Site icon NTV Telugu

Arvind Kejriwal: నితీష్.. బీజేపీతో కలవడంపై కేజ్రీవాల్ ఏమన్నారంటే..!

Kejrival

Kejrival

బీహార్‌లో నితీష్‌కుమార్ సారథ్యంలో బీజేపీ-జేడీయూ కూటమి ఆదివారం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్, ఆర్జేడీ, లెప్ట్‌పార్టీల కూటమి నుంచి బయటకు వచ్చి కమలం పార్టీతో మద్దతు మరోసారి నితీష్‌కుమార్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. ఈ సందర్భంగా నితీష్‌ తీరుపై ఇండియా కూటమిలోని పలు పార్టీలు దుమ్మెత్తిపోశాయి. ఆయన తీరును తీవ్రంగా ఖండించాయి.

Read Also: Minister Roja: నాపై మాట్లాడినా వారందరూ కాలగర్భంలో కలసిపోయారు..

తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. బీహార్ రాజకీయ సంక్షోభంపై స్పందిస్తూ నితీష్‌ తీరును తప్పుపట్టారు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఇలా వ్యవహరించడం సరైంది కాదని హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ప్రవర్తన మంచిది కాదని వ్యాఖ్యానించారు. అయినా తన అంచనా ప్రకారం ఎన్డీఏ కూటమికి నష్టమే జరుగుతుందని.. ఈ పరిణామం ఇండియా కూటమికే లాభకరమని అభిప్రాయపడ్డారు.

Read Also: Arun Yogiraj: రామ్ లల్లా విగ్రహ శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన 5 అద్భుతమైన విగ్రహాలు..

గత నవంబర్‌లో జరిగిన రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి సరిగ్గా సహకరించకపోవడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. ఐక్యత లేకపోవడం వల్లే ఆ మూడు రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకోగల్గిందని కేజ్రీవాల్ విశ్లేషించారు. ఇండియా కూటమి అధ్యక్ష పదవి ఇవ్వలేదన్న కారణంతోనే నితీష్ బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ఏర్పాటైన ఇండియా కూటమిని చీల్చడంలో ప్రధాని మోడీ, అమిత్ షా మాత్రం సక్సెస్ అయ్యారు.

Exit mobile version