35 Chinna Katha Kaadu : చిన్న సినిమాగా విడుదలై మంచి పేరు తెచ్చుకున్న సినిమా 35 చిన్న కథ కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించిన ’35 చిన్న కథ కాదు’ సినిమా అక్టోబర్ 2 సందర్భంగా ఆహా ఓటీటీలోకి వచ్చింది. ప్రస్తుతం ఆ సినిమా ఆహా ఓటీటీలో భారీ వ్యూయర్ షిప్ తో దూసుకుపోతుంది. నాలుగు రోజుల్లో ఈ సినిమా ఏకంగా 100 మిలియన్ మినిట్స్ వ్యూయర్ షిప్ దక్కించుకుంది. ఇంకా ఓటీటీలో దూసుకుపోతూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయబోతుంది. ఈ సినిమాలో నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి, గౌతమి, భాగ్యరాజా.. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ ’35 చిన్న కథ కాదు’ సినిమా తెరకెక్కింది. సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి ఈ సినిమాను నిర్మించగా నంద కిషోర్ ఈమాని దర్శకత్వం వహించారు. ఈ సినిమాని మెచ్చి రానా దగ్గుబాటి రిలీజ్ చేశాడు.
Read Also:Amit Shah: నేడు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ..
ఇక ఈ సినిమాలో నిత్యం ప్రతి ఇంటిలో జరిగే మంచి కథను ఎంచుకున్నారు. లెక్కల్లో ఎన్నో డౌట్స్ ఉన్న ఓ అబ్బాయికి లెక్కల టీచర్ కూడా పట్టించుకోకపోతే గృహిణి అయిన ఆ పిల్లాడి తల్లి అతన్ని ఆ లెక్కల గండం నుంచి ఎలా బయటపడేసిందని మంచి కామెడీ ఎమోషనల్ కంటెంట్ గా తెరకెక్కించారు. ఈ సినిమాలో నివేదా థామస్, చైల్డ్ ఆర్టిస్ట్ అరుణ్ అదరగొట్టేసారు. బ్రాహ్మణ కుటుంబంలో ఉండే మిడిల్ క్లాస్ గృహిణిగా, కొడుకు కోసం తపన పడే తల్లిగా, భర్తను దైవంగా భావించే భార్య పాత్రలో నివేద థామస్ ఆ పాత్రలో ఒదిగిపోయింది. అసలు నివేదా తప్ప ఆ పాత్ర ఇంకెవ్వరు చేయలేరనే విధంగా చేసి మెప్పించింది. చైల్డ్ ఆర్టిస్ట్ అరుణ్ లెక్కలు అర్ధం కాక, తనకి వచ్చే డౌట్స్ తో సతమతం అయ్యే పాత్రలో మొదట కామెడీ చేసినా ఆ తర్వాత మంచి ఎమోషన్ పండించాడు. అరుణ్ ప్రేక్షకులను కొన్ని సీన్లలో కంటతడి పెట్టించారు.
Read Also:Harmanpreet Kaur Injury: హర్మన్‌ప్రీత్‌కు ఏమైంది?.. శ్రీలంక మ్యాచ్‌లో ఆడుతుందా?
ఇక ప్రియదర్శి లెక్కల మాస్టర్ పాత్రలో కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశాడు. సినిమాలో ప్రియదర్శిని చూస్తే మన చిన్నప్పటి మ్యాథ్స్ టీచర్లు కచ్చితంగా గుర్తుకు వస్తారు. విశ్వదేవ్ అరుణ్ తండ్రి పాత్రలో పిల్లలకు చదువు రాకపోతే ఏమైపోతారో అనే కంగారు పడిపోయే మిడిల్ క్లాస్ ఫాదర్ గా మెప్పించాడు. తిరుమల, తిరుపతిలో అన్ని మాకు తెలుసు, దర్శనం, ప్రసాదం, రూమ్స్ అన్ని ఇప్పిస్తామని చెప్పే ఒక లోకల్ వ్యక్తిగా, అరుణ్ మామ పాత్రలో కృష్ణ తేజ బాగా చేశాడు. ప్రిన్సిపాల్ గా భాగ్యరాజా, నివేదాని గైడ్ చేసే పర్సన్ గా గౌతమి, చైల్డ్ ఆర్టిస్టులు అభయ్ శంకర్, అనన్య.. ఇలా అందరూ ఈ సినిమాలో చక్కగా నటించారు.