NTV Telugu Site icon

Boxing : ఆడాళ్లు.. మీకు జోహార్లు.. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ బరిలో నిఖత్ జరీన్

Boxing

Boxing

ఢిల్లీలో జరుగుతున్న ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత బాక్సర్లు దుమ్ముదులిపారు. ఏకంగా నలుగురు భారత బాక్సర్లు ఫైనల్ చేరగా వారిలో శనివారం తలబడిన ఇద్దరు బాక్సర్లు కూడా స్వర్ణాలు కైవసం చేసుకున్నారు. 48 కేజీల విభాగంలో తలబడిన 22 ఏళ్ల నీతూ గన్ గాన్, ఫైనల్ లో మంగోలియాకి చెందిన లూసాయ్ ఖాన్ అల్టాంట్ సెట్ సెగ్ పై 5-0 తేడాతో ఘన విజయం సాధించింది. 81 కేజీల విభాగంలో పోటీపడిన 30 ఏళ్ల స్వీటీ బుర్రా( సవిటీ బుర్రా ), చైనా బాక్సర్ వాంగ్ లీనాపై 4-3 తేడాతో గెలిచి వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణ పతకం అందుకుంది. 2006లో భారత బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్, మొట్టమొదటిసారిగా భారత్ తరపున ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ గెలిచింది.

Also Read : PK SDT: నెల రోజుల్లో కంప్లీట్ అయ్యింది… ఏప్రిల్ 5 నుంచి పవన్ ర్యాంపేజ్

ఈ విజయం నాకు చాలా స్పెషల్.. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ కోసం ఎంతో కష్టపడ్డాను. 2012 నుంచి బాక్సింగ్ చేస్తున్నా.. ప్రతీ విషయంలో నా కుటుంబం నాకు అండగా నిలిచింది.. నా ఊరు మొత్తం నన్ను ప్రోత్సహించింది.. బర్మింగ్ హమ్ లో జరిగిని కామన్వెల్త్ గేమ్స్ లో ఆడుతున్నప్పటి నుంచి నా కోసం వాళ్లు ప్రార్థిస్తున్నారు అని నీతూ గన్ గాన్ తెలిపారు. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ చూడడానికి మా ఊరి నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చారని నీతూ గన్ గాన్ తెలిపింది. మా ఊరు భీవానీలోని ధనన గ్రామానికి చెందిన వ్యక్తిని అంటూ నీతూ గన్ గాన్ పేర్కొంది. ఇప్పటికే 2015,2017 లో యూత్ వరల్డ్ ఛాంపియన్ షిప్ గెలిచిన నీతూ.. 2022 కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం సాధించింది. 2024 పారిస్ ఒలింపిక్స్ లో పతకం గెలవడమే లక్ష్యంగా నీతూని సిద్దం చేస్తున్నామని ఆమె కోచ్, ఒలింపిక్ మెడల్ విన్నర్ విజేందర్ సింగ్ అన్నారు.

Also Read : Rajahmundry Incident: గొంతు నులిమి… టీడీపీ నేతపై అర్థరాత్రి దుండగుల దుశ్చర్య

ఈ రోజు జరిగే ఫైనల్ లో మరో ఇద్దరు భారత బాక్సర్లు తలపడబోతున్నారు. తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ తో పాటు ఒలింపిక్ మెడలిస్ట్ లవ లీన్ బోరోహెన్ కూడా పసిడి వేటలో ఉన్నారు. 50 కేజీల విభాగంలో నిఖత్ జరీన్, నేటి సాయంత్రం 6 గంటలకు వియత్నాం బాక్సర్ గుయెన్ తి టామ్ తో తలపడనుంది. సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు లవ్ లీనా, ఆస్ట్రేలియా బాక్సర్ అన్నే పార్కర్ తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.