆర్థిక వృద్ధి రేటు 6.50 శాతంగా ఉంటుందని అంచనా.
Read Also:Rajinikanth’s Jailer: రజినీతో అట్లుంటది మరి.. ఉద్యోగుల కోసం 7 స్క్రీన్స్ బుక్ చేసిన సీఈఓ!
ప్రస్తుత పాలసీ రేట్లు
ఆర్బీఐ గవర్నర్ రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. దీని తర్వాత రెపో రేటు 6.50 శాతంగా ఉంది. అదే సమయంలో రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద ఉంది ఇది మారలేదు. ఎంఎస్ఎఫ్ బ్యాంక్ రేటు 6.75 శాతం వద్ద ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది.
తాజావార్తలు
-
Suriya : రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ.?
-
Jai Moondra: రెండు మ్యాచ్‌లకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అండ్ ‘సిరీస్’.. టీమిండియాపై ఈ అవార్డులు వస్తాయనుకోలేదు!
-
Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
Unbeaten Directors of Tollywood : ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుల సినిమాలపై భారీ అంచనాలు
-
Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ ‘ఈత’ సినిమాకు ఊహించని చిక్కు.. కోర్టు మెట్లు ఎక్కనున్న కుటుంబం
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!