Site icon NTV Telugu

MP Arvind: నిజామాబాద్‌లో ఉగ్రమూకలు.. స్పందించిన ఎంపీ ధర్మపురి అరవింద్..

Arvind Dharmapuri

Arvind Dharmapuri

MP Arvind: జిల్లాలో ఉగ్రవాద చర్యలను అరికట్టాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. లా అండ్ ఆర్డర్ సరిగా పనిచేయడం లేదని ఆరోపించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పాలనలో సమాజానికి ముప్పు ఉందని విమర్శలు గుప్పించారు. హిందు పండగలపై ఆంక్షలు పెడుతున్నారని.. వినాయక నిమజ్జన వేడుకల్లో హిందూ యువకులపై అక్రమ కేసులు పెట్టారన్నారు. ముస్లిం యువకులు ర్యాలీలు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.. సిమీ పీఎఫ్ ఐ కార్యకలాపాలకు అడ్డగా మారింది.. హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో లొంగదీసుకుంటున్నారు… ఇది లవ్ జిహాదీ అని తెలిపారు. మార్వాడీ గో బ్యాక్ అంటున్న కాంగ్రెస్ నేతలు.. టర్కీ, బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చిన వారి సంగతేంటి? అని ప్రశ్నించారు.

READ MORE: Tirupati : తిరుపతిలో అదృశ్యమైన పింక్ డైమండ్ రహస్యం వీడింది

కాగా.. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లోని పలు ప్రాంతాల్లో ఢిల్లీకి చెందిన స్పెషల్‌ సెల్‌ పోలీసులు ఇటీవల సోదాలు చేపట్టడం కలకలం రేపింది. పట్టణ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్నారనే కారణంతో గతంలో ప్రత్యేక బలగాలు పలువురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో బీ ఫార్మసీ చదివే ఓ యువకుడిని గత బుధవారం కస్టడీకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. పాకిస్థాన్‌ ఉగ్ర ముఠా హ్యాండ్లర్లతో సంబంధాలు కొనసాగిస్తున్న జార్ఖండ్‌కు చెందిన డానీష్‌ను ఢిల్లీ ప్రత్యేక పోలీసులు ఇటీవల అరెస్ట్‌ చేశారు. తమతో సంబంధం గల వ్యక్తుల పేర్లను అతడు విచారణలో వెల్లడించాడు. ఆ జాబితాలో బోధన్‌కు చెందిన యువకుడి పేరు బహిర్గతమైంది. మరో ముగ్గురు ఈ ముఠాలో ఉండగా, వీరంతా ఉగ్ర సంస్థల నియంత్రణలో పనిచేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

READ MORE: Hydra: శంషాబాద్ లో 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా.. రూ.500 కోట్ల విలువ

Exit mobile version