Isha Vidhya: ఈశా విద్యకు మద్దతుగా పరుగే పరుగు..
- విద్య కోసం పరుగు
- ఎన్‌ఎండీసీ మారథాన్‌లో పరుగులు తీసిన ఈశా బ్రహ్మచారులు..వాలంటీర్లు
- ఈశా విద్యకు మద్దతుగా పరుగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Isha Vidhya: హైదరాబాద్ NMDC మారథాన్‌లో ఈశా బ్రహ్మచారులు, ఇంకా వాలంటీర్లు ఈశా విద్యకు మద్దతుగా పరిగెత్తారు ఈశా విద్య పై అవగాహన, ఇంకా నిధులను సేకరించే ప్రయత్నంలో, 31 మంది ఈశా బ్రహ్మచారులతో పాటు 170కి పైగా మద్దతుదారులు ఆగస్టు 25న హైదరాబాద్‌లో జరిగిన NMDC మారథాన్‌లో పాల్గొన్నారు. వారు 42 కిమీ పూర్తి మారథాన్, ఇంకా 21 కిమీ హాఫ్ మారథాన్‌లో, 10కే రన్‌లలో పాల్గొన్నారు.
సద్గురు స్థాపించిన ఈశా ఫౌండేషన్ వారు సామాజిక అభివృద్ది కోసం ఈశా ఔట్రీచ్ అనే విభాగం ద్వారా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడులో 10 ఈశా విద్య పాఠశాలలను ఏర్పరిచి, ఉన్నత విలువలతో ఇంగ్లీష్ మీడియం విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ పేద పిల్లలకు అందుబాటులో ఉండేలా విద్యను అందజేస్తున్నాయి. 2006లో ప్రారంభమైనప్పటి నుంచి 10,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఈశా విద్య పాఠశాలల్లో చదువుకున్నారు. వీరిలో 60 శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థులు` వారి కుటుంబంలో బడికి వెళ్తున్న మొదటి తరం వారు – స్కాలర్‌షిప్‌ల ద్వారా మద్దతు పొందుతున్నారు. మిగిలిన వారు తక్కువ ఫీజులు చెల్లిస్తారు.
Also Read
- Priyanka Gandhi: ఆయన సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
- Mohammed Siraj: కొలంబోలో 'డీఎస్పీ సాబ్' రచ్చ.. సరికొత్త లుక్‌తో మైదానంలో మెరిసిన సిరాజ్
- 7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
- Trent Boult విధ్వంసం.. యార్కర్‌తో బెయిర్‌స్టోకు షాక్.! 'బై-బై' సెలబ్రేషన్ వీడియో వైరల్.!
పాఠశాలలలో మౌళిక వసతులతో విశాలంగా, బాగా వెలుతురు ఉన్న తరగతి గదులు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు ఉంటాయి. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం వారికి అవసరమైన విటమిన్లు సమృద్ధిగా ఉండేలా పోషకాహార సమతుల్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అంతే కాదు విద్యార్థులు ఆరోగ్యవంతంగా ఉండేందుకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయిస్తుంటారు. పిల్లలు క్రీడలలో ఇంకా రోజువారీ యోగా అభ్యాసాలలో చురుకుగా పాల్గొంటారు. బహుళ స్థాయిలలో అభ్యాసాన్ని ఉత్తేజపరిచేందుకు ఇంటరాక్టివ్, చర్చ-ఆధారిత తరగతులు ఇంకా ఆచరణాత్మక అభ్యాసంతో ప్రత్యేకమైన పద్దతిని ఈ పాఠశాలలు అనుసరిస్తాయి. ప్రింట్, ఆడియో, వీడియో, కంప్యూటర్ మెటీరియల్స్ ఇంకా డిజిటల్ క్లాస్‌రూమ్‌ల రూపంలో 21వ శతాబ్దంలో విద్యార్థులకు అవసరమైన ప్రాపంచిక అవగాహనను కల్పిస్తూ, వారి నైపుణ్యాలను పెంపొందించేలా ఈశా విద్య పాఠశాలలు కృషి చేస్తున్నాయి. ఈ చిన్నారులు చదువుకునేలా మనందరం సహకారం అందించి వాళ్ళకి మనం అండగా ఉన్నామనే నమ్మకాన్ని ఇవ్వగలమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Priyanka Gandhi: ఆయన సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
-
Mohammed Siraj: కొలంబోలో ‘డీఎస్పీ సాబ్’ రచ్చ.. సరికొత్త లుక్‌తో మైదానంలో మెరిసిన సిరాజ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్‌తో కొత్త స్మార్ట్ టీవీ
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!